కావలి నియోజకవర్గ జగన్ ప్రజాసంకల్ప యాత్రలో తోలు కొచ్చిన జనాలకు కనీఅసం అన్నం, నీళ్లు కూడా లేక అలమటించిపోయారు.. తమను మీటింగ్ కు పిలిచి కనీసం నీళ్ళప్యాకెట్ కూడా ఇవ్వలేదని తిట్టి పోశారు.. అయిదు ఆటోల్లో 55 మంది వచ్చామని, మూడు అవుతున్నా, కనీసం నీళ్ళు ఇవ్వలేదు, జబ్బులు ఉన్న వాళ్ళం ఉన్నాం, తిండి పెడతాం అన్నారు, ఇప్పటి వరకు లేదు అంటూ, తిట్టి పోశారు... కావలి ఎమ్మల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, మమ్మల్ని రమ్మన్నారని చెప్పారు.. తిండి పెట్టని వాళ్ళు, మంచి నీళ్ళు ఇవ్వని వారు, ఇక మాకు డబ్బులు ఏమి ఇస్తారు అంటూ, తిట్టి పోస్తున్నారు...
జగన్ నెల్లూరులోకి వచ్చిన దగ్గర నుంచి, సభలకు జన సమీకరణ ఆ పార్టీ నేతలకు పెద్ద సవాలుగా మారుతోంది. ప్రతిష్ఠాత్మకంగా సాగుతున్న ఈ పాదయాత్రను విజయవంతం చేసేందుకు స్థానిక నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. అధినేత దృష్టిలో పడాలని పోటా పోటీగా జనసమీకరణ చేస్తూ రూ. లక్షలకు లక్షలు ఖర్చు చేస్తుండడాన్ని ఆ పార్టీ వర్గాలే విశేషంగా చెప్పుకొంటున్నాయి. పాదయాత్రలో ఎక్కడా ఎలాంటి లోటు రాకుండా పెద్ద ఎత్తున జనసమీకరణ జరిపి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నెల నుంచే ఆ పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించుకున్నారు. మొదటి సభ నాయుడుపేటలో నిర్వహించినప్పుడు పెద్ద ఎత్తున జనసమీకరణ సాగించారు.
ఆ మరుసటి రోజు ఓజిలి మండలంలో జరిగిన పాదయాత్రలో జన సందడి లేకపోవడంతో కొంత నిరాశ వ్యక్తమైంది. వెయ్యి కిలోమీటర్లు పాదయాత్ర పూర్తయిన సందర్భంగా సైదాపురం మండలంలో జరిగిన సభను వెంకటగిరి నియోజకవర్గం ఖాతాలో వేశారు. ఆ తరువాత పొదలకూరులో జరిగిన బహిరంగ సభల్లో జగన్ ప్రసంగించారు. ఈ సభలు జరిగిన తీరును పరిశీలిస్తే నేతల పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు. జన సమీకరణ బాధ్యత ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలు, ఎమ్మెల్యేలపై ఉండడంతో తమ నియోజకవర్గంలో అధినేత పర్యటించినప్పుడు దానిని సక్సెస్ చేయకపోతే తగినన్ని మార్కులు పడవు. తమ సత్తా నిరూపించుకునేందుకు మండల, నియోజకవర్గ స్థాయి నేతలు ఎవరికి వారు జగన్ సభలకు జనాన్ని తీసుకువచ్చారు.