విశాఖపట్నంలో, ఈ రోజు డాక్టర్‌ సుధాకర్‌, అర్ధనగ్నంగా ఉంటూ, పోలీసులు చేతులు వెనక్కు విరిచేసి, చేతులు కట్టేసి, ఆయన్ను ఆటో ఎక్కిస్తూ ఉన్న దృశ్యాలు అందరూ చూసారు. నర్సీపట్నం హాస్పిటల్ లో, మాస్కులు ఇవ్వలేదు అని అడిగినందుకు, అప్పట్లో ప్రభుత్వ డాక్టర్ గా పని చేస్తున్న డాక్టర్ సుధాకర్ ను , ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే ఈ రోజు ఆయన ఆందోళన చెయ్యటం, అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు, ఆయన చేతులు వెనక్కు విరగదీసి తాళ్లు కట్టి పోలీస్ స్టేషన్ కు తరలించటం చూసాం. ఈ ఘటన చూసిన అందరూ, ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. దళితుడుగా పుట్టి, పేదరికంలో పెరిగి, అన్నీ తట్టుకుని, కష్టపడి చదువుకుని డాక్టర్ అయ్యి, 20 ఏళ్ళు సర్వీస్ చేసిన ఒక డాక్టర్ కు, ఈ రోజు ఈ పరిస్థితి పట్టింది అంటే, అది కేవలం ప్రభుత్వ వైఖరి వల్లే అని విపక్షాలు విమర్శించాయి. తెలుగుదేశం, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఈ ఉదంతం పై, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక దళితుడు, మిమ్మల్ని ప్రశ్నిస్తే తట్టుకోలేక, ఈ పరిస్థితికి తెచ్చారా అని ప్రశ్నించారు.

అయితే ఈ మొత్తం ఘటన పై, విశాఖపట్నం పోలీస్ కమీషనర్ ఆర్కే మీనా స్పందించారు. ముందుగా తమకు పోర్ట్ ఆసుపత్రి వద్ద ఒక వ్యక్తి నడి రోడ్డు పై, అనుచితంగా ప్రవర్తించారని, తమకు డయిల్ 100 కు ఫోన్ వచ్చిందని చెప్పారు. తమకు ఫిర్యాదు రాగానే, అక్కడ దగ్గరలో ఉన్న పోలీసులను స్పాట్ కు పంపించామని, అతన్ని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. డాక్టర్ సుధాకర్ చిత్తుగా తాగి ఉన్నారని, కమీషనర్ చెప్పారు. తాగి ఉండటంతో, ఆయన మాట వినలేదని, అందుకే ఫోర్సు తో అరెస్ట్ చేసి, వైద్య పరీక్షలు కోసం, కేజీహెచ్‌కు తరలించామని చెప్పారు. అయితే, మరో పక్క, అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను కూడా సస్పెండ్ చేసినట్టు, ఆర్కే మీనా మీడియాకు చెప్పారు.

అంటే పోలీసులు తప్పు ఉందని ఒప్పుకున్నారు. ఒక వేళ డాక్టర్ తాగి ఉన్నా, ఆయన్ను అలా చేతులు వెనక్కు విరగదీసి, తాడులతో కట్టేసి, అంత మంది పోలీసులు ఆయన్ను అలా ఈడ్చుకుని వెళ్ళటం పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఎంతో మంది తాగి రోడ్డుల మీద తిరుగుతుంటే, ఇలాగే కట్టేసి, ఈడ్చుకుని స్టేషన్ లో పడేస్తున్నారా అనే విమర్శలు వస్తున్నాయి. అసలు ఇలా మందు తాగి రోడ్డుల మీదకు రావటానికి ప్రభుత్వం కాదా, కరోనా టైంలో ఎందుకు షాపులు ఓపెన్ చేసారు అని ప్రశ్నిస్తున్నారు. సుధాకర్ ను అలా ఈడ్చుకుని వెళ్ళటం తప్పు కాబట్టే, అన్ని వైపుల నుంచి విమర్శలు రావటంతోనే, ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసారని, ఇంతటితో ఈ వివాదానికి ముగింపు పలకాలని ప్రభుత్వం చూస్తుందని విమర్శలు గుప్పిస్తున్నారు.

