మాకు 20 ఎంపీ సీట్లు గెలిపించండి, మోడీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకోవస్తాం అని, తిరిగిన ప్రతి చోట, ఊరుఊరునా జగన్ ఈ ప్రచారం చెయ్యటంతో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ ఇది నమ్మారు. చంద్రబాబు ఎంత పోరాటం చేసినా మోడీ ఏమి లెక్క చెయ్యరని, అదే జగన్ అయితే మోడీ మెడలు వంచేసి, ఒక్క రోజులోనే ప్రత్యెక హోదా తెచ్చేస్తారని ప్రజలు నమ్మారు. అందుకే జగన మోహన్ రెడ్డి పార్టీకి ఏకంగా 22 ఎంపీ సీట్లు ఇచ్చారు. ఫలితాల రోజు ప్రజలు కూడా, సంబరపడ్డారు. ఇక మోడీకి మూడింది, 22 ఎంపీ సీట్లతో, దేశాన్ని ఊపేసి, రాష్ట్రానికి ప్రత్యెక హోదా తీసుకు వస్తారని అందరూ నమ్మారు. అయితే మొదటి సారి ఢిల్లీ వెళ్లి మోడీని కలిసి, బయటకు వచ్చి జగన్ చెప్పింది విని, జగనన్న మడం తిప్పేసాడు, మాట తప్పేసాడు అని బాధ పడుతున్నారు. సార్, ప్లీజ్ సార్ ప్లీజ్ అంటూ, మోడీని ప్రత్యెక హోదా గురించి అడుగుతూనే ఉంటానని, జగన్ మాటలు విని అవాక్కవ్వటం ప్రజల వంతు అయ్యింది. తరువాత మోడీ కాళ్ళ మీద రెండు సార్లు పడబోతే, మోడీ వారించటం ప్రపంచమంతా చూసింది.
ఇలా జగన్ ఎదో చేసేస్తాడు అని గెలిపిస్తే చివరకు, ప్లీజ్ సార్ ప్లీజ్ దగ్గర జగన ఆగిపోయారు. అయితే వైసీపీ చేసే ప్రచారం మాత్రం కోటలు దాటిపోతుంది. మా పార్టీకి, మోడీ, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ పదవి ఆఫర్ చేసారని, అయితే మా జగన్ మాత్రం, అది మాకు వద్దు అని నిరసన చెప్పినట్టు ప్రచారం చేసుకున్నారు. మాకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా, ఈ డిప్యూటీ స్పీకర్ పదవి ఎందుకు అంటూ, జగన్ చెప్పినట్టు, మోడీ ఆఫర్ ను తిరస్కరించి, త్యాగం చేసినట్టు హడావిడి చేసారు. అయితే ఈ రోజు మాత్రం, డిప్యూటీ స్పీకర్ కంటే చిన్న పోస్ట్ అయిన, లోక్ సభ ప్యానెల్ స్పీకర్ పదవి వైసీపీ తీసుకోవటం చూస్తుంటే, పైన చెప్పినవి అన్నీ అబద్ధాలే అని తేలిపోయింది. మిథున్ రెడ్డిని లోక్ సభ ప్యానెల్ స్పీకర్ గా నియమిస్తూ, స్పీకర్ ఓం బిర్లా ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. మోడీ పై నిరసనగా, డిప్యూటీ స్పీకర్ పదవినే ఎడం చేత్తో విసిరేసిన వైసీపీ, మరి దానికంటే అతి చిన్న పోస్ట్ అయిన ప్యానెల్ స్పీకర్ పదవి ఎందుకు తీసుకొందో మరి.