నర్సీ వట్నం డాక్టర్ సుధాకర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తనకు వైద్యం అందించే విషయంలో ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ డాక్టర్ సుధాకర్ హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. తనకు సరైన వైద్యం అందించడం లేదని సంబంధంలేని మందులు ఇవ్వడంతో ఆరోగ్యం దెబ్బతింటోందని ఇటీవల సుధాకర్ ఏపీ హైకోర్టుకు లేఖ రాసిన విషయం విధితమే. వైద్య సేవలందిస్తున్న డాక్టర్‌పై అభ్యంతకరం తెలపడంతో ఆసుపత్రి సూరింటిండెంట్ డాక్టర్ రాధారాణి ఇప్పటి వరకూ సుధాకరకు వైద్యం అందిస్తున్న రామిరెడ్డిని మార్చి ఆయన స్థానంలో మరో వైద్యురాలిని నియమించారు. డాక్టర్ రాధారాణి పర్యవేక్షణలో డాక్టర్ మాధవీలత సుధాకరకు వైద్య సేవలందించనున్నారని ఆనుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా డాక్టర్ సుధాకర్‌కు మరో రెండు వారాల పాటు చికిత్స అందించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. తన మానిసిక పరిస్థితి బాగుందని డాక్టర్ సుధాకర్ చెప్తున్నప్పటికీ ఆయన మానసిక సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు చెప్తున్నారు.
దీనిపై కుటుంబ సభ్యులతో చర్చించిన వైద్యులు సుధాకర్ ను ఇద్దరు కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో ప్రత్యేక గదిలో ఉంచి వైద్య సేవలందించడానికి నిర్ణయించాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా డాక్టర్ సుధాకర్ కేసు విషయమై హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ రెండవ రోజు తన దర్యాప్తును షురూ చేసింది. ఆదివారం కేజీహెచ్ కు చేరుకున్న సీబీఐ అధికారులు సుధాకరకు వైద్య సేవలందించిన డాక్టర్లు, హౌస్ సర్జన్ల నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అంతేగాకుండా కొన్ని రికార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. అంతే గాకుండా ఆరోజు రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి ఆనువత్రి సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అదేవిధంగా ఫోర్త్ టౌన్ పోలీసు స్టేషన్లో సిబ్బందిని విచారించేందుకు సిద్ధమయ్యారు. విశాఖ పోలీసులపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎఎస్ఐతో పాటు ఆరుగురు కాని స్టేబుళ్లపైనా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా మానవహక్కుల ఉల్లంఘన నేరం కింద, పర్యవేక్షక బాధ్యతలు చేపట్టిన వారిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.