ఆంధ్రప్రదేశ్ లో క-రో-నా మహమ్మారి, అల్లాడిస్తుంది. కర్నూల్ జిల్లాలో, అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. మూడు వందలకు చేరువలో కేసులు ఆ జిల్లాలో ఉన్నాయి. దీంతో కర్నూల్ జిల్లాలో కరోనా ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. అయితే ఇప్పుడు కర్నూల్ జిల్లా బాధితుల లిస్టులో, వైసీపీ ఎంపీ కూడా చేరారు. వైసీపీలోని ఒక ఎంపీ కుటుంబంలోని ఆరుగురు సభ్యులకు క-రో-నా పాజిటివ్ రావటం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని ఎంపీనే స్వయంగా ఒక టీవీ ఛానల్ లో కూడా ప్రకటించారు. ఈ విషయం పై, ఒక పత్రిక ఈ రోజు ఉదయమే ప్రచురించింది. ఎంపీ ఇద్దరు సోదరులు, వారి సతీమణులు, మరో ఇద్దరికి క-రో-నా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. అయితే ఆరుగురిలో నలుగురు డాక్టర్లు కావటం, మరో షాకింగ్ అంశం. ఇదే విషయం పై ఎంపీ కూడా మీడియాతో మాట్లాడుతూ, జరిగిన విషయాన్నీ ధృవీకరించారు.
తన కుటుంబంలో ఆరుగురికి క-రో-నా సోకినట్టు చెప్పారు. అందరూ ప్రభుత్వ కరోనా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా క-రో-నా వస్తుంది అంటే, లాక్ డౌన్ వల్ల ఉపయోగం లేదని అర్ధం అవుతుందని అన్నారు. ఇక మరో పక్క ఆ ఎంపీకి క-రో-నా పరీక్షలు చేయగా, నెగటివ్ అని వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో తరుచూ ఆ ఎంపీని కలుస్తున్న అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక మరో పక్క, కర్నూల్ జిల్లాలో, ఇప్పటికే ఒక వైద్యుడు క-రో-నా-తో చనిపోయారు. ఆ వైద్యుడు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారికి, మామగారు. అలాగే మరి కొంత మంది వైద్యులకు కూడా కరోనా సోకినట్టు సమాచారం.
రాష్ట్రంలో కొత్తగా 81 క-రో-నా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ కేసులతో... రాష్ట్రంలో క-రో-నా సోకిన వారి సంఖ్య 1,097కు చేరిందని హెల్త్ బులెటిన్లో పేర్కొంది. కోవిడ్ వల్ల ఇప్పటి వరకూ 31 మంది చనిపోయినట్లు తెలిపింది. కరోనా నుంచి 231 మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రకటించింది. వివిధ ఆస్పత్రుల్లో 835 మంది చికిత్స పొందుతున్నట్లు హెల్త్ బులెటిన్లో పేర్కొంది. గత 24 గంటల్లో క-రో-నా వల్ల ఎవరూ చనిపోలేదని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కృష్ణా జిల్లాలో కొత్తగా 52 కేసులు నమోదవ్వగా, పశ్చిమగోదావరి జిల్లాలో 12, కర్నూలు జిల్లాలో 4, గుంటూరు జిల్లాలో 3, కడప జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 2, తూర్పుగోదావరి జిల్లాలో 2 క-రో-నా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.