ఆయన అడిగిన తప్పు, కరోనా టైంలో మాస్కులు ఇవ్వటం లేదు అని ప్రభుత్వాన్ని అడగటం. అంతే ఆయన్ను ప్రభుత్వం, సస్పెండ్ చేసింది. విశాఖలోని నర్సీపట్నంలోని హాస్పిటల్ లో పని చేస్తున్న డాక్టర్. కరోనా సమయంలో డాక్టర్లకు మాస్కులు ఇవ్వటం లేదని, క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆయన్ను సస్పెండ్ చేసారు. బహిరంగంగా వచ్చి, ప్రభుత్వం మాస్కులు ఇవ్వటం లేదు అని అడిగినందుకు, ఆయన్ను సస్పెండ్ చేసారు. అంతే కాదు, తమ అనుకూల మీడియాలో ఆయన్ను, హేళన చేస్తూ కధనాలు ప్రసారం చేసారు. అయితే ఏమైందో ఏమో కాని, ఈ రోజు ఆ డాక్టర్ గారి పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతుంది. నిన్నటి దాకా వైద్యం అందించిన వ్యక్తి నడి వీధుల్లో పడి ఉండడం పై విశాఖ వాసుల దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఎలా జరిగిందో ఎవరూ చెప్పలేని పరిస్థితుల్లో కనిపించిన డా.సుధాకర్ ను చూసి, అందరూ ఆశ్చర్యపోయారు. నిన్నటి దాక వైద్య సేవలు అందించిన డాక్టర్, ఈ రోజు ఇలా ఉండటం పై, అందరూ బాధ వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ వీధుల్లో డా.సుధాకర్ ను తాళ్లతో కట్టేసి పోలీసులు అటోలో ఎత్తుకెళ్ళటం కనిపిచింది. తాటిచెట్లపాలెం పోర్టు ఆస్పత్రి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటోలో 4వ టౌన్ పోలీసు స్టేషన్ కు డా.సుధాకర్ ను పోలీసులు తరలించారు. ఏపీ ప్రభుత్వంపై కరోనా విషయంలో ఇటీవల ఆరోపణలు చేసిన డా.సుధాకర్ ఇలా ఉండటం పై, ఆస్పత్రిలో మాస్కులు లేవని డాక్టర్లకు సదుపాయాలు లేవని డా.సుధాకర్ విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శించినందుకు డా.సుధాకర్ ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. అయితే, ఈ రోజు విశాఖ వీధుల్లో ఇలా డాక్టర్ పడి ఉండటం పై, పోలీసులను అడగగా, తాము ఏమి చెప్పలేమని అన్నారు. విశాఖ వీధుల్లో అకస్మాత్తుగా అర్దనగ్నంగా కనిపించిన డాక్టర్ సుధాకర్ ను చూసి నగర వాసులు బాధ పడుతున్నారు.

అయితే ఒక డాక్టర్ కు ఇలాంటి పరిస్థితి ఉండటం పై, విపక్షాలు మండి పడుతున్నాయి. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందొ, తెలియటానికి ఇదే ఉదాహరణ అని అన్నారు. ఒక దళితుడుకి, అదీ ఒక డాక్టర్ కు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సత్కారం ఇదా అని, వర్ల రామయ్య ప్రశ్నించారు. చాలా హృదయవిదారికంగా ఉన్న పరిస్థితి చూసి, ఒక మేధావిని, ఒక డాక్టర్ ని, అలా రోడ్డు మీద పడేసి, చొక్కా లేకుండా, ఇలా పోలీసులు ట్రీట్ చెయ్యటం పై వర్ల రామయ్య తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసారు. రాష్ట్రం అంతా పులివెందుల పంచాయతీ విస్తరింప చేసారని, తనకు అడ్డు వస్తే సస్పెండ్ చెయ్యటమే కాదు, ఏమైనా చేస్తాను అని ప్రభుత్వ ఉద్యోగులకు చెప్పటానికి, ఇలా చేసారని టిడిపి ఆగహ్రం వ్యక్తం చేస్తుంది. జగన్ సర్కార్ లో దళితులకు రక్షణ లేదు, డాక్టర్ సుధాకర్ పరిస్థితిపై మానవ హక్కుల సంఘాలు స్పందించాలి అని బీజేపీ అధికార ప్రతినిధి విల్సన్ అన్నారు.

