రాష్ట్రంలో చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా చేసే కందిపప్పు, పంచదార ధరలను పెంచుతూ పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇప్పటివరకు తెల్ల కార్డు లబ్దిదారులకు సబ్సిడీపై ఇస్తున్న చక్కెర, కందిపప్పుల ధరలు పెరగను న్నాయి. గతంలో కిలో కందిపప్పు రేషన్ దుకాణాలలో రూ. 40 ఉండగా.. దానిని రూ. 27 పెంపుదల చేసి రూ. 67కి అందించనున్నారు. అలాగే లబ్దిదారులకు అరకిలో చొప్పున అందిస్తున్న పంచదార ధర ఇప్పటి వరకు రూ. పది ఉండగా.. దానిని రూ. 17కు పెంచారు. వచ్చే నెల నుంచి ఈ ధరలు అమలులోకి రాను న్నాయి. అయితే దారిద్ర్య రేఖకు అత్యంత దిగువన ఉన్న అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకు (కేంద్ర ప్రభుత్వ పధకం) మాత్రం పాత ధరలకే ఆయా సరుకులు అందనున్నా యి. ఇదిలా ఉండగా.. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇలా పేదలకు ఉపయోగపడే వాటి పై, పొట్ట నింపుకునే వాటి పై, ధరలు పెంచటం పై అన్ని వైపు నుంచి విమర్శలు వస్తున్నాయి.

దీని పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్ స్పందించారు. ఒకేసారి, కేజీకి రూ.27 పెంచటం పై, ఆయన తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసారు. అయితే ఈ సందర్భంలో, రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఉన్న, ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పందించిన తీరులో లోకేష్ స్పందించారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు, తమ పార్టీ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని, ఇప్పటికే ఈ విషయం పై, ఎలక్షన్ కమిషన్ రెండు మూడు సార్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉపయోగించవద్దు అని చెప్పిందని ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పిన విషయం తెలిసిందే. అయితే పెరిగిన రేషన్ సరుకులు రేట్లు పై, లోకేష్ స్పందిస్తూ, జగన్ పార్టీని కొత్తగా పిలిచారు. ‘‘యుశ్రారైకాపా'' అంటూ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనే అర్ధం వచ్చేలా లోకేష్ స్పందిస్తూ, ''యుశ్రారైకాపా'' ప్రభుత్వం ఈ చేత్తో ఇచ్చి, ఆ చేత్తో లాగేసుకుంటుంది అని, రేషన్ సరుకుల రేట్లు పెంపుదల వల్ల, పేదల పై అదనంగా రూ.600 కోట్లు పడుతుందని అన్నారు.

టిడీపీ అధికార ప్రతినిధి, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వరుస పీట్టి, వైసీపీ ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలు అంటూ బయట పెడుతున్నారు. నిన్న 108 స్కాం బయట పెట్టిన పట్టాభిరాం, నేడు మరో అవినీతి గురించి ఆరోపణలు చేసారు. ఆయన మాట్లాడుతూ, "వైకాపా మాదిరి నిరాధార ఆరపణలు చేయడం తెలుగుదేశం పార్టీకి చేతకాదు. 108 వాహనాల కుంభకోణంపై వాస్తవాలు ప్రజల ముందు ఉంచాం. వారం రోజులు గడిచినా ఒక్క సారి కూడా విజయసాయిరెడ్డి దీనిపై స్పందించలేదు, కనీసం ట్వీట్ కూడా చేయలేదు. సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రి సహా ఒక్క వైకాపా నాయకుడు కూడా మీడియా ముందు వివరణ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు సరస్వతి ఇండస్ట్రీస్ కు సంబంధించిన అవినీతిని ప్రజల ముందు ఉంచుతున్నాను. సరస్వతి ఇండస్ట్రీస్ లో వాటాలు ఉన్నాయని సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినే 2019 ఎలక్షన్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆయన సతీమణి శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి గారికి కూడా భాగస్వామ్యం ఉన్నట్లు అనెక్జర్-2 లో తెలిపారు. 15.07.2008న సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కు సంబంధించి జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. అందులో డైరక్టర్ లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి, శ్రీమతి వైఎస్ విజయ గారు నాడు మీటింగ్ లో పాల్గొన్నారు. అప్పటి వరకు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ బైలాస్ లో సిమెంట్ కర్మాగార ప్రస్తావన లేదు."

"15.07.2008 న మీటింగ్ నిర్వహించి సిమెంట్ ఇండస్ట్రీస్ కూడా నిర్వహించేకునే విధంగా బైలాస్ లో సవరణ తీసుకొచ్చారు. కానీ 12.06.2008 న మైన్స్ అండ్ జియాలజీ నుంచి వచ్చిన మెమో ఆధారంగా సరస్వతి పవర్స్ ఇండస్ట్రీస్ కు గనులు కేటాయించినట్లు 18.05.2009న విడుదల చేసిన జీవో నెం.107 లో పేర్కొన్నారు. అంటే కంపెనీ బైలాస్ లో సిమెంట్ కంపెనీ ప్రస్తావణ రాకముందే.. సిమెంట్ కంపెనీకి భూకేటాయింపులకు సంబంధించిన ఫైల్ మూవ్ చేశారని అర్థమవుతోంది. నాడు మీ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక కంపెనీ బైలాస్ సవరించకుండానే.. భూకేటాయింపులకు సంబంధించి మెమోను మూవ్ చేసుకున్నారు. ఆరోజు సంబంధిత శాఖకు సెక్రటరీగా శ్రీమతి వై.శ్రీ లక్ష్మి గారు ఉన్నారు. ఈమె వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అనేక కుంభకోణాల్లో నిందితురాలిగా జైలుపాలైన ఐఏఎస్ అధికారిణి. ఇటువంటి అధికారుల భాగస్వామ్యంతో కంపెనీ బైలాస్ సవరించుకుండానే.. 613.70 హెక్టార్ల భూమిని కేటాయించుకున్నారు. సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి రెండేళ్ల తర్వాత కూడా ఎటువంటి అడుగులు పడకపోయేసరికి.. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఈ కంపెనీకి షోకాజ్ నోటీసును పంపింది. 17.02.2012న మొదటి షోకాజ్, 02.06.2012న రెండో షోకాజ్ ను అప్పటి ప్రభుత్వం సరస్వతి ఇండస్ట్రీస్ కు పంపడమైనది. షోకాజ్ నోటీసులకు కంపెనీ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడం, సరైన డాక్యుమెంట్లు అందించలేకపోవడం కారణంగా.. 23.08.2014న మైన్స్ అండ్ జియాలజీ శాఖ మైనింగ్ లీజును రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది."

"దీంతో 09.10.2014న అప్పటి ప్రభుత్వం మైనింగ్ లీజులు రద్దు చేస్తూ.. జీవో నెం.98 విడుదల చేసింది. మైనింగ్ లీజును రద్దు చేయడానికి గల కారణాలను కూడా ఆ జీవోలో అప్పటి ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. మైనింగ్ లీజులను పునరుద్ధించాలని కోరుతూ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ 06.11.2014న కోర్టును ఆశ్రయించింది. ఈ కంపెనీకి 29.03.2012 నుంచి ఏడేళ్ల పాటు 29.03.2019 వరకు కేంద్ర పర్యావరణ శాఖ నుంచి పర్యావరణ అనుమతులు వచ్చాయి. రోజుకు 2,855 ఎం.క్యూబ్ నీటిని మాత్రమే వినియోగించాలని కేంద్ర పర్యావరణ శాఖ కండిషన్స్ ను విధించింది. రోజుకు 2,855 ఎం.క్యూబ్ నీరు అంటే ఏడాదికి 0.0368 టీఎంసీల నీరు అవుతుంది. పర్యావరణ అనుమతుల కాలపరిమితి ముగియడటంతో.. రెన్యువల్ కు 19.02.2019న మరలా అప్లై చేశారు. అందులో రాష్ట్రంలో నూతన రాజధాని నిర్మాణం జరుగుతోందని.. అందుకు సిమెంట్ అవసరం ఉంది కనుక సిమెంట్ కంపెనీకి పర్యావరణ అనుమతులు ఇవ్వమని కోరారు. మీ కంపెనీ పర్మిషన్స్ కోసం రాజధాని గూర్చి చాలా గొప్పగా పొగిడారు. మీ వ్యాపారాల అవసరాల కోసం మాత్రమే మీకు రాజధాని గుర్తుకు వస్తుందా..? పర్యావరణ అనుమతుల కోసం కేంద్రానికి సమర్పించిన ఫాం నెం.1 ను కూడా అసత్యాలతో నింపారు. సిమెంట్ కంపెనీ నిర్మించాలనుకుంటున్న స్థలానికి సంబంధించిన జీవో ఏమైనా పెండింగ్ లో ఉందా..? అని ఫాం.నెం.1 లోని 22 వ పాయింట్ లో ఉంటే లేదని రాశారు. జీవో నెం. 98 అమలులో ఉంటే లేదని ఎలా రాశారు..? పాయింట్ నెం.24లో కోర్టులలో లిటిగేషన్స్ ఏమన్నా పెండింగ్ లో ఉన్నాయా..? ఉంటే పిటిసన్ నెంబర్లు పేర్కొనమంటే ‘నన్’ అని రాశారు."

