ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, 30లక్షల70వేలమంది పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్లపట్టాభిషేకం పేరుతో ప్రకటనలిస్తూ, తనకుతాను కనకాభిషేకం చేసుకుంటున్నాడని టీడీపీ జాతీయఅధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ స్పష్టంచేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రూ.23,535కోట్ల విలువగల 68,361ఎకరాలభూమిని, 30లక్షల 70వేలమందికి ఇళ్లపట్టాలరూపంలో పంచుతున్నట్లు, ప్రకటనల్లో చెప్పారని, గ్రామీణప్రాంతాల్లో సెంటున్నర, పట్టణప్రాంతాల్లోసెంటు భూమిప్లాట్లుగా ఇస్తున్నారని పట్టాభి తెలిపారు. సెంటుభూమికి 48గజాలని, సెంటున్నరకు 72గజాలను జగన్ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమైతే, దానికి రెండింతల విస్తీర్ణమున్న స్థలాలను టీడీపీప్రభుత్వంలో పేదలకు అందచేయడం జరిగిందన్నారు. టీడీపీ ఇచ్చిన విస్తీర్ణాన్ని సగానికిపైగా తగ్గించి, సెంటుపట్టాపేరుతో జగన్ ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడిందన్నారు. వైసీపీలోని పెద్దతిమింగలాలు ఇళ్లపట్టాలపేరుతో ఏవిధంగా దోపిడీ చేశాయో చెప్పుకోవాలని, వారినిపెంచిపోషించి, వారిద్వారా అందిన కాడికి దోచేసిన జగనన్నను, ప్రజలంతా జలగన్న అని పిలవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇళ్లపట్టాలు కావాలన్న పేదలనుంచి కూడా వైసీపీ అవినీతి జలగలు సొమ్ము వసూలుచేశాయని పట్టాభి తెలిపారు. ఆ విధంగా పేదలనుంచి వసూలుచేసింది దాదాపు రూ.750కోట్లవరకు ఉంద న్నారు. అంతటితోఆగకుండా బ్యాంకుల్లో తనఖాలో ఉన్నభూమిని కూడా అమ్మేసి, దాన్నికూడా సొమ్ముచేసుకోవడం జరిగిందన్నారు.ప్లాట్లకు సేకరించిన భూమిలోని మట్టిని తవ్వేసి అమ్ముకోవడం ద్వారా మరోవిధంగా దోపిడీకి పాల్పడ్డారన్నారు. ఒకవైపు భూముల్లోని మట్టిని అమ్ముకుంటూ, మరోవైపు అదేభూమిని చదునుచేసేనెపంతో తిరిగి మట్టితోలడంద్వారా దాదాపు రూ.2వేలకోట్ల వరకు వైసీపీ జలగలు కాజేశాయన్నారు.

