టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తనని అక్రమంగా అరెస్టు చేసి తోట్లవల్లూరు స్టేషన్ కి తరలించారని, పోలీస్ స్టేషన్లో కరెంటు తీసేసి, పోలీసుల్ని బయటకు పంపేశారని పేర్కొన్నారు. జనాలకి రక్షణ కల్పించాల్సిన పోలీసులు, భక్షక భటులుగా మారారని ఆరోపించారు. రాత్రి 2 గంటల నుంచి 5 గంటల మధ్య ముసుగులు వేసుకుని వచ్చిన ముగ్గురు దుండగులు తనకు ముసుగు వేసి కొట్టారని ఆరోపించారు. వారు పోలీసులు కాదు. అంటే వల్లభనేని వంశీ గ్యాంగ్ వాళ్లే పట్టాభిని ముసుగులు వేసుకుని పోలీసుల సహకారంతో పోలీస్ స్టేషన్లోనే కొట్టారని ప్రచారం సాగుతోంది. సంకల్పసిద్ధి కేసులో తనపై ఆరోపణలు చేసిన పట్టాభి, టిడిపి నేతలపై దాడి చేస్తానని గత కొన్ని రోజులుగా వంశీ హెచ్చరిస్తూ వస్తున్నారు. గన్నవరం గొడవల సందర్భంగా పోలీసుల సాయంతో పట్టాభిపై దాడి చేసింది వంశీయేనని పొలిటికల్ సర్కిల్లో గుప్పుమంటోంది. జైలు నుంచి విడుదలయ్యాక పట్టాభి మాట్లాడుతూ ఇప్పటివరకూ తనపై నాలుగుసార్లు దాడి జరిగిందని, అయినా వెనక్కి తగ్గనని అరాచక సర్కారుపై పోరాడుతూనే ఉంటానన్నారు. కష్టకాలంలో అండగా నిలిచిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. బెయిల్ వచ్చిన అనంతరం రాజమండ్రి జైలు నుంచి పట్టాభితో సహా టిడిపి నేతలంతా విడుదలయ్యారు. అక్రమ కేసుల్లో అరెస్టయి విడుదలైన నేతలకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
పట్టాభిని కొట్టిన ముసుగు దొంగలు వల్లభనేని వంశీ గ్యాంగేనా ? సంచలన వ్యాఖ్యలు చేసిన పట్టాభి...
Advertisements