దేశంలో క-రో-నా రోజు రోజుకీ పెరిగిపోతుంది. 21 రోజుల లాక్ డౌన్ పెడితే, అంతా సర్దుకుంటుంది అని అందరూ అనుకున్నారు. అయితే, తరువాత క-రో-నా ఎక్కడ తగ్గక పోగా, ఇంకా పెరుగుతూ ఉండటంతో, మరో 21 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ లాక్ డౌన్ సమయాన్ని, సరిగ్గా వినియోగం చేసుకోవాలని, ఈ లాక్ డౌన్ సమయంలోనే, క-రో-నా పాజిటివ్ ఉన్నవారిని గుర్తించి, వారిని వేరు చేస్తే, చాలా వరకు ఈ క-రో-నా తగ్గుతుందని కేంద్రం భావించింది. రాష్ట్రాలను ఎక్కువగా క-రో-నా టెస్టులు చేసి, క-రో-నా ఉన్న వారిని గుర్తించాలని సూచించింది. అయితే ఇక్కడే కొన్ని రాష్ట్రాలు చూపిస్తున్న అత్యుత్సాహంతో, మొత్తం రివర్స్ అయ్యే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా క-రో-నా-కి సరైన నిర్ధారణ, కేవలం, ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టు మాత్రమే. ముక్కు, గొంతు నుంచి తీసి, టెస్టింగ్ చేస్తారు. ఇది మాత్రమే కచ్చితమైన సమాచారం ఇస్తుంది. ఈ టెస్ట్ చేస్తేనే, కోరనా పాజిటివా, నెగిటివా అనేది కచ్చితంగా తెలుస్తుంది.

అయితే ఈ టెస్ట్ కొంచెం ఖరీదు ఎక్కువ, రిజల్ట్ రావటానికి టైం పడుతుంది. అయినా, ప్రపంచం అంతా ఇదే వాడుతుంది. అయితే ఐసీఎంఆర్, చెప్పిన రాపిడ్ టెస్టింగ్ విషయంలో, కొన్ని రాష్ట్రాలు తప్పుగా అర్ధం చేసుకోవటంతో, మొత్తం సీన్ రివర్స్ అయ్యింది. రాపిడ్ టెస్టింగ్ అనేది, హాట్ స్పాట్లలో, క-రో-నా లక్ష్యాణాలు ఉన్న వారిని గుర్తించటానికి మాత్రమే, ఇవి ఉపయోగపడతాయి. అది కూడా కచ్చితమైన సమాచారం ఇది ఇవ్వదు. ఇది తక్కువ రేటు కావటం, అలాగే వెంటనే రిజల్ట్ వస్తూ ఉండటంతో, ఈ టెస్ట్ చేసేసి, ఎక్కువ టెస్టులు చేస్తున్నట్టు, కొన్ని రాష్ట్రాలు ప్రకటించాయి. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం, ఇందులో ఉన్న రిస్క్ గుర్తించి, లోపాలు కేంద్రానికి చెప్పాయి. ఉదాహరణకు, రాజస్తాన్, పాజిటివ్ ఉన్న పేషంట్ కు, ఈ రాపిడ్ టెస్టింగ్ చేసినా నెగటివ్ రావటాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లారు.

దీంతో కేంద్రం, అన్ని రాష్ట్రాలను, ఈ రాపిడ్ టెస్టులు చెయ్యటం అపేయ్యలని చెప్పింది. అంతే కాదు, నిన్న ఈ విషయం పై అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు ఉత్తరాలు రాసారు. క-రో-నా టెస్టింగ్ విషయంలో, కేవలం ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు మాత్రమే ప్రామాణికం అని స్పష్టం చేసింది. రాపిడ్ టెస్టులు, కేవలం లక్ష్యనాలు ఉన్నాయో లేదో, రోగ నిరోధక శక్తి ఎంత ఉందో తెలుసుకోవటానికే అని చెప్పింది. అంతే కాని, రాపిడ్ టెస్టులు చేసి, క-రో-నా నిర్దారణ పరీక్షలు చేసినట్టు కాదని తేల్చి చెప్పింది. క-రో-నా టెస్టింగ్ అంటే, ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టు మాత్రమే అని తేల్చి చెప్పింది. అన్ని రాష్ట్రాలు, ఐసీఎంఆర్‌ ప్రొటోకాల్‌ను పాటించాల్సిందే అని తేల్చి చెప్పింది.

