జగన్ మోహన్ రెడ్డి, టిడిపి మహిళా నేత, మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ విమర్శలు వర్షం కురిపించారు. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి, ప్రతి శుక్రవారం కోర్ట్ కు వెళ్ళకుండా, కుంటి సాకులు చెప్తున్నారని, సిబిఐ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని, జగన్ పై సరైన ఆక్షన్ తీసుకోవాలని అన్నారు. ఆమె ఏమన్నారంటే, "గూగుల్‌లో ఖైది నెంబర్‌ 603 ఎవరు అని టైప్‌ చేస్తే జగన్మోహన్‌రెడ్డి పేరు వస్తుంది. ఆంధ్ర 420 ఎవరు అని టైప్‌ చేస్తే జగన్మోహన్‌రెడ్డి పేరు వస్తుంది. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి జగన్మోహన్‌రెడ్డిది. ఈ ఫ్రైడే ఖైదీ ఎందుకు కోర్టుకు వెళ్లటంలేదని ప్రశ్నిస్తున్నాను. చిన్న పిల్లలు బడికి వెళ్లకుండా కుంటి సాకులు చెప్పినట్లు జగన్మోహన్‌రెడ్డి కోర్టుకు వెళ్లకుండా ఇప్పటికి 33 శుక్రవారాలు కుంటి సాకులు చెప్పి కోర్టుకు ఎగ్గొట్టడం జరిగింది. జగన్మోహన్‌రెడ్డి కుంటి సాకులు చెబుతున్నారని న్యాయస్థానాలు గమనించాలని మనవి. ఒక శుక్రవారం కేసీఆర్‌ను కలవటం కోసం కుంటి సాకులు చెప్పారు. మీరు ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసి ఆంధ్రప్రదేశ్‌కి ఏం లాభం తీసుకొచ్చారో సమాధానం చెప్పాలి. "

"కేసీఆర్‌ ను కలిసిన విషయం కనీసం ఏ విషయం మీద కలిశారో ప్రెస్‌ మీట్‌ కూడా పెట్టలేదు. విద్యుత్‌ బకాయిలు రూ. 5 వేల కోట్లు మనకు రావాల్సిన వాటి గురించి ప్రయత్నం చేశారా? కేబినెట్‌ నిర్ణయం లేకుండా ఆంధ్ర రాష్ట్ర ఆస్తులను కేసీఆర్‌కు కట్టబెట్టిన పరిస్థితి ఏర్పడింది. మరొకరోజు డిప్లమోటిక్‌ ఔట్‌సోర్సింగ్‌ సదస్సు ఉందని, దానికి కోర్టుకు హాజరు కాలేనని ఆప్సంట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ సదస్సు వల్ల ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు ఏమైనా తీసుకొచ్చారా? రూ. 70 వేల కోట్ల కంపెనీ అదానీ ని వెళ్లగొట్టారు. రూ. 2 వేల కోట్ల పెట్టుబడులు లులూ కంపెనీ,పేపర్‌ మిల్లు సంస్థను వెళ్లగొట్టారు. కియా అనుబంధ సంస్థలను వెళ్లగొట్టారు. మరో శుక్రవారం వాషింగ్‌టన్‌లో బిజినెస్‌ సదస్సు ఉందని కోర్టుకు వెళ్లకుండా ఎగ్గొట్టారు. విదేశీ పెట్టుబడులు ఎంత తీసుకొచ్చారు? ఎక్కడ పెట్టారు? సమాధానం చెప్పాలి. పిడసగట్టిన సన్నాసి బియ్యాన్ని పంచటానికి శుక్రవారం కోర్టుకు వెళ్లకుండా ఆప్సంట్‌ పెట్టారు. నీతి ఆయోగ్‌ ఛైర్మన్‌ని కలవటం కోసం శుక్రవారం కోర్టుకు వెళ్లకుండా ఎగ్గొట్టారు. ఆయనతో ప్రత్యేక హోదా గురించి మీరేమైనా మాట్లాడారా? విభజన చట్టంలోని అంశాల గురించి ఏమైనా మాట్లాడారా? ఇంకొక శుక్రవారం మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ సమీక్ష ఉందని కోర్టుకు వెళ్లకుండా ఎగ్గొట్టారు. కేంద్ర ప్రభుత్వం తిరుపతి, అమరావతి, వైజాగ్‌ స్మార్ట్‌ సిటీగా గుర్తిస్తే దానికి మీరేమైనా చేశారా? స్వచ్ఛభారత్‌లో వైజాగ్‌ 7వ స్థానం నుండి 23 స్థానానికి పడిపోవడానికి కారణం మీరు కాదా? మీ సమీక్ష వల్ల ఏం ఉపయోగం కలిగిందో చెప్పాలి.

"పర్యాటక రంగం మీద సమీక్ష అంటూ కోర్టుకు హాజరు కాలేదు. గోదావరి నదిలో పడవ కొట్టుకుపోయి వందల మంది అక్కడ చనిపోతే గ్రౌండ్‌ లెవల్‌పై దిగకుండా ఏరియల్‌ సర్వే చేసిన మీరు పర్యాటక సమీక్ష ఏ విధంగా చేస్తారో మాకు అర్థం కవడంలేదు. బోటు ప్రమాదంలో చనిపోయినవారిని బయటకు తీయుటకు 40 రోజులు పట్టింది. ఏం పర్యాటక సమీక్ష? ఏం పర్యాటక అభివృద్ధి? నవరత్నాల సమీక్ష అంటూ కోర్టుకు ఎగనామం పెట్టారు. మీ నవరత్నాలేమోగానీ, ప్రజలు తలకు నవరత్న ఆయిల్‌ పూసుకుంటున్నారు. 33 శుక్రవారాలు కోర్టుకు వెళ్లకుండా నెలవంక, చంద్ర వంక లాగ రివ్యూ మీటింగ్‌లంటూ అర్ధరాత్రి 12.30 గంటల వరకు పెట్టటం వలన అధికారులు విసిగిపోతున్నారు. 12.30 తరువాత కోర్టు ఇక అడగదు కాబట్టి పబ్జీ గేమ్‌, వేడీయో గేమ్‌లు ఆడుకుంటున్నారు. ఈసమీక్షల వల్ల ప్రజలకు జరిగిన న్యాయమేంటో సీబీఐ ప్రశ్నించాలని మేము కోరుకుంటున్నాం. గతంలో జగన్మోహన్‌రెడ్డి కోర్టుకు రావాల్సిందేనని సీబీఐ కోరటం జరిగింది. కోర్టు కూడా జగన్‌ని హాజరు కావాలని పిలుపు నివ్వాలని మేము రిక్వెస్ట్‌ చేస్తున్నాం. ఆర్థిక నేరాలు, మనీ లాండరింగ్‌, క్రిమినల్‌ కేసులు ఇలాంటివి సంవత్సరం లోపు విచారణ జరపాలని, పూర్తి చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. ప్రజల సొమ్ము రూ. లక్ష కోట్లు దోచుకున్న జగన్మోహన్‌రెడ్డి ఆర్థిక నేరస్థుడిపై సమీక్షలు జరగాలి. ఇలాంటివి జరపకుండా చింతకాయ సమీక్షలు ఎందుకు?" అంటూ అనురాధ ఫైర్ అయ్యారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read