దేశవిదేశాల్లో వున్న కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కల్పించే విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక స్పష్టతకు రాలేక పోతోంది. మే 17వరకు మూడవ విడత లాక్ డౌన్ అమలులో వున్న నేపధ్యంలో కేంద్రం సడలింపులిస్తే ఏడుకొండల వేంకన్న ఆలయంలోనికి భక్తులను అనుమతించే విషయంలో టిటిడికీ ఒక మార్గం సుగమమవుతుందా అనేది అటు టిటిడి అధికారుల్లో ఇటు శ్రీవారి భక్తుల్లో వీడని సందిగతగా మారింది. ఇప్పుటికిప్పుడు దేశంలో, ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రతను అంచనావేయలేక పోతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకోనున్నారనేది సర్వత్రా చర్చనీయాంశం గామారింది. కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతున్న తరుణంలో మన దేశంలోనూ కరోనా వ్యాప్తితో కట్టడికి దశల వారీగా కేంద్రం లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే గత మార్చినెల 22 నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తుల రాకను నిషేధించారు.

పూర్తిగా భక్తులను ఏడుకొండలపైకి అనుమతించకపోవడంతో 50 రోజులుగా తిరుమలేశుని దర్శనం దూరమైంది. చాలామంది భక్తులు శ్రీవారిని చూడలేకపోతున్నామనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనా వైరస్ పూర్తిగా కట్టడి చేసే వరకు ఆలయాలను మళ్లీ తెరుస్తారా? లేదా అనేది మాత్రం భక్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా, తెలుగురాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో నిత్యావసర వస్తువుల దుకాణాల తెరిచివుంచే సమయంలో మార్పులు చేశారు. ఉదయం 7 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు చాలావరకు దుకాణాలను తెరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. మద్యం దుకాణాలను తెరిచి విక్రయాలు ప్రారంభించారు. ఈ నేపధ్యంలో ఈనెల 17వతేదీ లాక్ డౌన్ ముగింపు గడువు వుండటంతో ఆరోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠగా మారింది. ఇంతకీ తిరుమల శ్రీవారి ఆలయంలోనికి భక్తులను అనుమతినిస్తారా? లేదా అనేది కూడా అనుమానమే. ఆంక్షలతో నిబంధనలు కఠినంగా అమలవుతుండటంతో కరోనా కట్టడిచేయగలిగారనేది అధికార వర్గాల్లో వినిపిస్తున్న వ్యాఖ్యలు.

రేపు లాక్ డౌన్ ముగియనుండటంతో ఒకవేళ ఆలయాలకు సడలింపునిస్తే భక్తులను గతంలోలాగా ఆలయాల్లోనికి అనుమతించరనేది స్పష్టమవుతోంది. దీంతో తిరుమలకు రోజువారీగా 90 వేలమంది వరకు భక్తులు వచ్చి ఇష్టదైవాన్ని దర్శించుకునేవారు. గత మార్చి 22 వరకు గంటకు 4 వేలమంది భక్తులను ఆలయంలోనికి అనుమతించి శ్రీవారి దర్శనం కల్పించేవారు. ఇప్పుడు రోజువారీలో 5వేల నుంచి 10 వేలమంది లోపే మాత్రమే భక్తులను అనుమతించే యోచనలో టిటిడి వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. అంతేగాక లాక్ డౌన్ సడలింపులిస్తే తిరుమలలో ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించి తదుపరి దర్శనానికి భక్తులను అనుమతించే విషయంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం వుందని తెలుస్తోంది. ఒకవేళ కేంద్రం ఆలయాలు తెరిచి భక్తులకు దర్శనం కల్పించే విషయంలో సడలింపునిచ్చినా తిరుమలలో తొలుత టిటిడి ఉద్యోగులు, తిరుమల, తిరువతి స్థానికులను భౌతిక దూరం పాటిస్తూ అనుమతించేలా కూడా యోచిస్తున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోనికి అనుమతించకుండా క్యూలైన్లలోనే నేరుగా అనుమతించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనేది సమాచారం. రాష్ట్రంలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కరోనా ప్రభావ పరిస్థితులు గమనిస్తుంటే ఏడుకొండల వెంకన్న దర్శన భాగ్యం భక్తులకు కలుగుతుందా లేదా అనేది అటు టిటిడి వర్గాల్లో ఇటు భక్తుల్లో వీడని సందిగ్ధతగా మారింది.

