ఆలయాలపై దాడు-లతో పాటు, ప్రవీణ్ చక్రవర్తి అనేవ్యక్తి 600 దేవాలయాలను క్రైస్తవ గ్రామాలుగా మార్చానని, హిందూదేవతల విగ్రహాలను ధ్వంసంచేశానని బహిరంగంగానేచెప్పినప్పటికీ అతనిపై ఈప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందని, అతన్ని అరెస్ట్ చేసి నెలరోజులైనా, విచారణలో అతనేం చెప్పాడనే వివరాలను ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడంలేదని టీడీపీ నేత బుచ్చిరామ్ ప్రసాద్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రవీణ్ చక్రవర్తి జగన్ కు చెందిన కుటుంబసభ్యులతో కలిసి పనిచేస్తూ, విదేశాలనుంచి నిధుల సేకరణ చేస్తున్నాడని, అతనికి కడపలోని ఐసీఐసీఐ బ్యాంకులో ఉన్న అకౌంట్ లోనికి రూ.93కోట్ల సొమ్ము ఎక్కడినుండి వచ్చిందనేదానిపై పోలీసులు ఎందుకు విచారణ జరపడం లేదన్నారు. అతన్ని అరెస్ట్ చేసి ఇన్నాళ్లైనా అతనుఏంచెప్పాడో, ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడం లేదని బుచ్చిరామ్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రవీణ్ చక్రవర్తి వ్యవహారంలో ప్రభుత్వం ఎందుకు గోప్యత వహిస్తుందో చెప్పాలన్న టీడీపీనేత, ఆయనపై ప్రభుత్వానికి ఎందుకంత ఆపేక్షో, ఆయనవివరాలు వెల్లడించడానికి ప్రభుత్వానికి ఎందుకుభయమో చెప్పాలని ప్రసాద్ నిలదీశారు. ప్రవీణ్ కుమార్ ఫోన్ సంభాషణలు బయటకువచ్చాకకూడా అతనివ్యవహారంలో ఎవరెవరికి ప్రమేయం ఉందో, అతనికి ఎక్కడెక్కడినుంచి నిధులువస్తున్నాయో ప్రభుత్వం ఎందుకు వెల్లడించడంలేదన్నారు. ప్రవీణ్ చక్రవర్తి వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని టీడీపీనేత డిమాండ్ చేశారు. అప్పుడే అసలుదోషులెవరలో, అతనికి ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన వారికి ఉన్నసన్నిహిత సంబంధాలేమిటో బట్టబయలవుతాయన్నా రు. అంతర్వేదిరథం దగ్ధంఘటనపై, సీబీఐ విచారణకు ఆదేశించామని చెప్పిన ప్రభుత్వం, ఆ వివరాలను ఎందుకు బహిర్గతం చేయలేదన్నారు?శ్రీకాకుళంలోని టెక్కలి లో బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసంచేయడం, రామతీర్థంలో రాములవా రి విగ్రహ శిరస్సుని ఖండించిన తర్వాత చంద్రబాబునాయుడు, అక్కడకు వెళ్లాకే ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు.
రామతీర్థం దేవాలయానికి ఛైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజుని గురించి హేళనగా మాట్లాడి, ఆయన్ని దేవస్థానం ధర్మకర్త పదవినుంచి తప్పించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పిఠాపురం మొదలు, బిట్రగుంటలో రథంకాలిపోవడం, విజయవాడలో అమ్మవారి దేవాలయంలో వెండిసింహాలు మాయంకావడం, బస్టాండ్ సమీపం లో సీతమ్మవారి విగ్రహం ధ్వం-సం చేయడం వంటి అనేకఘటనలు జరిగినా ప్రభుత్వంలో ఎందుకుచలనం రాలేదన్నారు. శ్రీశైలంలో దర్శన టిక్కెట్లకుంభకోణం, తిరుమలలో అన్యమత ప్రచారం వంటి దారుణాలు జరిగినా జగన్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదన్నా రు. 20నెలల్లో హిందూమతంపై, దేవాలయాలపై దాదాపు 161 వరకు ఘటనలు జరిగినా పట్టించుకోని ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలో అధికారంలో కొనసాగే అర్హత లేనేలేదని బుచ్చిరామ్ ప్రసాద్ తేల్చి చెప్పారు. ఘటనలకు కారకులైనవారిని అరెస్ట్ చేసి, శిక్షించడంలో కూడా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. పురోహితులను చర్నాకోల్ తో కొట్టిన వైసీపీనేతపై జగన్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందన్నారు? బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులు ఈప్రభుత్వం వచ్చాక ఏమయ్యాయో తెలియకుండాపోయిందన్నారు. దేవాదాయ శాఖ నిధులతోపాటు, బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులనుకూడా ప్రభు త్వం వివిధపథకాలకు దారిమళ్లించిందన్నారు. ఏ మతంజోలికి, మరే మతానికి చెందిననిధులను వాడుకోవడానికి ధైర్యం చేయని ప్రభుత్వం, కేవలం హిందూమతాన్నే లక్ష్యంగా చేసుకొని దారుణాల కు తెగబడుతోందన్నారు. ఆఖరికి టీటీడీ సొమ్మునికూడా ప్రభుత్వం కొట్టేయాలని చూసిందని, ప్రతిపక్షంతో పాటు, హిందూ భక్తులు గగ్గోలుపెట్టడంతో దాన్ని విరమించుకుందన్నారు. హిందూ మతంపై, దేవాలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రతి ఒక్కరూ పార్టీలు, కులాలకు అతీతంగా పోరాడాలని రామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు.