టీడీపీ ఎమ్మెల్సీ, బుద్దా వెంకన్న, విజయసాయి రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. "వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విఫల సాయి రెడ్డిగా మారారని ప్రజలు భావిస్తున్నారు. వైసీపీ లో ఉంటారా లేదా అని విజయసాయిని ఎవరూ అడగలేదు. అయినప్పటికీ చచ్చేదాకా వైసీపీలోనే ఉంటానని ఆయనకు ఆయనే చెప్పుకున్నారంటే..జగన్ తో గ్యాప్ వచ్చిందని స్పష్టంగా అర్ధమవుతోంది. పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాల వల్లే విజయసాయి ఇలాంటి స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. సీఎం జగన్ కారులో నుంచి దించాక విజయసాయిలో మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ఢిల్లీ, విశాఖ తనదే అన్నట్టు విజయసాయి రెడ్డి మాట్లాడారు. ఉత్తరాంధ్రకు అన్నీ తానై వ్యవహరించారు. ఏపీకి ముఖ్యమంత్రి జగనా లేక విజయసాయా అన్నంత సీన్ క్రియేట్ చేశారు. చివరకు తాను పార్టీలోనే ఉంటానని చెప్పుకోవడం ద్వారా విజయసాయిని జగన్ పక్కన పెట్టారన్నది అర్ధమవుతోంది. ఇంతకుముందు జగన్ ఢిల్లీ పర్యటనలో అన్నీ తానై విజయసాయి వ్యవహరించేవారు. ఇప్పుడు జగన్ ఢిల్లీ టూర్ అనగానే విధేయుడినని తనకు తానే చెప్పుకోవాల్సిన పరిస్థితి విజయసాయికి వచ్చింది. విజయసాయి దందాలే ఈ పరిస్థితికి కారణం. ప్రశాంతమైన ఉత్తరాంధ్రను విజయసాయి అండ్ గ్యాంగ్ దోచేస్తున్నారు."

"వైసీపీ సోషల్ మీడియా తానే చూసుకుంటానని విజయసాయి చెబుతుంటే.. సోషల్ మీడియా మురుగు గుంట అని సజ్జల రామకృష్ణా రెడ్డి అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా మీరు చేస్తున్న పనులన్నీ చెత్త అని సజ్జల చెప్పకనే చెప్పారు. సోషల్ మీడియాలో హైకోర్టుకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వ్యక్తులను విజయసాయి కాపాడబోతున్నారా? చంద్రబాబు, లోకేష్ పై అసత్యపు ట్వీట్లు పెట్టడమే విజయసాయి పని. ఒక బాధ్యతాయుతమైన రాజ్యసభ ఎంపీగా ఉండి న్యాయవ్యవస్థను దూషించే వారిని కాపాడతానని విజయసాయి ఎలా చెప్పగలుగుతున్నారు? 16 నెలలు జైల్లో ఉండొచ్చారు విజయసాయి. వయసుకు తగిన మాటలు మాట్లాడటం లేదు. పదవిని దేనికైనా వాడుకోవచ్చని ఆయన భావిస్తున్నారు."

"సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించింది విజయసాయి రెడ్డే. ప్రభుత్వాలు మారుతుంటాయి. పదవులు వస్తుంటాయి పోతుంటాయి. మాట్లాడేప్పుడు ఆచితూచి మాట్లాడాలి. గాంధేయ మార్గం గురించి మాట్లాడుతున్న విజయసాయి తనపై , జగన్ పై నమోదైన కేసులపై సమాధానం చెప్పాలి. కేసులున్నాయని నిజాయితీగా ఒప్పుకోగలరా? మిడతలు పంటను నాశనం చేస్తుంటే... పచ్చగా ఉన్న విశాఖను విజయసాయి అండ్ గ్యాంగ్ నాశనం చేస్తున్నారు. వైసీపీ ఏడాది పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. వైన్ షాపు, చిల్లర కొట్టు, గుడి, బడి దగ్గరకు వెళ్లి అడగండి మీ పాలన గురించి తెలుస్తుంది. వైసీపీ పాలన బాగుందని ఒక్కరు చెప్పినా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. న్యాయవ్యవస్థపై గౌరవం ఉందని చెబుతున్న విజయసాయి రెడ్డి లక్షల కోట్లు దోచేశామని నిజాయితీగా ఒప్పుకోవాలి. ఓ వైపు ప్రజలను రెచ్చగొడుతూ మరోవైపు కోర్టులను తప్పుబడుతున్న విజయసాయి రెడ్డి ...ఎంపీగా ఉండేందుకు అనర్హుడు. ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి." అని అన్నారు.

