స్కీమ్ ఫర్ స్కామ్ అనే నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి బాగా ఇష్టపడతారని, వైసీపీప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 20నెలల కాలంలో స్కీముల ముసుగులో కొన్నివేలకోట్ల రూపాయల అవినీతి ఎలా జరిగిందో టీడీపీ అనేకసార్లు ఆధారాలతో సహా బయటపెట్టడం జరిగిందని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టంచేశారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే " ఇళ్లపట్టాలపేరుతో జగన్ ప్రభుత్వం ఏస్థాయిలో అవినీతికి పాల్పడిందో ప్రజలకు వివరించడం జరిగింది. పేదవాడికి సాయం చేద్దామనే ఆలోచన ఏనాడూ జగన్ కు కలగదు. ప్రతినిత్యం ఏదోఒకపథకం పేరుచెప్పడం, దానిముసుగలో ఎలా దోచేయాలనే ఆలోచననే ఆయన చేస్తుంటాడు. అదేకోవలో ఇప్పుడు జగనన్న విద్యాకానుక పథకం చేరింది. ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్యాగులు, నోటు పుస్తకాలు, యూనిఫామ్ వంటివి అందచేయడం జరిగింది. కానీ ఇవన్నీ గతప్రభుత్వాలు కూడా గతంలో ఇప్పుడున్న ప్రభుత్వం కంటే మెరుగ్గానే అమలు చేశాయి. ‘జగనన్న విద్యాకానుక’ పేరుతో విద్యార్థులకుకానుకలు ఇవ్వడానికి బదులు జగన్ తనకు తానే కానుకలు ఇచ్చుకున్నాడు పేదవిద్యార్థులు ఉపయోగించే నోటుపుస్తకాల పంపిణీలో కూడా జగన్ ప్రభుత్వం ఎలాఅవినీతికి పాల్పడిందో, విద్యార్థులకుఇచ్చే నోట్ బుక్స్ లో జగన్ఎంతలా కక్కుర్తిపడ్డాడో రాష్ట్రప్రజలంతా తెలుసుకోవాలి. విద్యార్థులకు మేనమామనంటూ జగన్ భారీగా మేసేస్తున్నాడు. అందుకే ఆయన విద్యార్థులపాలిట కంసమామ అని ఎప్పుడో చెప్పాం. విద్యార్థులకు పంచే నోటుపుస్తకాలను ఏపీటీపీసీవారు లేపాక్షి నంది బ్రాండ్ తో ముద్రించేవారు. నాణ్యతతో కూడిన నోటుపుస్తకాలను సదరు సంస్థ ఎప్పటినుంచో ప్రభుత్వానికి రాయితీపై అందిస్తోంది. వైసీపీప్రభుత్వం ఏపీటీపీసీ (లేపాక్షి నంది) ని కాదని, పుణెలోని బాఫ్నా కంపెనీని గత విద్యాసంవత్సరంలోనే తెరపైకి తీసుకొచ్చింది.

06-10-2020న ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం- 55లో ఏపీటీపీసీ (ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్) విశిష్టతను గురించి పేర్కొని, రాష్ట్రంలోని అన్నిశాఖల కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లు, అన్నిరకాల ప్రభుత్వపాఠశాలలువారు, నోట్ బుక్స్ ఆర్డర్ ని ఏపీటీపీసీ కి మాత్రమే ఇవ్వాలని చెప్పడం జరిగింది. జీవోనెం55ని స్వయంగా రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి నీలంసాహ్ని గారు జారీచేయడంజరిగింది. ఆజీవోను తుంగలో తొక్కిన జగన్ ప్రభుత్వం తాజాగా ఈ విద్యాసంవత్సరం (2021-22) నోటు పుస్తకాల సేకరణకు సంబంధించి 21-01-2021న ఒక టెండర్ విడుదలచేసింది. 2కోట్ల56వేల476నోటు పుస్తకాల ప్రచురణకు సంబంధించిన టెండర్ అది. చీఫ్ సెక్రటరీ గతంలో ఏపీటీపీసీ ఆధ్వర్యంలోని లేపాక్షినంది నోటు పుస్తకాలను వాడాలని చెప్పి, జీవోనెం55ని జారీచేసినా, దాన్ని కాదని బయట కంపెనీలకు దోచిపెట్టడానికి ఇప్పుడు 2కోట్ల పైచిలుకు నోటు పుస్తకాల ముద్రణకు టెండర్ విడుదలచేస్తారా? నోటుపుస్తకాల అంచనాలు ఇంకా15శాతం పెరిగే అవకాశం కూడా ఉందని టెండర్లో చెప్పారు. ఒక్కో నోటు పుస్తకం ఖరీదు రూ.40 వేసుకున్నా దాదాపు రూ.80కోట్లు అవుతుంది. అంచనాలుపెరిగితే అది రూ.100కోట్లు కావచ్చు. పేదవిద్యార్థులకు ఇచ్చే నోటు పుస్తకాల్లో కూడా ప్రైవేట్ కంపెనీ ఇచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి, రాష్టప్రభుత్వ సంస్థ అయిన ఏపీటీపీసీవారి లేపాక్షి నంది నోటుపుస్తకాలను నాశనం చేయడమేంటి?

