దాదాపుగా 45 రోజుల నుంచి లాక్ డౌన్ ఉంది. మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. అయితే ఉన్నట్టు ఉండి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, మద్యం షాపులు ఓపెన్ చేసింది. కేంద్రం మార్గదర్శకాలు అని చెప్తున్నా, ఇది పూర్తిగా రాష్ట్రాలు ఇష్టం. అందుకే కేరళ, తమిళనాడు, తెలంగాణా మద్యం షాపులు ఓపెన్ చెయ్యలేదు. కాని మనకు మాత్రం, మద్యం ప్రియులకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను చెబుతునే ఉహించని ట్విస్టు ఇచ్చింది. లిక్కరు షావులను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఉదయం 11గంటల వరకు రాత్రి ఏడు గంటల వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలను తెరుస్తారు. దీంతో సంబర పడుతున్న మద్యం ప్రియులకు షాకిచ్చింది. మద్యం ధరలను 25 శాతం పెంచింది. దీంతో మద్యం ప్రియులు నీరుగారి పోయే వరిస్థితి వస్తుందని అందరూ అనుకున్నారు.
మద్యం కొనుగోలుకు వచ్చే వారు ఖచ్చితంగా ఆరు అడుగుల భౌతిక రూపాన్ని పాటించాల్సివుంటుంది. లిక్కరు షాపులను ఉదయం 11-7 గంటల నడుమ నిర్వహిస్తామని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ్ స్పష్టం చేసారు. ఇందుకు సంబంధించిన అన్ని మార్గదర్శకాలను జిల్లా కలెక్టరులకు పంపినట్లు తెలిపారు. దుకాణాల్లో కి అయిదుగురి మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. అదే విధంగా షావుల ముందు సర్కిల్ ను ఏర్పాటు చేస్తామన్నారు. మాస్క్ లేనిదే మద్యం దుకాణాల్లోకి అనుమతించమన్నారు. క్యూలైనుల్లో ఉండనివ్వమన్నారు. ఒక వేళ షాపుల వద్ద రద్దీ ఉంటే పరిస్థితి సద్దుమణిగే దాకా కొంత సమయం అమ్మకాలు నిలిపివేస్తామన్నారు. బారులకు అనుమతి లేదన్నారు. మద్యం అమ్మకాలు తగ్గించేందకు మద్మం ధరలు పెంచినట్లు వివరించారు.
అయితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న వీడియోలు చూస్తుంటే, ఎక్కడా, ఈ నిబంధనలు పాతిన్చినట్టు లేదు. ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే, ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి ఒక మంచి అవకాసం కోల్పోయారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. జగన్ హామీ ఇచ్చినట్టు, మధ్య నిషేధానికి, ఇంతకంటే మంచి అవకాసం ఉండదని అంటున్నారు. 45 రోజులు ఎక్కడా మందు లేదు కాబట్టి, ప్రజలు అలవాటు పడిపోయారని, ఇప్పుడే మధ్య నిషేధం అమలు చెయ్యాలని అన్నారు. అయితే ఇందుకు విరుద్ధంగా, పక్క రాష్ట్రాలు షాపులు తెరవకపోయినా, ఈ రోజు జగన్ మందు షాపులకు అవకాసం ఇచ్చి, అక్కడ సీన్లు చూసి, ప్రజలు, ప్రభుత్వాన్ని తిట్టుకునే పరిస్థితి వచ్చింది. మేము అన్నీ మానుకుని, ఇంట్లో కూర్చుంటే, ఒక్క దెబ్బతో, లాక్ డౌన్ ఉపయోగం లేకుండా చేసారని వావుపోతున్నారు. మొత్తానికి, జగన్ తాను హామీ ఇచ్చిన మధ్య నిషేధం అమలు చేసే, మంచి అవకాసం వదులుకోవటమే కాకుండా, ఇప్పుడు ఎదురు ప్రజలు తిట్టే పరిస్థితి వచ్చిందని విశ్లేషకులు వాపోతున్నారు. ఒక వేళ, రేపు కేసులు పెరిగిపోతే, ఆ నింద, జగనే మొయ్యాల్సి వస్తుంది.