ఒకరి దురదృష్టం, మరొకరి అదృష్టం అని పెద్దలు అంటారు. ఒక మంచి ఆఫీసర్ ని, కేవలం చంద్రబాబు హయంలో బాగా పని చేసారు అనే ఉద్దేశంతో, జగన్ ప్రభుత్వం వదులుకుంటే, కళ్ళకు అడ్డుకుని, మరో కీలక పోస్టింగ్ ఇచ్చి, పదోన్నతి ఇచ్చి మరీ కేంద్ర ప్రభుత్వం, ఉన్నత స్థానం కల్పించింది. ఆ ఆఫీసర్ పేరు జాస్తి కృష్ణ కిషోర్. చంద్రబాబు నాయుడు హయంలో, ఆయన అవినీతి చేసారు అనే ఉద్దేశంతో, జగన్ ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. అయితే ఆయన క్యాట్ ట్రిబ్యునల్ కు వెళ్ళటం, అక్కడ సస్పెన్షన్ ఉత్తర్వులు కొట్టేయటంతో, ఆయన తన మాతృసంస్థకు వెళ్ళిపోయారు. దీంతో ఆయనకు కేంద్రం, తాజగా, ఇన్కమ్ టాక్స్ ప్రిన్సిపాల్ కమిషనర్‌ గా కృష్ణ కిషోర్‌కు, పదోన్నతి ఇచ్చింది కేంద్రం ప్రభుత్వం. కృష్ణ కిషోర్ ని, ఐటి ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌గా ప్రమోషన్ ఇస్తూ, ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ), ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది.

కృష్ణ కిషోర్ ని, ఢిల్లీ ఐటి శాఖ ప్రధాన కార్యాలయంలో, రిపోర్ట్ చెయ్యాలని, ఆ ఆదేశాల్లో చెప్పింది. దీంతో కృష్ణ కిషోర్ కు పలువురు శుభాకాంక్షలు చెప్పారు. తన హోదాకు తగ్గ పదవి వచ్చింది అంటూ, అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద అవమానాలు పడినా, కేంద్రం గుర్తించి, మంచి పదవి ఇచ్చిందని, ఇప్పుడు దేశానికి సేవ చేసే అవకాసం వచ్చిందని పలువురు ప్రశంసించారు. చంద్రబాబు నాయుడు హయంలో, కృష్ణకిషోర్ , ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓ గా పని చేసారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవటంలో, ఆయన శాఖ చేసిన పని కూడా ఒక కారణం. అయితే అనూహ్యంగా జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత, కృష్ణ కిషోర్ పై అవినీతి ఆరోపణలు మోపి సస్పెండ్ చేసారు.

ఇలాంటి ఆఫీసర్ పై, చర్యలు తీసుకోవటంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆయన క్యాట్ కు వెళ్ళటంతో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కేవలం ఒక సామాజికవర్గం టార్గెట్ గా, ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని, పలువురు ఆరోపించారు కూడా. అయితే క్యాట్ సస్పెన్షన్ రద్దు చేయ్యాటంతో, ఆయన తన మాతృసంస్థ అయిన కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయారు. దీంతో కేంద్రం చాలా తక్కువ సమయంలోనే ఆయనకు, ఇప్పుడు పదోన్నతి ఇస్తూ, గౌరవించింది. గతంలో జగన్ ప్రభుత్వం ఆయన్ను అవమానించింది. రిలీవ్ చెయ్యకుండా ఆపింది, అవినీతి ఆరోపణలు మోపి సస్పెండ్ చేసింది. అయినా, అయన అన్నీ తట్టుకుని, ఇప్పుడు దేశంలోనే ఒక అత్యుత్తమ పదవి, ప్రధాని నరేంద్ర మోడీ క్యాబినెట్ లో పొందారు.

