ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారంపై ఏపీ హైకోర్టు శుక్ర వారం సంచలన తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తిరిగి నియమించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషనర్ విషయంలో నిబంధనలను మారుస్తూ ప్రభుత్వం తీసుకున వచ్చిన ఆరి నెన్స్ ను కొట్టివేసింది. కమిషనర్‌ను తొలిగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నింటిని రద్దు చేసింది. ఆర్టికల్ 213 ప్రకారం ప్ర స్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ఈ క్షణం నుంచి రమేష్ కుమార్ ఎన్నికల కమీషనర్‌గా కొనసాగుతారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

నిమ్మగడ్డ తొలి గింపు పై మొత్తం 13పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటినిపై విచారించిన తరువాత ఇటీవల తీర్పును రిజర్వులో ఉంచినట్లు ప్రకటించింది. నిన్న తీర్పును వెలువరించింది. హైకోర్టు నిమ్మగడ్డకు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టుకు అప్పిలకు వెళ్ళాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. తీర్పు పూర్తిపాఠం కాపీలు రాగానే హైకోర్టులో పిల్ దాఖలు చేయనున్నట్లు ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. హైకోర్టులో అనేక కీలకంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్న క్రమంలో సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరిపింది. ఈసీ వ్యవహరంలో అన్ని అంశాలను పునరాలోచన చేసి సుప్రీం కోర్టుకు నివేదించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా మళ్లీ పదవిలోకి వచ్చానని డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఏపీ హైకోర్ట్ తీర్పును అనుసరించి తాను బాధ్యతల్లోకి వచ్చినటేనని స్పష్టం చేసారు. ఎస్ఈసీ వ్యవహరంలో హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు కు వెళ్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు స్పష్టం చేసారు. తీర్పు పై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు వివరించారు. అయితే, ప్రభుత్వం సుప్రీం కోర్ట్ కు వెళ్తుందని తెలుసుకోవటంతో, ఈ కేసులో న్యాయవాదిగా ఉన్న నర్రా శ్రీనివాసరావు, సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో స్టే కోసం పిటీషన్ దాఖలు చేస్తే, తమ వాదన విన్న తరువాతే, ఏ నిర్ణయం అయినా తీసుకోవాలి అంటూ, పిటీషన్ దాఖలు చేసారు.

సాక్షి పత్రికలో తన ఇంటర్వ్యూ పై వచ్చిన కధనం పైన, బీజేపీ జాతీయ నేత, రాం మాధవ్ ఘాటుగా స్పందించారు. తన పేరు మీద సాక్షిలో వచ్చిన కధనాన్ని ఆయన ఖండించారు. తన మాటలకు సాక్షి పత్రిక వక్రీకరించి రాసింది అని అన్నారు. దీని పై స్వయంగా తానే లేఖ రాసి, రాం మాధవ్ మీడియాకు విడుదల చేసారు. జగన్ దృఢసంకల్పంతో పని చేస్తున్నారు అంటూ, తన పై రాసిన కధనం పై ఆయన ఈ స్పష్టత ఇచ్చారు. సాక్షి కధనంలో తన వ్యాఖ్యలను సరిగ్గా ప్రతిబింబిన్చాలేదాని, రాం మాధవ్ అన్నారు. మోడి ప్రభుత్వం, ఏడాది పాలన పై సాక్షి తనను సంప్రదించింది అని, 40 నిమిషాల దాకా సాగిన ఈ ఇంటర్వ్యూ లో, చివరి భాగంలో, సాక్షి ప్రతినిధులు, ఏపిలో ప్రభుత్వం పని తీరు పై తనను ప్రశ్నలు అడిగారని, ఆ లేఖలో స్పష్టం చేసారు రాం మాధవ్. మూడు రాజధానులు నుంచి, నిన్నటి తిరుమల విషయం వరకు, అనేక విషయాలు వివాదాస్పదం అయ్యాయని, ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని తాను చెప్పానని, రాం మాధవ్ చెప్పారు.