"మీరు వేసిన రిట్ పిటిషన్ ను ఎందుకు పేర్కొనలేదు..? ముఖ్యమంత్రిగా ఉంటూ నీతి, నిజాయతీగా ఉండాల్సిన మీరు.. ఆ పదవిని అగౌరవపరిచేలా వ్యవహరిస్తున్నారు. వ్యాపార ప్రయోజనాల కోసం గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా మీకులా తప్పుడు అఫిడవిట్లు, తప్పుడు ఫాంలు సమర్పించలేదు, రాజ్యాంగబద్ధ సంస్థలను తప్పుదోవ పట్టించలేదు. మీరు తొక్కిపెట్టిన వాస్తవాలు తెలియక కేంద్రం కూడా పర్యావరణ అనుమతులను మూడేళ్లు పొడిగిస్తూ.. 03.07.2019న ఆర్డర్ ఇచ్చింది. అదే అప్లికేషన్ పార్ట్ నెం.2 సీరియల్ నెం.1.1లో 613.47 హెక్టార్ల భూమిలో 25.4 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని పేర్కొన్నారు. జీవో నెం.98 పై కంపెనీ వేసిన పిటిషన్ పై.. 15 అక్టోబర్,2019న కోర్టులో తుది విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాల్సిన అడ్వకేట్ జనరల్ కూడా పూర్తిగా కంపెనీ లాయర్ చెప్పిన ప్రతీదానికి తలఊపడంతో.. కోర్టు జీవో నెం.98ను కొట్టివేసింది. తీర్పు మీకు అనుకూలంగా వచ్చేందుకు కేటాయించిన మైనింగ్ భూములు పూర్తిగా ప్రైవేట్ భూములు అని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములకు వర్తించే శిక్షలు దీనికి వర్తించవని జీవో నెం.98 కొట్టివేయాలని కంపెనీ తరపున లాయర్ ప్రధానంగా వాదనలు వినిపించారు. పర్యావరణ అనుమతుల అప్లికేషన్ లో 25.4 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అంగీకరించి.. వాదనలలో ప్రభుత్వ భూమి లేదని ఎందుకు కోర్టును తప్పుదోవ పట్టించారు..? కోర్టు తీర్పు తర్వాత 12.12.2019న జీవో నెం.98ను కొట్టివేసి.. లీజులను రెన్యూవల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.109 విడుదల చేసింది."

"ఆశ్చర్యమేమిటంటే.. మైనింగ్ లీజులను రెన్యువల్ చేయడానికి 10 రోజుల ముందే ఇరిగేషన్ శాఖ మంత్రి 03.12.2019న కంపెనీకి 0.068 టీంఎంసీల నీటిని కేటాయించారు. పర్యావరణ అనుమతులలో 0.0368 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించాలనే నిబంధన ఉంటే.. దానికి రెట్టింపు నీటిని ఏవిధంగా సరస్వతి ఇండస్ట్రీస్ కు కేటాయించారు..? రైతులకు నీరు అందక ఇబ్బందులు పడుతుంటే.. మీ కంపెనీకి ఇష్టానుసారంగా నీటిని కేటాయిస్తారా..? ముఖ్యమంత్రి దగ్గర స్వామి భక్తి పోటీల్లో ముందుడాలని కారణంతో పందేల మంత్రి అనిల్ కుమార్ ఈ విధంగా నీటి కేటాయింపులు చేస్తారా..? అంటే చివరకు ముఖ్యమంత్రి ఒక నీటి దొంగలా కూడా మారారని అర్థమవుతోంది. పోలవరం ప్రాజెక్టులో ఒక రూపాయి అవినీతి జరగలేదని కేంద్రం క్లీన్ చిట్ ఇచ్చిన రోజునే.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నీటి బండారాన్ని బయటపెడుతున్నాం. దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ ఏం సమాధానం చెబుతారు..? నీటి కేటాయింపులను మొదటి ఐదేళ్లకు అని జీవోలో పేర్కొని.. తర్వాత జీవిత కాలానికి అని చెప్పి 15.05.2020న మరో జీవో నెం.16 విడుదల చేశారు. అంటే భవిష్యత్తులో కంపెనీ మూతపడితే నీరు అమ్ముకుని అయినా బ్రతికేద్దామనుకుంటున్నారా..?

