జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గుండు వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి... ఎప్పుడో జరిగిన ప్రచారం పై, ఇటీవల జనసేన కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. పరిటాల తనకు గుండు చేయించలేదని పవన్ తెలిపిన సంగతి తెలిసిందే. ఆ మధ్య తనకు పరిటాల రవి గుండు చేయించారని మీడియాలో కథనాలు వచ్చాయని, తాను కావాలనే చిరాకుగా ఉండి గుండు చేయించుకున్నాని చెప్పారు. తనకు ఎవరైనా గుండు చేయిస్తే ఊరుకుంటానా..? అని ప్రశ్నించారు. దానిపై దశాబ్దాల తరువాత ఇటీవల పవన్ తొలిసారిగా స్పందించడంపై ఏపీ మంత్రి పరిటాల సునీత మాట్లాడారు.

paritala 11122017 2

 ఈ ఉదయం తిరుపతికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ, తన భర్తకు, పవన్ కల్యాణ్ కూ సంబంధమే లేదని, ఈ విషయంలో పవన్ నిజమే చెప్పారని అన్నారు. అసలు పరిటాల రవి, పవన్ కు గుండు ఎందుకు కొట్టిస్తారని ప్రశ్నించారు. తన భర్త అంత మూర్ఖుడు కాదని, ప్రజలు అసత్యపు ప్రచారాన్ని నమ్మకుండా నిజానిజాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారని, కంటిముందు జరుగుతున్న అభివృద్ధి కనిపిస్తున్నా, వైసీపీ నేతలకు మాత్రమే అదంతా బూటకంగా కనిపిస్తోందని సునీత విమర్శలు గుప్పించారు.

paritala 11122017 3

 పవన్‌ కల్యాణ్‌కు తాను గుండు చేయించలేదని గతంలో పరిటాల రవి కూడా తెలిపారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ నగర్‌లో పరిటాల ఇంటి పక్కన ఉన్న స్థలం కొనుగోలు చేయాలని చిరంజీవి అనుకొన్నారట. కానీ భద్రతాపరమైన సమస్యలు ఉండటంతో ఆయన రవి వద్దని చెప్పారు. ఆ ప్రాంతానికి వచ్చే ప్రతి వాహనం గురించి పరిటాల అనుచరులు ఆరా తీసేవారు. చిరంజీవికి ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతోనే పరిటాల ఆ స్థలం తీసుకోవద్దని చెప్పారట. దీంతో మెగాస్టార్ కూడా ఆ స్థలం తీసుకోలేదు. ఆ ఒక్క విషయం మినహా చిరంజీవి ఫ్యామిలీలో ఎవరితోనూ తనకు ఎలాంటి సమస్యలు లేవని పరిటాల గతంలోనే చెప్పారు. పవన్‌తో నాకు అసలు పరిచయమే లేదన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read