తల్లిదండ్రులకు, పిల్లలకు ఆప్షన్ ఇవ్వకుండా, మీరు ఇంగ్లీష్ మీడియం చదవాల్సిందే, తెలుగు మీడియం ఉండదు అంటూ, ఒక తెలుగు రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై, గత ఆరు నెలలుగా రచ్చ జరుగుతూనే ఉంది. మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టండి, గతంలో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూల్స్ లో ఉంది, కాకపోతే, ఏ మీడియంలో చదువుకోవాలో ఆ స్వేఛ్చ తల్లిదండ్రులకు, పిల్లలకు ఇవ్వండి, అంటూ ఎంత మంది చెప్తున్నా, ప్రభుత్వం మాత్రం వినకుండా తెలుగు మీడియం ఉండదు, కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది అంటూ, దూకుడుగా వెళ్తుంది. అయితే, ప్రభుత్వానికి, ఎందుకు ఇంత మొండి పట్టుదల, ఆప్షన్ ఇవ్వటానికి, ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. రాజ్యంగంలో కూడా, మాతృభాషలో నేర్చుకోవటం హక్కు అని చెప్తున్నా, ప్రభుత్వం మాత్రం, రాజ్యాంగాన్ని కూడా లెక్క చెయ్యటం లేదు. సాక్షాత్తు వైసీపీ ఎంపీ రఘు రామ కృష్ణం రాజు కూడా, ఈ విషయం పార్లమెంట్ లో చెప్పారు.

సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నా, జగన్ ప్రభుత్వం మాత్రం, తెలుగు మీడియం అసలు మేము ఆప్షన్ పెట్టం, అందరూ మేము చెప్పినట్టు ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే చదవాలి అంటూ, ఆదేశాలు ఇచ్చింది. అయితే, దీని పై కొంత మంది కోర్ట్ కు వెళ్ళటంతో, హైకోర్ట్ లో కూడా ప్రభుత్వానికీ వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఏ భాషలో చదువుకోవాలో, తల్లిదండ్రుల ఇష్టానికే వదిలి పెట్టాలని కోరారు. తమ ఆదేశాల్లో అదే చెప్పారు. అయితే కిందపడ్డా తనదే పైచేయి అంటుంది జగన్ సర్కార్. ఆప్షన్స్ ఇవ్వాలి అనే మాట లెక్క చెయ్యకుండా, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల పై హైకోర్టు మొట్టికాయలు వేసినా తీరు మారటం లేదు. మరో రూట్ లో, మళ్లీ ఆంగ్ల మాధ్యమాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టింది.

నిన్న ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల సారాంశం ఇలాగే ఉంది. అర్ధరాత్రి ఇంగ్లీష్ మీడియం పై మరో జీవో తెచ్చింది జగన్ సర్కారు. వాలంటీర్ల ద్వారా, మరో సర్వేకు తెర లేపింది. అందరి ఇళ్ళకు వెళ్లి, ఏ మీడియం చదవు కావాలో, సర్వే చేయ్యనుంది. తల్లిదండ్రులు ఇంగ్లీషే కావలంటున్నారనే వంకతో మళ్ళీ ఆంగ్ల మాధ్యమాన్ని తెరపైకి తెచ్చేలా స్కెచ్ వేసింది. గ్రామ సచివాలయాల్లో మాధ్యమం ఎంపిక ఫారాల వెనుక మాటలబు ఇదే అని అంటున్నారు. ఈ సర్వే వీలు అయినంత త్వరగా చేసి, ఆ సర్వే ఆధారంగా, మళ్ళీ సుప్రీం కోర్ట్ కు వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం కావాలని ఆప్షన్ ఇవ్వకుండా, మీడియం ఎంచుకునే స్వేఛ్చ ఇవ్వకుండా, ఇంగ్లీష్ మీడియం బలవంతంగా రుద్దుతుంది అని చెప్తుంటే, ఇప్పుడు అదే ప్రభుత్వం చేస్తున్న సర్వేని, కోర్టులు ప్రామాణికంగా తీసుకుంటాయా ? చూడాలి మరి, తరువాత ఏమి జరుగుతుందో ?