ఈ విధంగా భూములకొనుగోళ్లు మొదలు చదునుచేయడం, మట్టి అమ్ముకోవడం, పేదలనుంచి స్థలానికి ఇంతని చెప్పివసూలు చేయడం వంటిచర్యలతో అక్కచెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇవ్వకుండానే జగనన్న ఆయనప్రభుత్వం రూ.6,500కోట్ల వరకు దిగమింగారని పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. భూములసేకరణ ముసుగులో రూ.4వేలకోట్లు, మెరకచేసే నెపంతో రూ.2వేలకోట్లు, ఇళ్లపట్టాలు ఇప్పిస్తున్నామంటూ రూ.500కోట్ల వరకు వైసీపీప్రభుత్వం నిస్సిగ్గుగా దిగమింగిందన్నారు. ప్రభుత్వం దోచేసిన రూ.6,500కోట్లను సక్రమంగా ఖర్చుచేసుంటే, ఎకరా రూ.30లక్షలచొప్పున కొనగలిగితే, అదనంగా 23,666 ఎకరాలు పేదలకు పంచడానికి వీలయ్యేదన్నారు. ఆ 23,666 ఎకరాల్లో ఎకరంలో రోడ్లు, కాలువలకింద కొంతభూమితీసేసినా, ఎకరాకు 60సెంట్ల చొప్పున లెక్కేసుకున్నా, దాదాపు 13లక్షలమందికి ఇస్తున్న సెంటుభూమికి అదనంగా మరోసెంటు భూమి అందించే అవకాశం ఉండేదని పట్టాభి స్పష్టంచేశారు. ప్రభుత్వ అవినీతివల్ల 13లక్షల పేదకుటుంబాలకు న్యాయంగాదక్కాల్సిన సెంటుభూమిని కోల్పోయారన్నారు. ప్రభుత్వం దోచేసిన రూ.6,500కోట్లతో 13లక్షల పేదకుటుంబాలకు న్యాయంజరిగే అవకాశం ఉండేదని పట్టాభి తేల్చిచెప్పారు. ఊళ్లు, పట్టణాలకు దూరంగా ప్లాట్లను ఇస్తున్నప్రభుత్వం, నిజంగా దోచుకున్న రూ.6,500కోట్లను సక్రమంగా వాడితే, నివాసాలకు దగ్గరగానే ఎకరా రూ.కోటిచొప్పున 6,500ఎకరాలభూమి అదనంగా పేదలకు లభించేదన్నారు. ఆవిధంగా 6,500ఎకరాలవరకు భూమిని పట్టణాల్లో నివసించే 4లక్షల పేదకుటుంబాలకు, పంచడానికి అవకాశముండేదన్నారు. ప్రభుత్వ అవినీతివల్ల4లక్షలపేదకుటుంబాలు తీవ్రంగా నష్టం జరిగింద న్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు 13లక్షలపేద కుటుంబాల పొట్టగొట్టి మరీతమజేబులు నింపుకున్నారనే నిజాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలన్నారు.

నియోజకవర్గాలవారీగా ఇళ్లపట్టాలపేరుతో, వైసీపీ నేతలు సాగించిన దోపిడీ.. నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని తణుకునియోజకవర్గంలో కారుమూరి నాగేశ్వరరావు అవినీతి, అరాచకాలకు కేంద్రంగా మారాడని పట్టాభి తెలిపారు. ప్రతిఒక్కిరిపై నోరేసుకొని పడిపోయే నాగేశ్వరరావు, తణుకుపట్టణంలోని అజ్జారంరోడ్డులో 55ఎకరాలను ఎకరా రూ.కోటి5 లక్షలకు ప్రభుత్వానికి అంటగట్టి, రూ.57కోట్ల75 లక్షలవరకు దండుకోవడం జరిగిందన్నారు. నాగేశ్వరరావు దోపిడీపై వైసీపీకిచెందిన సీతారామ్ అనేవ్యక్తి ముఖ్యమంత్రికి లేఖ కూడా రాశాడన్నారు. సొంతపార్టీవారే వైసీపీఎమ్మెల్యే బాగోతంపై లేఖరాసినా, జగన్మోహన్ రెడ్డి ఎటువంటిచర్యలు తీసుకోలేదన్నారు పెందుర్తి నియోజకవర్గంలో మరీదారుణంగా స్థానికఎమ్మెల్యే అదీప్ రాజు చెరువునే ఆక్రమించేశారని, దానిపై టీడీపీసీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి పెద్దఎత్తున ఉద్యమం చేయడం జరిగిందన్నారు. 8.78ఎకరాల్లో ఉన్న వీర్రాజుచెరువుని అదీప్ రాజు స్వాహాచేశాడన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో సర్వేనంబర్ 167/1లో 3ఎకరాల 48 సెంట్ల భూమిఉంటే, వైసీపీఎమ్మెల్యే జ్యోతులచంటిబాబుకి అదే సర్వేనంబర్లో ఎకరం40సెంట్లుఉంటే, తనదికాని మిగిలిన 2ఎకరాలకు కూడా, ఎకరాకు రూ.24లక్షలచొప్పున, ఎమ్మెల్యేనే ప్రభుత్వం నుంచి పరిహారం పొందడం జరిగిందని పట్టాభి పేర్కొన్నా రు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డికి భూముల కొనుగోళ్లలో జరుగుతున్న అవకతవకలపై అనేకఫిర్యాదులు కూడా అందాయన్నారు.