 

చివరి క్షణంలో, జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. చివరి క్షణంలో, అంటే, మొత్తం ఢిల్లీ పర్యటనకు సిద్ధం అవుతున్న వేళ, ఇది జరిగింది. తాడేపల్లి ఇంటి నుంచి, గన్నవరం ఎయిర్ పోర్ట్ వరకు, ట్రాఫిక్ కూడా క్లియర్ చేసి, జగన్ కాన్వాయ్ కోసం ఎదురు చూస్తున్న వేళ, జగన్ ఢిల్లీ పర్యటన రద్దు అయ్యింది అనే వార్త వచ్చింది. దీంతో అసలు ఎందుకు వాయిదా వేసుకున్నారు. ఏమి జరిగింది, అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు. చివరి నిమిషంలో, ఎందుకు రద్దు అయ్యింది అనే విషయం పై, ప్రభుత్వం ఏమి చెప్తుందో చూడాలి. ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, అమిత్ షా అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది. మళ్ళీ అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చిన తరువాత, జగన్ వెళ్ళే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే రాష్ట్ర బీజేపీ నేతలు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అన్నీ వివరించి, రాజకీయ పరమైన అంశాలు అయితే, జగన్ తో అపాయింట్మెంట్ వద్దు అని అమిత్ షా పై ఒత్తిడి తెచ్చినట్టు కూడా సమాచారం.

జగన్ ఈనెల రోజు ఢిల్లీ వెళ్తారని, నిన్న వార్తలు వచ్చాయి. కరోనా లాక్ డౌన్ పరిస్థితుల తరువాత తొలి సారిగా జగన్మోహనరెడ్డి ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారని చెప్పారు. రాష్ట్రానికి సంబంధజంచిన వలు అంశాలతో పాటు జగన్ అమిత్ షాతో చర్చించిస్తారని చెప్పారు. కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రంగాలను ఆదుకోవాల్సిందిగా జగన్ అమిత్ షాను కోరనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధానికి సవివవరంగా, రెండు లేఖలు రాసారు. కౌనిల్స్ రద్దు అంశంతో పాటు పాటు ఎస్ఈసీ వ్యవహారం కుడా ఇరువురి మధ్యా చర్చకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అమిత్ షాతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులతోను ముఖ్యమంత్రి బేటీ కానున్నట్లు చెప్పారు. అయితే, ఇప్పుడు పర్యటన వాయిదా పడటంతో, మళ్ళీ ఢిల్లీ ఎప్పుడు వెళ్తారో తెలియాల్సి ఉంది.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీలో వివక్షనేత నారా చంద్రబాబు నాయుడుపై నందిగామ పోలీసు స్టేషనులో కేసు నమోదైంది. ఆయన ఇటీవల హైదారాబాద్ నుంచి ఏపీ రాష్ట్రంలోకి అడుగుపెట్టే సమయంలో చంద్రబాబు నాయుడు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని స్థానిక న్యాయవాది శ్రీనివాస్ నందిగామ పోలీసు స్టేషన్లో చేసిన ఫిర్యాదు పై కేసును నమోదు చేసారు. మార్చినెల 22వ తేదిన చంద్రబాబు హైదారాబాదు చేరుకున్నారు. లాక్ డౌన్ ప్రకటనలతో రెండు నెలల దాదాపు అక్కడే చంద్రబాబు ఉన్నారు, లాక్ డౌన్ నాలుగువ విడుతలో నిబంధనల సడలింపు నేపథ్యంలో ఈ నెల 25వ తేదిన తన కుమారుడు నారా లోకేష్ కలిసి ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా గరికపాడు చెక్ పోస్టు దగ్గర నుంచి జగ్గయ్య పేట, కంచికచర్లలలో ఆయనకు టిడిపి కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. దీంతో లాక్ డౌన్ నిబంధనలకువ విరుద్దంగా జనసమీకరణకు చంద్రబాబు కారణమయ్యారని లాయర్ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.

