తిరుమల పవిత్రతను, వెంకన్న స్వామిని, కూడా రాజకీయాల్లోకి లాగి, చంద్రబాబుని రాజకీయం సాధించటం కోసం, రమణ దీక్షితులతో కలిసి, ఆపరేషన్ గరుడ బ్యాచ్ ఎలాంటి నాటకాలు ఆడిస్తున్నారో చూసాం... లేని పింక్ డైమెండ్ పోయింది అంటూ అబద్ధాలు, చివరకి స్వామి వారికి కూడా నైవేద్యం ఇవ్వటం లేదు అంటూ అపచారపు మాటలు, నేళమాలిగులు తవ్వేసారు అంటూ రమణ దీక్షితులు ఆరోపణలు చేసారు. అమిత్ షా తిరుమల వెళ్లి వచ్చిన మరుసటి రోజే, ఇవి మొదలు పెట్టారు. నిన్న ఏకంగా జగన్ ను కలిసారు దీక్షితులు, అదీ లోటస్ పాండ్ లో... ఇలా తిరుమల ప్రతిష్టతను సర్వ నాశనం చేస్తున్నారు. దీంతో రమణ దీక్షితుల అసత్య ఆరోపణలకు గట్టిగా సమాధానం ఇచ్చేందుకు టీటీడీ సిద్ధమయింది. ఈ రోజు శ్రీవారి దర్శనానికి శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద వచ్చారు.
దీంతో ఆయనకు మరమ్మతులు జరిగిన వకుళమాత పోటును టీటీడీ చూపించింది. అన్నీ గమనించిన పరిపూర్ణానందస్వామి, పోటులో తవ్వకాలు జరగలేదని నిర్ధారించారు. సంపంగి ప్రాకారంలో ప్రసాదాల తయారీ ప్రాంతాన్ని కూడా పరిపూర్ణానంద స్వామికి చూపించి అనుమానాలను టీటీడీ నివృత్తి చేసింది. 2001, 2007లో పోటు మరమ్మతుల కారణంగా ఇక్కడే ప్రసాదాలను తయారు చేశామని పరిపూర్ణానంద స్వామికి పోటు సిబ్బంది చెప్పారు. రమణ దీక్షితులు ఆమోదం తెలిపిన పత్రాన్ని కూడా టీటీడీ చూపించింది. రమణ దీక్షితులు ఆరోపణలపై పరిపూర్ణానంద స్వామి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శనివారం జరిగే పీఠాధిపతుల సమావేశంలో ఈ అంశాన్ని తెలియజేస్తానని పరిపూర్ణానంద స్వామి టీటీడీకి హామీ ఇచ్చారు.
టీటీడీలో జరుగుతున్న అక్రమాలపై రమణ దీక్షితులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రమణదీక్షితులు మొదలు పెట్టిన దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఎట్టకేలకు టీటీడీ నిర్ణయించింది. ఇటు రమణదీక్షితులు సైతం తగ్గకుండా టీటీడీపై దాడి కొనసాగిస్తున్నారు. వ్యూహాత్మకంగానే ఆయన దేశంలోని ప్రధాన నగరాల్లో మీడియా సమావేశాలు పెడుతున్నారు. తిరుమలలో అడుగు పెట్టకుండానే ఆయన సాగిస్తున్న దాడిపై తగిన చారిత్రక ఆధారాలతోనూ, న్యాయపరంగానూ ప్రతిదాడి చేయాలని టీటీడీ కూడా సిద్ధమవుతోంది. మొత్తం మీద ఈ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేట్లుగా లేదు. ఢీ అంటే ఢీ అనే విధంగానే కొనసాగుతోంది.