నోటుపుస్తకాలముద్రణావ్యవహారంపై కొందరు కోర్టుకి వెళితే,12-07-2020న స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. తదనంతరం, అక్టోబర్ మొదటివారంలోకూడా న్యాయస్థానం స్టేటస్ కోను కొనసాగించిం ది. అటుపిమ్మట గత్యంతరంలేని పరిస్థితుల్లో రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవోనుజారీచేస్తే, దాన్నికూడా పట్టించుకోరా? టెండర్లప్రక్రియపై న్యాయ స్థానం ఇచ్చిన స్టేటస్ కో తరువాత జీవోనెం 55ను రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇస్తే, దాన్ని కూడా ఖాతరుచేయరా? ప్రభుత్వం తన కక్కుర్తికోసం హైకోర్టు స్టేటస్ కోను, జీవోనెం 55ను పక్కనపెట్టింది. జగనన్నవిద్యాకానుక పథకంకింద అవసరమైన అనేకరకాల వస్తువులును సేకరించడం కోసం, 12-03-2020న జీవోనెం-12ను విడుదలచేశారు. దానిలో పాఠ్య పుస్తకాలు, నోటుపుస్తకాలప్రస్తావన చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రెస్ లోనే పాఠ్యపుస్తకాల ముద్రణ జరగాలని జీవోలో చెప్పిన ప్రభుత్వం, మరి నోటుపుస్తకాల అంశంలో ప్రభుత్వరంగ సంస్థల నుంచే కొనుగోలు చేయాలనే నిబంధనను ఎందుకు పెట్టలేదు? నోట్ పుస్తకాల ముద్రణకు ఏపీటీపీసీ వారి లేపాక్షినంది సంస్థ ఉందని ఎందుకు సదరుజీవోలో ప్రభుత్వం పేర్కొనలేదు? జీవోనెం55, జీవోనెం-12లోని అంశాలద్వారా దాదాపురూ.100కోట్ల విలువైన నోటుపుస్తకాల టెండర్ల వ్యవహారంలో జగన్ రెడ్డి ప్రభుత్వం దోపిడీకి సిద్ధమైందని స్పష్టమవుతోంది. గత విద్యాసం వత్సరంలో కూడా ఇదేవిధంగా నిబంధనలనుతుంగలో తొక్కి బాఫ్నా కంపెనీకి నోటుపుస్తకాల ముద్రణను అప్పగించారు. లేపాక్షి నోటు పుస్తకాల నాణ్యతతో పోలిస్తే, బాఫ్నా కంపెనీవారి పుస్తకాల నాణ్యత అధ్వానంగాఉంది. రాష్ట్రప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇచ్చిన జీవోనెం-55ను తుంగలో తొక్కిన జగన్ రెడ్డి ప్రభుత్వం నేడు కమీషన్ల కోసమే పలు ప్రైవేట్ కంపెనీలతో బేరసారాలు సాగిస్తోంది. ప్రభుత్వం తక్షణమే నోటుపుస్తకాల టెండర్ ను రద్డుచేయాలని డిమాండ్ చేస్తున్నాను.

Advertisements

Advertisements

Latest Articles

Most Read