విశాఖపట్నం, నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసులో, మరో సంచలానికి తెర లేపేలా, డాక్టర్ సుధాకర్ తల్లి, సంచలన ఆరోపణలు చేసారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, తమకు కొంత మంది ఫోనులు చేసి రాజీకి రమ్మని కోరుతున్నారని, తన కొడుకు తప్పు చేసినట్టుగా ఒప్పుకోమన్నారని ఆరోపించారు. తన కుమారుడు ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేసిన డా.సుధాకర్ తల్లి, రాష్ట్ర ప్రభుత్వం తమ కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. పరువుగల తమ కుటుంబాన్ని బజారుకీడ్చారని ఆవేదన వ్యక్తం చేసారు. న్యాయస్థానాల్లో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు డా.సుధాకర్ మాతృమూర్తి. ఘటన జరిగిన రోజు నుంచి, ఎంతో మంది తమకు అండగా నిలిచారని, అప్పటి నుంచి ప్రభుత్వం తరుపు నుంచి ఎవరూ రాలేదు కాని, ఈ రోజు నుంచి తనకు ఫోనులు వస్తున్నాయని, మీ అబ్బాయికి జాబ్ ఇచ్చేస్తాం, ఇంకా ఈ విషయం పై ఏమి మాట్లాడ వద్దు అంటూ, ఫోన్లు చేస్తున్నారని, ఎలా ఒప్పుకుంటాం అంటూ, ఆమె మీడియాకు తెలిపారు.

మా బాబుకి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఎవరూ రాలేదు కాని, ఈ రోజు కోర్ట్ కు వెళ్ళటం, కేసు కోర్టులో ఉండటంతో, ఇప్పుడు మేము వీళ్ళకు కనిపించాం అని అన్నారు. ఇప్పుడు వచ్చి జాబ్ ఇచ్చేస్తాం అని అంటున్నారని, జాబు తీసుకుంటాం కాని, ముందు మీరు చేసిన తప్పు ఒప్పుకోవాలని అన్నారు. ఏమి మాట్లాడవద్దు అని అంటున్నారని, వీళ్ళను నమ్మి, నా కొడుకుని ఇంత చేసిన వాళ్ళని ఎలా నమ్మి, నోరు మూసుకుని కూర్చోమంటారు అంటూ ప్రశ్నించారు. రేపు కోర్ట్ తీర్పు ఉందని, వాళ్ళు ఏమి చెప్తే అది చేస్తాం అని అన్నారు. మా కుమారుడికి జాబ్ ఇచ్చేస్తాం అంటున్నారు, ఇది అందరి సమక్షంలో జరగాలి, చేసినవి అన్నీ ఒప్పుకోవాలి, మా బాబు అడిగిన న్యాయమైన డిమాండ్ తీర్చాలి, ఏదైనా అందరి ముందుకు జరగాలి అని అన్నారు.

మమ్మల్ని తప్పు ఒప్పుకోమని అంటున్నారని, హాస్పిటల్ లో ఏమి జరుగుతుందో తెలియటం లేదని, మా బాబుని కూడా బలవంత పెడుతున్నారేమో అనిపిస్తుంది అని, ఆ హాస్పిటల్ లో వేసారు అంటేనే, ఇబ్బంది పెట్టటానికి కదా అని సుధాకర్ తల్లి వాపోయారు. వాళ్ళే అక్కడకు వెళ్తున్నారు, మా బాబు పై బలవంతం చేస్తున్నారు, మా బాబు పై కూడా ఒత్తిడి తెస్తున్నారు, మా తప్పు లేకుండా, ఇంత చేసారు అని అన్నారు. పెద్దలు దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి కాని, ఎవరు అనేది మీడియా ముందు చెప్పలేం కదా, మీడియా ముందుకు వెళ్ళవద్దు అని చెప్తున్నారు. ఇన్నాళ్ళు లేని మీరు, ఇప్పుడు వచ్చి, ఫోనులు చేస్తున్నారని, కోర్టులో తీర్పు వస్తుందని స్పందించే మిమ్మల్ని, నేను ఎలా నమ్ముతాను అని ప్రశ్నించారు. నా కొడుక్కి ఎంత చేసారో, అంత సారీ వీళ్ళు చెప్పాలి, అప్పటి వరకు, దేనికీ ఒప్పుకోం అంటూ తేల్చి చెప్పారు.