టిటిడి భూములు విషయంలో, వెనక్కు తగ్గిన విషయాన్నీ స్వాగతిస్తూనే, మొదట అమ్మేయాలని తీసుకున్న నిర్ణయాన్ని తాను తప్పుబట్టానని అన్నారు. ముఖ్యమంత్రికి తెలిసి అన్ని నిర్ణయాలు జరుగుతాయని అనుకోవటం లేదని, కాని అన్ని విషయాలు ఆయన తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలని చెప్పానని రాం మాధవ్ అన్నారు. రాష్ట్రానికి అన్ని రకాలుగా సహాయం చెయ్యటానికి, కేంద్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, గతంలో చంద్రబాబు ప్రభుత్వానికి ఎలా సహకారం అందించామో, ఇప్పుడు కూడా అలాగే సహకారం అందిస్తున్నాం అని చెప్పానని ఆ లేఖలో తెలిపారు. ఏపిలో బీజేపీ ప్రతిపక్షంలో ఉందని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా, మేము వ్యవహరిస్తామని చెప్పానని, గుర్తు చేసారు. ఆ మాత్రాన, మేము రాష్ట్రాభివృద్ధికి వ్యతిరేకం కాదని, అర్ధం చేసుకోవాలని అన్నారు. నేను చెప్పింది ఇది అయితే సాక్షి వేరేది రాసింది అని, వాళ్ళు మొత్తం 40 నిమిషాల ఇంటర్వ్యూ ప్రసారం చేస్తే, మొత్తం అర్ధం అవుతుందని అన్నారు.

హైకోర్టు తీర్పుతో తిరిగి ఎస్​ఈసీగా బాధ్యతలు స్వీకరించినట్లు రమేష్ కుమార్ తెలిపారు. వ్యక్తుల కన్నా వ్యవస్థ గొప్పదని వాటిని కాపాడాల్సిన బాధ్యత ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి ఉందని చెప్పారు. "ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తిరిగి నేను విధుల్లో చేరాను. గతంలో వ్యవహరించిన మాదిరిగానే నేను నా విధులను నిస్పక్షపాతంగా నిర్వర్తిస్తాను. పరిస్థితులు చక్కబడిన వెంటనే రాష్ట్రంలో ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియను తిరిగి చేపడతాను. ఇందులో భాగస్వామ్యమైన వ్యక్తులతో రాజకీయ పార్టీలతో చర్చించిన మీదట ముందుకెళతాం. వ్యక్తులు ఎప్పుడూ శాశ్వతం కాదు. రాజ్యాంగ వ్యవస్థలు, అవి పాటించే విలువలే శాశ్వతం. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేసి ఆ పదవుల్లోకి వచ్చిన వారికి ఆ వ్యవస్థలను రక్షించాల్సిన ఆవశ్యకత, వాటి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటాయి. " అని అన్నారు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో ప్రభుత్వం చేసింది రాజ్యాంగ ఉల్లంఘనే అని పిటిషనర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అనుమతితోనే పిటిషన్ వేశానని ఆయన చెప్పారు. కరోనా విషయంలో ప్రభుత్వం మొదట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న ఆయన...రాజధాని విషయంలో కూడా ప్రభుత్వం తప్పులు చేస్తోందన్నారు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో కూడా ప్రభుత్వ వైఖరి సరిగా లేదని తెలిపారు. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు పాజిటివ్​గా తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తన వద్ద తప్పులు పెట్టుకుని వ్యవస్థలను నిందించడం సరికాదన్నారు. నిమ్మగడ్డను తప్పించిన తీరు, కనకరాజ్‌ను నియమించిన తీరు దోషపూరితంగా ఉందని కామినేని వ్యాఖ్యానించారు.