ఇప్పటికే ఊరుకో ప్యాలెస్ కట్టుకున్న ముఖ్యమంత్రి.. ఇంకా ఎన్ని ప్యాలెస్ లు కట్టాలని ఈవిధంగా చేస్తున్నారు. సహజంగా జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తిలో పరివర్తన వస్తుంది.. కానీ మీలో ఎందుకు రావడం లేదు. వేమవరం, చెన్నాయపాలెంలలో సర్వే నెంబ్లర్లు మార్చడానికి.. 26.05.2020న ఒక జీవో నెం.28 ఇచ్చి, అలా కాదని 10 రోజుల్లోనే 08.06.2020 న మరో జీవో నెం.30 ఇచ్చారు. సర్వే నెంబర్లను మార్చే అధికారం మీకెక్కడిది..? వేటి ఆధారంగా జీవో నెంబర్లు మారుస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తుంటే.. ముఖ్యమంత్రి జీవోల పేరుతో రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారు. వైకాపా మాదిరిగా అసత్య ఆరోపణలతో కాకుండా.. సాక్షాధారాలను ప్రజల ముందు ఉంచుతున్నాం. 108 వాహనాల కుంభకోణంపై సమాధానం చెప్పలేక విజయసాయిరెడ్డి ముఖం చాటేసినట్లు.. అనిల్ కుమార్ కూడా కలుగులో దాక్కోకండి. 48 గంటల్లో టీడీపీ అడిగిన అన్ని ప్రశ్నలకు మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పండి.

అధికారంలోకి వచ్చిన తరువాత, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్రంలో అన్ని పంచాయతీ కార్యాలయాలకు, తమ సొంత పార్టీ రంగులు వేసుకున్న సంగతి తెలిసిందే. పంచాయతీ కార్యాలయాలు కాకుండా, మిగతా కొన్ని భవనాలకు కూడా వైసిపీ రంగులు వేసారు. అయితే దీని పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. పంచాయతీ కార్యాలయాలు అనేవి, ప్రజలు అందరూ వస్తారని, ఇదేమీ వైసిపీ ఆఫీస్ కాదని, చాలా మంది అభ్యంతరం చెప్పారు. అయితే, ఎన్ని విమర్శలు వచ్చినా, ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. దీంతో కొంత మంది కోర్టుకు వెళ్లారు. అయితే దీని పై హైకోర్టు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేస్తూ, పార్టీ రంగులు తీసేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే, హైకోర్టు నిర్ణయం పై, సుప్రీం కోర్టుకు వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే సుప్రీం కోర్టులో కూడా అక్షింతలు పడ్డాయి. మేము సుప్రీం కోర్టు బయట మా సీజీ ఫోటో పెట్టుకుంటే ఒప్పుకుంటారా ? లేకపోతే కేంద్ర సంస్థలు అన్నిటికీ కాషాయం వేస్తె ఒప్పుకుంటారా అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది, కేసు కొట్టేసింది. అయితే హైకోర్టు, సుప్రీం కోర్టు చెప్పినా, రంగులు తియ్యకపోవటంతో, మళ్ళీ కోర్టుకు వెళ్ళారు.

