ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో తలమునకలయ్యాయి. పోటీలో తలపడుతున్న అభ్యర్థులు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ నేపథ్యం ఓటర్లను ఆకట్టుకునేందుకు గుళ్లు, గోపురాలు తిరుగుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ అభ్యర్థి అనుచరుడు చేసిన ఓ వింతచేష్ట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. హారతి పళ్లెంలో వేసిన దక్షిణ కానీ లేదా హుండీలో వేసిన కానుకలు వెనక్కి తీసుకోకూడదని అంటారు. కానీ వైసీపీ అభ్యర్థి పార్థసారధి అనుచరులకు ఇదేమీ పట్టినట్టు లేదు.
ఎంచక్కా అందరూ చూస్తుండగా హారతి పళ్లెంలో వేసిన దక్షిణ సొమ్మును వెంటనే వెనక్కి తీసుకున్నాడు. ఈ దృశ్యం కెమెరాకు చిక్కి ఆ పై సోషల్ మీడియాకు ఎక్కింది. ఇప్పడిది వైరల్‌గా మారింది. నెటిజన్లు సెటైర్లు వేస్తూ నవ్వుపుట్టిస్తున్నారు. మరికొందరు వైసీపీ నేతల తీరును తప్పుబడుతున్నారు. ఇక మరో పక్క, ప్రకాశం జిల్లా పర్చూరులో వైసీపీ కార్యకర్తలు మందుకొడుతూ హల్ చల్ చేశారు. పర్చూరు వైసీసీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు నడిరోడ్డుపై మద్యం తాగుతూ, వాహనాలు ఎక్కి ఊగిపోయారు. రోడ్డుపై హల్ చల్ చేశారు. పర్చూరులోని మద్యం దుకాణాలన్నీ వైసీపీ కార్యకర్తలతో నిండిపోయాయి. https://youtu.be/3oMAX7TisPY