అమరావతి రైతులు, న్యాయస్థానం టు దేవస్థానం అంటూ చేస్తున్న పాదయాత్ర ప్రజల ఆదరణతో దిగ్విజయంగా, అద్బుతంగా, జరుగుతుంది. ప్రజలు ఎక్కడికక్కడ పోటెత్తుతున్నారు. మూడు రాజధానులు వద్దు, ఒకటే రాజధానిగా ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తూ, అమరావతి కోసం పోరాటం చేస్తున్న రైతులకు మద్దతు ఇస్తున్నారు. రోజు రోజుకీ ప్రజాధరణ పెరుగుతుంది. అమరావతి రైతుల పాదయాత్ర ఆరో రోజుకి చేరుకుంది. గుంటూరు జిల్లా దాటి, ఈ రోజు ప్రకాశం జిల్లా పర్చూరుకు చేరుకుంది. గుంటూరు జిల్లాకు మించి, పర్చూరులో స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున ప్రజలు ఈ రోజు స్వాగతం పలికారు. దీంతో ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కన్ను కుట్టిందో, లేక రూల్స్ కేవలం అమరావతి వారికే గుర్తుకు వచ్చాయో కానీ, పోలీసులు ఈ రోజు అమరావతి జేఏసి వారికి షాక్ ఇచ్చారు. అయితే అమరావతి రైతులు కూడా అదే స్థాయిలో జవాబు చెప్పారు. పాదయాత్ర నిర్వాహకులకు ఈ రోజు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ముఖ్యంగా మూడు అంశాలు ఇందులో పొందుపరిచారు. ట్రాఫిక్ కి తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారు అంటూ ఒక కారణం చెప్పారు. అలాగే కో-వి-డ్ నిబంధనలు పాటించటం లేదని, మాస్కులు ధరించటం లేదని తెలిపారు. ఇక ఎక్కువ మంది జనం వస్తున్నారు అంటూ వింత వాదన వినిపించారు.

amaravati 06112021 2

హైకోర్టు పర్మిషన్ తో 157 మంది రైతులు పాదయాత్ర చేస్తున్నారు. వారికి సంఘీభావంగా అనేక మంది రొజూ వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. మరి ఇది ఎలా తపు అవుతుందో పోలీసులుకు తెలియాలి. ఎక్కువ మంది జనాలు వస్తున్నారు అనేది ఒక కారణం అయితే, ఈ రోజు జగన్ పాదయాత్ర చేసి నాలుగు ఏళ్ళు అయ్యింది అంటూ, వైసీపీ నేతలు చేసిన పెద్ద ర్యాలీలను ఏమనాలి ? మొత్తానికి, నోటీసులు ఇచ్చిన పోలీసులు వారం రోజుల్లో సమాధానం చెప్పాలని కోరారు. దీనికి అమరావతి జేఏసి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. తాము ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని, పోలీసులు కనీసం ట్రాఫిక్ కూడా కంట్రోల్ చేయకపోతే, మేమే చేసుకుంటున్నాం అని అన్నారు. ప్రజలు మద్దతు ఇస్తే తాము ఏమి చేయం అని అంటున్నారు. వారం రోజుల్లో నోటీసులకు సమాధానం ఇస్తాం అని, ఈ పాదయాత్ర ఎట్టి పరిస్థితిలోనూ ఆపం అని తేల్చి చెప్పారు. చీరాల డీఎస్పీ వచ్చి నోటీసులు ఇచ్చిన సందర్భంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read