టీడీపీ మాజీ మంత్రి
అచ్చెన్నాయుడు, స్పందించారు "రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాల్సిందేనన్న హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. హైకోర్టు తీర్పుతో ఏపీలో ఇంకా ప్రజాస్వామ్యం బతికేఉందన్న నమ్మకం కలిగింది. ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ తప్పూ చేయలేదని మేము చెబుతూనే ఉన్నాం.. కరోనా ఉధృతి నేపథ్యంలో నిమ్మగడ్డ ముందుచూపుతో ఎన్నికలు వాయిదా వేశారు. ఎన్నికల వాయిదాను జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల అధికారిని కులం పేరుతో దూషించారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడి ఇబ్బందులకు గురిచేశారు. ఏడాదిలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో అరాచకాలు చేసింది. ప్రజాస్వామ్యాన్ని, అపహాస్యం చేసింది. వ్యవస్థలను నాశనం చేసింది. న్యాయవ్యవస్థ వల్లే ఏపీలో ప్రజాస్వామ్యం కాపాడబడింది. హైకోర్టు తీర్పు ఈ ముఖ్యమంత్రికి రెండు వైపులా చెడాపెడా కొట్టే విధంగా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన జీవోలన్నింటినీ హైకోర్టు రద్దు చేసింది . సిగ్గుంటే ఈ ముఖ్యమంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి." అని అన్నారు

ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారం పై, ఈ రోజు హైకోర్ట్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. స్టేట్ ఎలక్షన్ కమిషన్ నియామకం విషయంలో, సంస్కరణలు పేరుతో, నిబంధనలు మారుస్తూ తీసుకోవచ్చిన ఆర్డినెన్స్ ను హైకోర్ట్ కొట్టేసింది. ఈ ఒర్దినన్స్ తెచ్చి, రమేష్ కుమార్ ని తొలగిస్తూ జీవో ఇచ్చి, కనకరాజ్ ను నియమిస్తూ మరో జీవో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇవి కూడా కోర్ట్ రద్దు చేసింది. దీంతో రమేష్ కుమార్ మళ్ళీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నియామకం అయ్యారు. ఆర్టికల్ 213 ప్రకారం, ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం, ప్రభుత్వానికి లేదని, కోర్ట్ స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై, కోర్టులో ఎదురు దెబ్బ తగలటం పై, సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వానికి అవగాహన లేక, ఇలా జరుగుతుంది అని, 151 కాదని, 175 సీట్లు వచ్చినా, చట్టాలను గౌరవిస్తూ, ముందుకు వెళ్ళాలని, నాకు బలం ఉంది, నా ఇష్టం అంటే, మన దేశ ప్రజాస్వామ్యంలో కుదరదు అని, చట్టాల ప్రకారం అందరూ నడుచుకోవాల్సిందే అంటూ, వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో, జగన్ కు సొంత పార్టీ నుంచే షాక్ తగిలింది.

వైసీపీ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు, హైకోర్ట్ ఇచ్చిన తీర్పుని స్వాగతించారు. రమేష్ కుమార్ ని, మళ్ళీ పదవిలో తీసుకుంటూ, జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్సును హైకోర్టు రద్దు చెయ్యటం పై, రఘురామ కృష్ణ రాజు, స్వాగతించారు. హైకోర్ట్ ఇలా చేస్తుంది అని, నాకు ముందుగానే తెలుసు అని, రఘురామ కృష్ణ రాజు అన్నారు. ఈ తీర్పు నాకు అయితే, ఎలాంటి ఆశ్చర్యం కలగించలేదని, ఇలాగే వస్తుంది అని నాకు ముందే తెలుసు అని, రఘురామ కృష్ణం రాజు అన్నారు. గతంలోనే ఇలాంటి విషయాల పై తీర్పులు ఉన్నాయని అన్నారు. రాజ్యాంగ పదవులకు, పదవీ కాలం తగ్గించేలా ఆర్డినెన్స్ లో చెల్లవు అని గతంలోనే కోర్టులు చెప్పాయని అన్నారు. ఎన్నికల సంస్కరణలు మంచిదే అయినా, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం దురదృష్టం అని అన్నారు. నిర్ణయాలు తెసుకునే ముందు, అందరితో సంప్రదించి, తీసుకుంటే మంచిది అని అన్నారు. సొంత పార్టీ నేతలు, ఇష్టం వచ్చినట్టు, హైకోర్ట్ పై మాటలు చెప్పటం దారుణం అని అన్నారు. ఇలాంటి వారిని శిక్షిస్తే తప్పు లేదని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read