జగన్ మోహన్ రెడ్డితో, అనుకూలంగా ఉన్నట్టు కనపడుతూనే, చేసేది అంతా వెనక నుంచి చేస్తూ ఉంది కేంద్రం. అనేక అంశాల్లో, జగన్ కు అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తున్నా, వెనుక నుంచి మాత్రం చెయ్యల్సింది అంతా సైలెంట్ గా చేసేస్తుంది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే చేసిన మొదటి పని, చంద్రబాబు మీద కక్ష తీర్చుకునే పనిలో భాగంగా, చంద్రబాబు హయంలో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను మళ్ళీ సమీక్ష చేస్తాను, రేటు తగ్గిస్తాను అంటూ, చేసిన హడావిడి తెలిసిందే. ఈ చర్యల్లో భాగంగా, సోలార్, విండ్ ఎనర్జీ విధ్యుత్ ఉత్పత్తి కంపెనీలకు చెల్లింపులు కూడా చెయ్యకుండా ఆపేసిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపుగా, 40కు పైగా కంపెనీలు హైకోర్ట్ కు కూడా వెళ్ళాయి. దీంతో హైకోర్ట్ ఈ విషయం పై స్టే ఇవ్వటం కూడా జరిగింది. అలాగే ఈ విషయం ట్రిబ్యునల్ లో కూడా కొట్టేసింది. ఈ నేపధ్యంలోనే, కొన్ని దేశాలు, ఏకంగా ప్రధాన మంత్రికి కూడా ఉత్తరాలు రాసిన సంగతి తెలిసిందే.

మా కంపెనీలను, మీ రాష్ట్రం ఇబ్బంది పెడుతుంది, ఇలా అధికారం మారిన ప్రతి సారి, సమీక్షలు చస్తాం అంటే, ఎవరు పెట్టుబడి పెడతారు ? ఇలాగే కొనసాగితే, ఆ రాష్ట్రంలోనే కాదు, మీ దేశంలోనే పెట్టుబడులు పెట్టం, అంటూ హుకం జారీ చేసాయి. దీంతో కేంద్రం కూడా, రాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వటం, ఇవన్నీ తెలిసిందే. అయినా సరే, జగన్ మోహన్ రెడ్డి మాత్రం, ఈ పీపీఏల సమీక్ష పై మొండిగానే ఉన్నారు. ఇక లాభం లేదు అనుకుందో ఏమో కాని, కేంద్రం డైరెక్ట్ గా రంగంలోకి దిగింది. పాత చట్టానికి, దుమ్ము దులిపింది. 2003 విద్యుత్తు చట్టంలో ఉన్నా, అనేక నిబంధనలు మార్చి, ఈ ఒప్పందాలకు, మరింత భద్రత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి, ఒక డ్రాఫ్ట్ బిల్ రెడీ చేసింది.

ఈ బిల్ పై అభ్యంతరాలు, సలహాలు ఉంటే, 21 రోజుల్లో చెప్పాలని, రాష్ట్రాలను కోరింది. ఈ సవరించిన చట్టం ప్రకారం, ఏ రాష్ట్రం అయినా సరే, తాము చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సిందే. ఈ ఒప్పందాలు పర్యవేక్షణ చేసేందుకు, ఎలక్ట్రిసిటీ కంట్రాక్ట్ ఎన్‌ ఫోర్స్‌ మెంట్ అథారిటీ ఒకటి ఏర్పాటు చెయ్యబోతున్నారు. ఇక ఒప్పందాల్లో ఉన్నట్టు, సోలార్, విండ్ పవర్ కొనాల్సిందే. అల కొనను అంటే, యూనిట్‌కు ఏకంగా 50 పైసల పెనాల్టీ, విధిస్తారు. అలాగే డిస్కం చెల్లింపులు అన్నీ, అదే ఏడాదిలో జరిగిపోవాలి. వచ్చే ఏడాది జనాల పై భారం వేస్తాం అంటే కుదరదు. అలాగే పభుత్వాలు, గృహ వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీ కూడా, బిల్ లో అడ్జెస్ట్ చెయ్యటం కాకుండా, బ్యాంకు ఖాతాలో వెయ్యాలని, నిర్ణయం తీసుకున్నారు. ఇలా అనేక సవరణలతో, కేంద్రం రంగంలోకి దిగుతుంది.

Advertisements

Latest Articles

Most Read