దీంతో ఐపిసి 188 సెక్షను కింద పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేసారు. ఏపీలో రాష్ట్రంలో అడుగు పెట్టే నమయంలో ఏపీ, తెలంగాణా సరిహద్దు ప్రాంతంతో పాటు ఏపీలోని పలు చోట్ల లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని హైకోర్టులో చంద్రబాబుపై పబ్లిక్ లిటిగేషన్ పిటిషిన్ ఇప్పటికే దాఖలైంది. చంద్రబాబు హైదారాబాద్ నుంచి ఆంధ్రాకు వచ్చే ముందు ఆయన డీజీపీ గౌతమ్ నవాంగ్ నుంచి విమానంలో విశాఖకు వెళ్ళడానికి, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లి సమీపంలోని తన నివాసగృహనికి వెళ్ళడానికి అనుమతి తీసుకున్నారు. అయితే విమాన సర్వీసులు లేకపోవడంతో రోడ్డు మార్గన ఆయన తన ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంలో టిడిపి కార్యకర్తలు పలు కూడళ్ళలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని, చంద్రబాబు స్వయంగా వారిని ప్రోత్సహించారనే అభియోగాలు వైసీపీ చేసింది. అయితే చంద్రబాబు ఎక్కడా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించలేదని, ఇది అన్-ప్లాన్డ్ ట్రిప్ అని, చంద్రబాబు కారులోనే ఉండి అభివాదం చేసారని, కార్యకర్తలు మాస్కులు వేసుకునే ఉన్నారని, ఎక్కడికక్కడ వారిని దూరంగా ఉండమని చెప్తూ ముందుకు కదిలారని, టిడిపి అంటుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, స్థానిక సంస్థలు ఎన్నికల నిర్వహణ ఏమో కాని, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ విషయంలో మాత్రం వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మార్చి నెలలో నోటిఫికేషన్ రావటం, నామినేషన్ పర్వంలో, ఎప్పుడూ లేనంత హింస, అత్యధిక ఏకాగ్రీవాలు, ఏకంగా ఒక ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే పైనే దాడి చెయ్యటం, ఇవన్నీ అప్పటి ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ పై వేలు ఎత్తి చూపించేలా చేసాయి. అయితే తరువాత ఆయన జరిగిన హింస పై చర్యలు తీసుకోవటం, అలాగే కరోనా ఉంది కాబట్టి, ఎన్నికలు వాయిదా వెయ్యటంతో, అధికార పక్షం బుస్సున పైకి లేచింది. ముఖ్యమంత్రి నేన, రమేష్ కుమారా అంటూ, మరో రాజ్యంగా సంస్థ పై, దాడి మొదలైంది. ఆ కక్ష, చివరకు ప్రత్యెక ఆర్దినెన్స్ తెచ్చి, ఏకంగా ఎన్నికల కమీషనర్ నే తప్పించే అంత, సాహసం చేసింది. ఆ కొత్త ఆర్దినెన్స్ ప్రకారం, జస్టిస్ కనకరాజ్ సీన్ లోకి వచ్చారు. కొత్త ఎన్నికల కమీషనర్ అయ్యారు. అయితే, ఇది రాజ్యాంగం ప్రకారం కుదరదు అంటూ, కోర్ట్ మెట్లు ఎక్కారు.

దీంతో కోర్ట్ కూడా, వారి వాదన ఏకీభవీస్తూ, ఆర్దినెన్స్ కొట్టేసి, కనకారాజ్ నియామకం జీవో కొట్టేసి, మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ కు అవకాశం ఇచ్చింది. కోర్ట్ తీర్పు ప్రకారం, నిమ్మగడ్డ మళ్ళీ పదవిలోకి వచ్చారు. అయితే ప్రభుత్వం మాత్రం, ఇందుకు ఇష్టంగా లేదు. ఎలాగైనా రమేష్ కుమార్, మళ్ళీ ఆ పదవిలోకి రాకూడదు అనే తలంపుతో, హైకోర్ట్ లో మరో పిటీషన్ వేసింది, అలాగే సుప్రీం కోర్ట్ లో కూడా హైకోర్ట్ తీర్పు పై అపీల్ చేసింది. ఈ తతంగం అంతా జరుగుతూ ఉండగానే, ఇప్పుడు మరో కొత్త ఎన్నికల కమీషనర్ ను నియమించే ఏర్పాట్లు మొదలు అయ్యాయి. ఒక వేళ కోర్టులు స్టే ఇస్తే, వెంటనే మరో కొత్త ఎన్నికల కమీషనర్ ను నియమించటానికి, నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి మన్మోహన్‌సింగ్‌ ను నియమించే ప్రయత్నం చేస్తుంది. ఆర్దినెన్స్ ద్వారా కాకుండా, పాత చట్టం ప్రకరామే, ఈ నియామకం ఉండేలా, ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరి, చివరకు ఏమి అవుతుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read