గంట, కేవలం ఒక గంట... ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసాం... మోడీ పై మాకు విశ్వాసం లేదు... మా రాష్ట్రానికి మోసం చేసారు... చట్టంలో ఉన్నవి కూడా అమలు చెయ్యటం లేదు అంటూ చంద్రబాబు చెప్పారో లేదో... ఒకే ఒక గంట, కాంగ్రెస్, లెఫ్ట్, అన్నాడీయంకే, ఎస్పీ, ఏంఐయం, మమతా అందరూ, తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాసం తీర్మానానికి మద్దతు ఇచ్చారు... లోక్ సభలో కాంగ్రెస్ కు 48, అన్నాడీఎంకేకు 37 మంది ఎంపీలు ఉన్నారు. మిగతా పార్టీలను కూడా కలుపుకుంటే, దాదాపు వంద మందికి పైగా మద్దతు ఇచ్చే అవకాసం ఉంది....
పశ్చిమబంగా ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అయితే ట్వీట్ చేసి మరీ, చంద్రబాబుని అభినందించారు... ఎదో చంద్రబాబుని ఇబ్బంది పెడదాం అని, జగన్ తో అవిశ్వాసం డ్రామా ఆడించింది బీజేపీ... అయితే అనూహ్యంగా చంద్రబాబు వేగంగా పావులు కదిపారు... జగన్, అవిశ్వాసం ఎలాగు ముందుకు రాదని, ఇదంతా డ్రామా అని గ్రహించారు... వెంటనే, తన ఎంపీల చేత అవిశ్వాసం పెట్టించారు...
నోటీస్‌పై సోమవారం 54మంది ఎంపీలతో సంతకాలు చేయించి మరీ పట్టించి, చిత్తసుద్ధి చాటుకున్నారు... మీరు అవిశ్వాసం పెట్టండి, నేను ఢిల్లీకి వచ్చి, ఎంపీల చేత మద్దతు ఇప్పిస్తాను అన్న పవన్, కేంద్రం పై పోరాడుతున్న రాష్ట్రం పై బురద జల్లుతుంటే, చంద్రబాబు తన సత్తా ఏంటో చేసి చూపించారు... ఒకే ఒక గంట, మోడీ చేసిన ద్రోహాన్ని దేశానికికి చెప్పి, వారి మద్దతు కూడగట్టి, మోడీ పైనే అవిశ్వాసం పెట్టి, అన్ని రాజాకీయ పార్టీల మద్దతు తీసుకుని, జాతీయ స్థాయిలో రాజకీయం పెను సంచలనంగా మారింది...