ఈ రోజు కూడా అనుకున్నదే అయ్యింది... 56 అంగుళాల ఛాతీ, ఆంధ్రోడి దెబ్బకు 16 రోజుల నుంచి పారిపోతూ ఉండటం చూసాం... అయితే ఈ రోజు కూడా ఇదే తంతు కొనసాగింది... అయితే, రేపటికి కాకుండా, సభ సోమవారానికి వాయిదా పడింది.... మొన్నటి దాకా తెరాస, అన్నాడీయంకే సభ్యలను సాకుగా చూపి వాయిదా వేసారు. అయితే రెండు రోజుల నుంచి, తెరాస ఆందోళన విరిమించింది... అన్నాడీయంకే ఆందోళన కొనసాగిస్తూ ఉంది... దీన్ని సాకుగా చూపించి, అవిశ్వాసం పై ఢిల్లీ పెద్దలు సోమవారం దాకా వాయిదా వేసుకుని వెళ్ళిపోయారు...

delhi 28032018

స్పీకర్ అవిశ్వాసం చదివే అప్పుడు, అందరూ తమ స్థానాల్లో నుంచునున్నారు... కాని డ్రామా ప్రకారం, అన్నాడీఏంకే ఎంపీలు వెల్ లో , గోల గోల చేసారు... దీంతో సభ్యుల ఆందోళన మధ్య స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను సోమవారానికి వాయిదా వేశారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించేందుకు సభ్యులు వీలు కల్పించాలంటూ కోరారు. కానీ, కావేరీ అంశంపై అన్నాడీఎంకే సభ్యులు వెల్‌లోకి వెళ్లి తమ ఆందోళన కొనసాగించారు. ఈ నేపథ్యంలో సభ్యుల నిరసనల మధ్య లెక్కింపు సాధ్యం కాదంటూ లోక్‌సభను మంగళవారానికి వాయిదా వేశారు.

delhi 28032018

అవిశ్వాసాని భయం లేదంటూనే, బీజేపీ ఇలా డ్రామాలు ఆడిస్తుంది అని, విపక్షలాన్నీ అంటున్నాయి... అయినా మాకు సంపూర్ణ బలం ఉంది అని చెప్పుకుంటున్న బీజేపీ, ఎందుకు వెనకడుగు వేస్తుంది ? వీళ్ళు చేసిన ద్రోహాలు అన్నీ, బయట పడతాయనా ? అన్ని రాష్ట్రాల వారు, మోడీ పై విరుచుకుపడితే వీరిఇమేజ్ దెబ్బతింటుంది అనా ? ఒక పార్టీ ఎంపీలు ఆందోళన చేస్తుంటే, వారిని సస్పెండ్ చేసి సభ నడపలేరా ? కొన్ని ప్రతిపక్షాలు అంటున్నట్టు ప్రభుత్వం పై కాకుండా, స్పీకర్ పై కూడా అవిశ్వాసం పెడితే, అప్పుడు ఏమి చేస్తారు ? అప్పుడు కూడా ఇలాగే చేస్తారా ? అసలు వింత ఏంటి అంటే, సందట్లో సడేమియ్యా.. నా పేరు బుడే మియ్యా ... అన్నట్టు, ఇంత గోలలోనూ బిల్లులు పాస్ అయిపోతున్నాయ్...

Advertisements

Advertisements

Latest Articles

Most Read