విశాఖపట్నంలో ఎల్జీ పలైమర్స్ ఘటన మర్చిపోక ముందే, మరోసారి, విశాఖ వాసులను దట్టమైన పొగ భయపెట్టింది. ఈ రోజు విశాఖపట్నంలో ఉన్న హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో సీడీయూ-3 యూనిట్ ను ఈ రోజు తెరిచేందుకు, హెచ్‌పీసీఎల్‌ చర్యలు తీసుకుంటూ ఉండగా, ఒక్కసారిగా తెల్లని పొగలాగా వచ్చి, ఆ ప్రాంతం మొత్తం అలుముకున్నాయి. దీంతో ఏమి జరుగుతుందో తెలియని ప్రజలు, ఒక్కసారిగా భయాందోళనకు గురి అయ్యారు. కొంత మంది, ఇళ్ళ నుంచి బయటకు వచ్చి, భయంతో గడిపారు. అయితే, అదేమీ ప్రమాదం కాకపోవటం, కొద్ది సేపటికి ఆ పొగ తగ్గిపోవటంతో, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే జరిగిన ఘటన పై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. ఆ పొగ ఎందుకు వచ్చింది, అది ఏమిటి అనే దాని పై క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే ఇళ్ళ నుంచి ఈ పొగ స్పష్టంగా కనపడటంతో, కొంత సేపు స్థానికులకు ఏమి జరుగుతుందో అర్ధం కాలేదు. ఇప్పటికే ఎల్జీ పాలిమర్స్ విషయంలో భయం భయంగా ఉన్న విశాఖ ప్రజలు, ఈ ఘటన చోటు చేసుకోవటంతో, జరిగిన ఘటన పై, ఒకరిని ఒకరు ఫోన్ చేసుకుని, జరిగిన ఘటన పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే క్రమంగా పొగ ఆగిపోవటంతో, ప్రజలు ఆ భయం నుంచి బయటకు వచ్చారు. అయితే, తెలుస్తున్న సమాచారం ప్రకారం, కొన్ని రోజుల నుంచి కంపెనీ మూసేసి ఉండటంతో, ఈ రోజు మొదలు పెట్టటంతో, సహజంగా రియాక్షన్స్ వల్ల ఇలా జరిగి ఉండవచ్చని, అది ప్రమాదకర వాయువు కాదని తెలుస్తుంది. హెచ్‌పీసీఎల్‌ దీని పై స్పష్టమైన ప్రకటన చేసిన తరువాత కాని, జరిగింది ఏమిటో క్లారిటీ వచ్చే అవకాసం లేదు.

ఏపీలో నయవంచక పాలన కొనసాగుతోంది. గతంలో ఎందరో ముఖ్యమంత్రులుగా పనిచేశారు కానీ ఇంతటి ప్రజావ్యతిరేక కార్యకలాపాలు అవలంభించిన ఏకైక ముఖ్యమంత్రి మాత్రం జగన్మోహన్ రెడ్డే. కోర్టులు మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదు. సంక్షోభ సమయంలోనూ మీ మంత్రులకు ప్రభుత్వం నుంచి సకల సదుపాయాలు కల్పిస్తున్నారు. ఎస్కార్ట్ లతో మంత్రులు తిరుగుతున్నారు. మంత్రులకు వచ్చే ఒక్క రాయితీలు కూడా రద్దు చేయలేదు. ప్రజలకు మాత్రం అన్నీ రద్దు చేస్తున్నారు. ఆర్టీసీలో హై ఓల్టేజ్ షాక్ ఇచ్చారు. వృద్ధులు, జర్నలిస్టుల రాయితీలు రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి మంత్రులకు సదుపాయాలు ఎందుకు కొనసాగిస్తున్నారో సమాధానం చెప్పాలి. అన్నా క్యాంటీన్లు, సంక్రాంతి, రంజాన్ తోఫా, రుణమాఫీ, చంద్రన్న బీమా రద్దు చేశారు. బీసీ కార్పొరేషన్ల నిధులు దారి మళ్లించారు.

అమరావతి పనులు నిలిపేశారు. తిరుపతిలో భక్తులకు ఇచ్చే ఉచిత లడ్డు కూడా రద్దు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే చెందుతుంది. ఇది రద్దుల ప్రభుత్వం. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వం కాదు. వైసీపీ ప్రభుత్వంలో అమెరికాకు చెందిన 9 మందికి కేబినెట్ ర్యాంకు పదవులు ఇచ్చారు. వారు నెలనెలా3 లక్షల 60 వేలు డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. వైసీపీ వారికి పదవులు కట్టబెట్టటమే కాకుండా వాటి ద్వారా లభ్ది చేకూర్చేందుకు ప్రభుత్వ ధనాన్ని వృథా చేస్తున్నారు. చంద్రబాబులా పెట్టుబడులు తీసుకురాలేము, తమను చూసి ఎవరూ పెట్టుబడులు పెట్టరనే భావంతోనే వైసీపీ ....ప్రభుత్వ భూములు అమ్మకానికి పెడుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైల్ , గుంటూరు సబ్ జైలు అమ్మకానికి పెట్టారు. ఈడీ జప్తు చేసిన రూ. 43 వేలు కోట్లను ప్రజా ఉపయోగ కార్యక్రమాలను వినియోగించండి.

