లేని పంచాయతీ మొదలు పెట్టి, ఇప్పుడు అసలుకే ఎసరు తెచ్చే పరిస్థితి వచ్చింది. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ లో, పోతిరెడ్డిపాడు కాలువులు వెడల్పు చేసుకుంటాం అంటూ, చెప్తే అయిపోయే దానికి, అదేదో కొత్త ప్రాజెక్ట్ లాగా ప్రచారం చేసుకుని, అటు తెలంగాణా, ఇటు కేంద్రం అభ్యంతరం చెప్పే పరిస్థితికి, ఏపి తెచ్చుకుంది. ఇదే అదనుగా, ఇలాంటి అవకాసం కోసమే చూస్తున్న కేసీఆర్, తెలంగాణాకు లాభం చేకూర్చే పనిలో, ఏపికి భారీ దెబ్బ కొట్టే ప్లాన్ వేస్తున్నారు. కృష్ణా వాటర్ వినియోగం పై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం ఇచ్చారు. రిజర్వాయర్ నిర్మాణం పై తెలంగాణ సర్కార్ నివేదిక కోరింది. గోదావరి జలాలపై జరుగుతున్న సమీక్షలో ఈ ప్రాజెక్టుపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే థరూర్ మండలం గూడెం దొడ్డి, ద్యాగాదొడ్డి గ్రామల మధ్య కొత్త ప్రాజెక్టుకు అనువైన ప్రదేశంగా నీటిపారుదల శాఖ రిపోర్టు ఇచ్చింది.
రోజుకు ఒక టీఎంసీ ఎత్తిపోసే విధంగా పథకం రూపకల్పన జరుగుతుంది. 20 టీఎంసీల రిజర్వాయర్ నుంచి నెట్టంపాడు, భీమా-1, భీమా-2, కోయిల్సాగర్కు లింక్ - 30 రోజుల్లోనే 15 నుంచి 20 టీఎంసీలు ఎత్తిపోసేలా ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నారు. ముంపు ప్రాంతాలు లేకుండా భారీ రిజర్వాయర్ ప్లాన్ చేస్తున్నారు. ఏపీ జీవో 203 నేపథ్యంలో తెలంగాణ సర్కార్ వేగంగా పావులు కదుపుతుంది. ఈ నిర్మాణమే జరిగితే, శ్రీశైలం ప్రాజెక్ట్ వద్దకు వచ్చే నీళ్ళు కూడా రావు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ నిర్మాణాన్ని ఎలా ఆపుతుందో చూడాలి. ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ గారు, ఇవేమీ మాట్లాడకుండా, దేవినేని ఉమా గుండు గీస్తా, మీసం గీస్తా అంటూ, టాపిక్ డైవర్ట్ చేసి, వెళ్ళిపోతున్నారు.
ఇక మరో పక్క పోతిరెడ్డిపాడు పంచాయతీ ఇంకా కొనసాగుతూనే ఉంది. పోతిరెడ్డి పాడు కాలువలు వెడల్పు చేసుకునే క్రమంలో, కొత్త లిఫ్ట్ పెట్టుకుంటాం అంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో పై, తెలంగాణాలోని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చెయ్యటంతో, తెలంగాణా ప్రభుత్వం కదిలింది. నిజానికి ఏ కొత్త ప్రాజెక్ట్ కట్టినా, అపెక్స్ బోర్డుకు చెప్పాల్సి ఉంటుంది. కాని ఏపి అలా చెయ్యకుండా వెళ్ళటంతో, సమస్య వచ్చి పడింది. కేసీఆర్ తో జగన్ కు మంచి స్నేహం ఉంది కాబట్టి, ఆయనకు చెప్పి, రాయలసీమలో రైతులు పరిస్థితి వివరించి, మేము మీ వాటా నీళ్ళు తీసుకోవటం లేదు, మా వాటా నీళ్ళే తీసుకుంటాం అని చెప్తే అయిపోయేదానికి, ఈ హడావిడి అంతా చెయ్యటంతో, ఇప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య నీళ్ళ పంచాయతీ మొదలు అయ్యింది.