కృష్ణాజిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో పార్థసారథి అత్యంత భారీ కుంభకోణానికి పాల్పడ్డాడని, 503ఎకరాలభూమికి సంబంధించి రూ.133కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఎకరా రూ.25, రూ.30లక్షలవిలువచేసే భూమికి రూ.75లక్షలవరకు చెల్లించి, ప్రభుత్వానికి అంటగట్టి, రూ.133కోట్లవరకు కొలుసు పార్థసారథి నొక్కేశాడన్నారు. అటువంటి వ్యక్తి మీడియాముందు మాత్రం తానేదోసచ్ఛీలుడైనట్లు కారుకూతలు కూస్తుంటాడని పట్టాభి మండిపడ్డారు. తెనాలి నియోజకవర్గంలో రూ.180కోట్ల వరకు కాజేశారని, ఈవిధంగా ఒకరితోఒకరు పోటీపడీ మరీ ప్రజలసొమ్ముని కాజేశారన్నారు. తెనాలిలో 1, 2 వార్డుల పరిధిలో 180ఎకరాలను రైతులనుంచి సేకరించి, ఎకరా రూ.35లక్షలవిలు వున్న భూమికి, ఎకరాకు రూ.90లక్షలవరకు చెల్లించారన్నారు. ఆ విధంగా రూ.180కోట్ల కుంభకోణానికి వైసీపీఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్ పాల్పడ్డాడన్నారు. మైలవరం నియోజకవర్గంలో అందరూ ముద్దుగా పిలుచుకునే కొండపల్లి వీరప్పన్ అలియాస్ వసంత కృష్ణప్రసాద్ రూ.200కోట్లవరకు కాజేశారని, 130 ఎకరాల ను, ఎకరం రూ.45లక్షలకుకొని, రూ.200కోట్లవరకు ప్రభుత్వ సొమ్ముని అక్రమంగాకాజేశారన్నారు. అంతటితోఆగకుండా సదరు భూములను మెరకచేసేనెపంతో కొండపల్లి ఫారెస్ట్ భూముల్లోని గ్రావెల్ మొత్తాన్ని అక్రమంగా కృష్ణప్రసాద్ అమ్మేసుకున్నాడని పట్టాభి తెలిపారు. వినుకొండ నియోజకవర్గంలో వైసీపీఎమ్మెల్యే బొల్లాబ్రహ్మనాయుడు రూ.5,రూ.6లక్షల విలువకూడా చేయని తనసొంతభూమిని ఎకరా రూ.18లక్షలకుప్రభుత్వానికి అంటగట్టా డన్నారు. ఆ విధంగా తనవంతుగా రూ.18కోట్లను బ్రహ్మనాయు డు మింగేశాడన్నారు.

 

తూర్పుగోదావరి జిల్లాలో పీకల్లోతు నీటిలో నానే ఆవభూములకు ఎకరాకు రూ.60లక్షలవరకు చెల్లించి, దాదాపు రూ.150కోట్లవరకు దోపిడీచేయడం జరిగిందన్నారు. ఆ కుంభకోణంలో ప్రధాన పాత్రధారులుగా రాజమహేంద్రవరం వైసీపీఎంపీ మార్గానిభరత్, టీటీడీ ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి ఉన్నారన్నారు. నెల్లూరులో మరీఘోరంగా దోపిడీచేశారని, జిల్లాకలెక్టర్ శేషగిరిబాబుని కూడా వైసీపీనేతలు బెదిరించడం జరిగిందన్నారు. కావలిలో ఎకరా రూ.12లక్షల విలువచేసేభూమిని ఎకరాకు రూ.55లక్షలవెలకట్టి ప్రభుత్వానికి అంటగట్టాలని చూశారని, దాన్ని కలెక్టర్ అడ్డుకున్నందుకు, రాత్రికిరాత్రి ఆయన్ని బదిలీ చేయించారన్నారు. ఈ విధంగా అన్నిజిల్లాల్లో వైసీపీనేతల అవినీతి చిట్టా పుంఖానుపుంఖాలుగా ఉందన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read