నిన్న జరిగిన తిరుపతి ఎన్నికల్లో, నకిలీ ఎన్నికల ఓటర్ ఐడి కార్డులతో వచ్చి, బయట నుంచి వచ్చిన వేలాది మంది ఓట్లు వేసారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో టిడిపి వీడియోలతో సహా బయట పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా టిడిపి కుట్ర అంటూ వైసీపీ ఎదురు దాడి చేస్తుంది. ఈ విషయం మీద, టిడిపి పార్లమెంట్ అభ్యర్ధి పనబాక లక్ష్మి, ఓపెన్ సవాల్ విసిరారు. గురువారం నాడు తిరుమల శ్రీవారి నేత్ర దర్శనం రోజు, పవిత్రమైన రోజున, ఆ రోజున మీరు ప్రమాణానికి సిద్ధం అవుతారా అని సవాల్ విసిరారు. దొంగ ఓట్లు వేయలేదని, నకిలీ ఓటర్ కార్డులతో ఎవరూ రాలేదని, వారు అంతా భక్తులు అంటూ, తిరుమల దర్శనానికి, శ్రీకాళహస్తి దర్శనానికి వచ్చారు అంటూ, మంత్రి పెద్దిరెడ్డితో, ఇతర వైసీపీ నేతలు చెప్తున్న నేపధ్యంలో, పనబాక లక్ష్మి సవాల్ విసిరారు. వారు దొంగ ఓటర్లు కాదని, నకిలీ ఓటర్లు కాదని, మాకు సంబంధం లేదని మీరు ప్రమాణం చేయగలరా, ఆ విషయంలో మీరు మా పైన ఆరోపిస్తున్నట్టు, వారికి మాకు ఎలాంటి సంబంధం లేదని, మేము ప్రమాణం చేస్తాం అంటూ పనబాక లక్ష్మి ఓపెన్ చాలెంజ్ విసిరారు. గతంలో కూడా వివేక కేసు పై లోకేష్ మీద ఆరోపణలు చేయటం, లోకేష్ వెంకన్న పై ప్రమాణం చేద్దామని చాలెంజ్ చేయటం, ఆ తరువాత లోకేష్ ఒక్కడే ప్రమాణానికి రావటం, జగన్ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ రాకపోవటం తెలిసిందే.

panabaka 18042021 2

ఈ నేపధ్యంలో, తిరుపతిలో మరోసారి సవాల్ చేసుకోవటం, ఇప్పుడైనా వైసీపీ నేతలు, ముఖ్యంగా పెద్దిరెడ్డి, ఈ సవాల్ ను స్వీకరిస్తారో లేదో చూడాలి. నిన్న పనబాక లక్ష్మితో పాటుగా, తెలుగుదేశం నేతలు స్వయంగా, దొంగ ఓటర్లను పట్టుకున్నారు. పెద్దిరెడ్డి కళ్యాణమండపం నుంచి తండోపతండాలుగా వస్తున్న దొంగ ఓటర్లను, వారిని తరలిస్తున్న బస్సులను పట్టుకున్నారు. ఏకంగా ఎస్పీ కార్యాలయం ఎదుటే టిడిపి నేతలు ఒక బస్సుని పట్టుకున్నారు. అందులో అంతా దొంగ ఓట్లు వేయటానికి వచ్చిన వారు ఉన్నారని, టిడిపి నేతలు ఆరోపించారు. దీని పై ఆందోళన కూడా చేసారు. అదే విధంగా ఎక్కడికక్కడ పోలింగ్ బూత్ లలో కూడా నకిలీ ఓటర్లను పట్టుకున్నారు. కార్డు తీసుకుని తండ్రి పేరు అడిగితే చెప్పలేక పోయారు. భర్త పేరు అడిగితే చెప్పలేక పోయారు. కొంత మంది పరిగెత్తారు. ఇవన్నీ టీవీల్లో వచ్చాయి. అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయినా, సరే పెద్దిరెడ్డి మాత్రం, ఇదంతా టిడిపి కుట్ర అని చెప్పటంతో, పనబాక లక్ష్మి చాలెంజ్ చేసారు. మరి దీనికి పెద్దిరెడ్డి ఏమి అంటారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read