ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారంపై ఏపీ హైకోర్టు శుక్ర వారం సంచలన తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తిరిగి నియమించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషనర్ విషయంలో నిబంధనలను మారుస్తూ ప్రభుత్వం తీసుకున వచ్చిన ఆరి నెన్స్ ను కొట్టివేసింది. కమిషనర్‌ను తొలిగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నింటిని రద్దు చేసింది. ఆర్టికల్ 213 ప్రకారం ప్ర స్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ఈ క్షణం నుంచి రమేష్ కుమార్ ఎన్నికల కమీషనర్‌గా కొనసాగుతారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
నిమ్మగడ్డ తొలి గింపు పై మొత్తం 13పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటినిపై విచారించిన తరువాత ఇటీవల తీర్పును రిజర్వులో ఉంచినట్లు ప్రకటించింది. నిన్న తీర్పును వెలువరించింది. హైకోర్టు నిమ్మగడ్డకు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టుకు అప్పిలకు వెళ్ళాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. తీర్పు పూర్తిపాఠం కాపీలు రాగానే హైకోర్టులో పిల్ దాఖలు చేయనున్నట్లు ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. హైకోర్టులో అనేక కీలకంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్న క్రమంలో సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరిపింది. ఈసీ వ్యవహరంలో అన్ని అంశాలను పునరాలోచన చేసి సుప్రీం కోర్టుకు నివేదించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా మళ్లీ పదవిలోకి వచ్చానని డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఏపీ హైకోర్ట్ తీర్పును అనుసరించి తాను బాధ్యతల్లోకి వచ్చినటేనని స్పష్టం చేసారు. ఎస్ఈసీ వ్యవహరంలో హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు కు వెళ్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు స్పష్టం చేసారు. తీర్పు పై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు వివరించారు. అయితే, ప్రభుత్వం సుప్రీం కోర్ట్ కు వెళ్తుందని తెలుసుకోవటంతో, ఈ కేసులో న్యాయవాదిగా ఉన్న నర్రా శ్రీనివాసరావు, సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో స్టే కోసం పిటీషన్ దాఖలు చేస్తే, తమ వాదన విన్న తరువాతే, ఏ నిర్ణయం అయినా తీసుకోవాలి అంటూ, పిటీషన్ దాఖలు చేసారు.