అప్పుడు ప్రభుత్వ ఆస్తులు అమ్మాల్సిన అవసరం ఉండదు. మీరు దోచుకున్న ఆస్తులు భద్రంగా ఉండాలి.ప్రభుత్వ ఆస్తుల మాత్రం అమ్మకానికి పెడతారా? వైసీపీ పాలనను ప్రజలు గమనిస్తున్నారు. కరోనా సమయంలో ఏపాటి సాయం చేశారో ప్రజలకు అర్ధమైంది. పేదలకు అందకుండా రద్దు చేసిన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలి. ప్రభుత్వంలో ఉన్న వారు ఖర్చులు తగ్గించుకోవాలి. పేదలకు అందే సాయంలో కోత విధించడం సరికాదు. టీడీపీపై కక్షసాధింపు చర్యలు మాని శాంతిభద్రతలను కాపాడండి. వైసీపీ నేతలకు పెట్టుబడులు తేవడం ఎలాగూ చేతకాదు. చంద్రబాబు సమర్థతను చూసే కియా సహా అంతర్జాతీయ కంపెనీలు ఏపీకి వచ్చాయి. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై వైసీపీ చర్చకు రావాలి.

కరోనా సమయంలో అన్ని వర్గాల ప్రజలు ఆర్ధికంగా చితిక్కిపోయిన పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి అమర్ నాధ్ రెడ్డి అన్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రజలను అందుకొవాల్సిన ప్రభుత్వం ప్రజలపై కరెంట్ చార్జీలంటూ భారం మోపే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి కరెంట్ చార్జీలు బాదుడే..బాదుడు అంటూ అధికార పార్టీని విమర్శించారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం కంటే మూడింతలు వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో కరెంట్ కొరత లేదు..కానీ కరెంట్ చార్జీలు శ్లాబుల్ పేరుతో ఎందుకు చార్జీలు పెంచారు. రూ.90వేల కోట్లకు డిస్కమ్ లకు కరెంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమి చేసింది. కనీసం ఈ మూడు నెలలైనా కరెంట్ బిల్లు రద్దు చేయాలి. మా పలమనేరు నియోజకవర్గంలో ఒక ఇంటిలో ఫ్యాన్, లైట్ మాత్రమే కానీ రూ.41వేల కరెంట్ ఎలా వచ్చిందని ప్రభుత్వాన్ని నిలదీశారు.

రూ.200, రూ.300 వచ్చే కరెంట్ బిల్లు ఇలాంటి సమయంలో వస్త సమాన్య ప్రజలు ఏవిధంగా కట్టతారని మండిపడ్డారు. కరోనా సమయంలో మద్యం షాపులు ఓపెన్ చేయమంటే ఇంతకంటే తెలివితక్కువ పని ఇంక్కొకటి లేదన్నారు. బ్రాండ్ లేని మద్యం తీసుకువచ్చి ప్రజా ఆరోగ్యంతో అడుగుంటున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలపై రూ.50వేల కోట్లు భారం మోపారు. దానిని మాఫీ చేయడం కోసం ప్రభుత్వం భూములను అమ్మటానికి ప్రయత్నం చేస్తుంది. వైసీపీ ప్రభుత్వం తీసుకునవచ్చిన ప్రతి జీవో పై కోర్టు ముట్టికాయలు వేసిన వైసీపీ ప్రభుత్వానికి సిగ్గులేదన్నారు. గతంలో చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాల వలనే రాష్ట్రానికి కరెంట్ ఇబ్బందులు లేవని అన్నారు.

పాత శ్లాబులను ప్రభుత్వ కొనసాగించాలని డిమాండ్ చేశారు. మాస్క్లు లేవని చెప్పినందుకు సప్పెండ్ చేసి చేతులు కట్టేసి ఒక దేశ దోహ్రిని కొట్టినట్లు డాక్టర్ సుధాకర్ పై పోలీసులు చాలా దారుణం అన్నారు. పాలీమర్స్ కంపెనీ సంఘటన పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు రంగనాయకమ్మ కేసులు పెట్టడం దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న చర్యలకు భవిష్యత్త్ లో ప్రజలు బుద్ది చెబుతున్నారని అన్నారు. వేరుశనగ విత్తనాల పంపీణిలో గంగదరగోళం సృష్టిస్తున్నరని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం సంవత్సరం పండుగ చేసుకునే ముందు ప్రజలపై వేసిన భారం తగ్గించి చేసుకోవాలని ప్రశ్నించారు.

Advertisements

Latest Articles

Most Read