అంతే కాకుండా, మూడు రంగులకు తోడుగా, ఇంకో రంగు వేసి, రంగులు మార్చేసాం అని మభ్య పెట్టారు. దీంతో కోర్టు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేస్తూ, కోర్ట్ ధిక్కరణ ప్రక్రియ ప్రారంభించాలని కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం, గడువు లోపు, రంగులు మార్చేస్తాం అని కోర్టుకు చెప్పింది. దీంతో ఇప్పుడు ఇక జగన్ ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. హైకోర్టు, సుప్రీం కోర్టు వరుస పెట్టి, మొట్టికాయలు వెయ్యటం, కోర్టు ధిక్కరణ ప్రారంభించటం, గడువు దగ్గర పడుతూ ఉండటంతో, కొత్త రంగులు పై, అన్ని జిల్లాలకు ఆదేశాలు ఇచ్చింది. ప్రతి పంచాయతీ కార్యాలయాలకు రంగులు మార్చేయాలని, మొత్తం బిల్డింగ్ మొత్తం తెల్ల రంగులు వెయ్యాలని ఆదేశించింది. అయితే ఇదే సమయంలో, జగన్ మోహన్ రెడ్డి ఫోటో మాత్రం, బయట ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. వీలు అయినంత త్వరగా, ఈ ప్రక్రియ రెండు మూడు రోజుల్లో పూర్తి చెయ్యాలని, ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇప్పటికే ఈ ప్రక్రియ కొన్ని చోట్ల ప్రారంభించారు. దీనికి 14వ ఆర్ధిక సంఘం ఇచ్చిన నిధులు ఖర్చు చెయ్యాలని ఆదేశించింది. మొత్తానికి, జగన్ తగ్గక తప్పలేదు. ఒక ప్రభుత్వ కార్యాలయానికి పార్టీ రంగులు వెయ్యటమే తప్పు అనుకుంటే, దాన్ని కోర్టులు చెప్పినా వినకుండా, చివరకు రంగులు మార్చాక తప్పలేదు. అయితే జగన్ ఫోటో పెట్టటం కూడా తప్పు అని, దీని పై సుప్రీం కోర్టు ఇప్పటికే చెప్పింది అని, అది కూడా తీసేయాలనే వాదన కూడా వస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లో క-రో-నా పాజిటివ్ కేసుల సంఖ్య తీవ్రత అధికంగా ఉంది. పట్టణ, నగర, గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ క-రో-నా లక్షణాలున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రం లో ఈ రోజు ఉదయానికి రికార్డు స్థాయిలో 796కి చేరుకుంది. దీంతో రాష్ట్రంలో మొత్తం క-రో-నా పాజిటివ్ కేసుల సంఖ్య 12285కి చేరుకుంది. క-రో-నా పాజిటివ్ కేసుల సంఖ్య ఇంత ఉధృతంగా పెరగడమే కాకుండా గడిచిన వారం రోజులుగా సగటున రోజుకు 450కి పైగా కేసులు నమోదవ్వడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ ఉదయం వెల్లడించిన సమాచారాన్ని అనుసరించి రాష్ట్రంలో క-రో-నా గడిచిన ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో స్థానికంగా ఉన్న వారిలోను, , విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలోను కలిపి కొత్తగా 796 కరోనా పాజిటివ్ కేసులు నమోదయితే వాటిలో అత్యధికం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉండటం అధికార వర్గాల్లో కలవరం సృష్టిస్తోంది. రాష్ట్రంలో నిన్న కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులను గమనిస్తే వాటిలో 22,305 మంది స్థానికంగా వున్నవారికి చెందిన శాంపిల్స్ ను పరీక్షించగా 570 మందిలో కొత్తగా కరోనా పాజిటివ్ లక్షణాలున్న వారిని గుర్తించారు.

దీంతో రాష్ట్ర పరిధిలో నమోదైన కేసులు 10093 కి చేరు కొన్నాయి. ప్రస్తుతం 5652 మంది ఆస్పత్రుల్లో కోవిడ్ లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. గడిచిన ఒక్కరోజులో 11 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 157 కరోనా మరణాలు నమోదయ్యాయి. పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో గత 24గంటల వ్యవధిలో 51 మందిలో క-రో-నా పాజిటివ్ కేసులను కొత్తగా గుర్తించారు. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో మొత్తం 1815 మందిలో క-రో-నా పాజిటివ్ కేసులను గుర్తించారు. వీరిలో 704 మంది క-రో-నాకు ఆస్పత్రుల్లో చికిత్స పొందతున్నారు. గడిచిన ఒక రోజు వ్యవధిలో 5గురు విదేశీ యుల్లో క-రో-నా పాజిటీవ్ లక్షణాలు గుర్తించారు. దీంతో వీరితో పాటు - విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 377 మందిలో క-రో-నా పాజిటివ్ కేసులు గుర్తించారు. వీరిలో 292 మంది ఆస్పత్రుల్లో క-రో-నా చికిత్సలు పొందుతున్నారు. రాష్ట్రంలో క-రో-నా వైరస నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య వారం క్రితం 53శాతం వరకు ఉంటే గత వారం రోజులుగా ఈ శాతం 47.8కి తగ్గింది.

Advertisements

Latest Articles

Most Read