గుంటూరు జిల్లాలోని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కు రాజభోగం కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ అడిగిందే తడవుగా జీవితకాలం నీటి కేటాయింపులు చేసేసింది ప్రభుత్వం. ఆ కంపెనీని జీవితకాలం నీటిని వాడుకునే హక్కును ధారాదత్తం చేస్తూ ఆంధ్రపదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్ళ పాటు, ఏడాదికి 0.0689 టిఎంసీల జలాలను వాడుకునేలా 2019 డిసెంబర్ 3న జీవో ఇచ్చింది జగన్ ప్రభుత్వం. అయితే తాజాగా జీవితకాలం నీటిని వాడుకునే హక్కు కల్పించాలంటూ, 2020 మార్చ 2న ప్రభుత్వానికి, సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ లేఖ రాసింది. లేఖ రాసిందే తడవుగా, అఘమీఘాల పై జీవిత కాల హక్కును కల్పిస్తూ, ప్రభుత్వం మే, 15న జీవో నెంబర్ 81 ను జారీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే జగన్ తీరు పై విపక్షాలు మండి పడుతున్నాయి.

తన సొంత కంపెనీకి, ఇలా ఇష్టం వచ్చినట్టు, జీవితకాలం అనుమతులు ఇచ్చే హక్కు జగన్ కు ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నారు. అన్ని కంపెనీలు ఇలాగే జీవిత కాలం నీతి కేటాయింపులు అడుగుతాయని, వారికీ కూడా ఇలాగే జీవితకాలం కేటాయిస్తూ ఉత్తర్వులు ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు, గుంటూరు జిల్లాకు చెందిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అలాగే విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ఈ విషయం పై మండి పడ్డారు. తన సొంత కంపెనీ, తన భార్య డైరెక్టర్ గా ఉన్న కంపెనీకి, అధికారం ఉంది కదా ని జీవిత కాలం నీటి కేటాయింపులు ఇవ్వటం అన్యాయం అని వాపోతున్నారు. ఇదే కంపెనీ గతంలో ఆ ప్రాంతంలో చేసిన అరాచాకాన్ని గుర్తు చేస్తున్నారు.

జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి సంబదించిన సరస్వతి పవర్, జగన్ అక్రమాస్తుల కేసులో కూడా ఉందని గుర్తు చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఈ కంపెనీ తనది అంటూ, అఫిడవిట్ లో కూడా పేర్కొన్నారు. అఫిడవిట్ ప్రకారం జగన్ పేరిట రూ.26.40 కోట్ల విలువ చేసే వాటాలు, ఆయన భార్య పేరిట, రూ.13.80 కోట్ల విలువ చేసే వాటాలు ఉన్నాయని, తెలుగుదేశం నేతలు గుర్తు చేస్తున్నారు. గత డిసెంబర్ లో ఇచ్చిన ఆదేశాలు ప్రకారం, కృష్ణాలో వరద ఉన్నప్పుడు, జూన్ నుంచి నవంబర్ మధ్య 0.0689 టిఎంసీల నీటికి వాడుకునే అవకశం ఇస్తే, ఇప్పుడు దాన్ని జీవిత కాలం పొడిగించారు. వెయ్యి గాలేన్లకు రూ.5.50 చొప్పున చెల్లించాలని ఉత్తర్వుల్లో ఇచ్చారు. సిమెంట్ పరిశ్రమలోనే సిమెంట్ ప్లాంటుకు, పవర్ ప్లాంటుకు దీర్ఘకాలం నీతి అవసరం ఉందని, అందుకే జీవితకాలం నీటిని కేటాయయించినట్టు తెలుస్తుంది. అయితే ఇది తన సొంత కంపెనీ కాబట్టి ఇలా చేసారు, అన్ని కంపెనీలకు ఇదే చేస్తారా అనేది తెలియాలి.

Advertisements

Latest Articles

Most Read