వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరుపతి పుణ్యక్షేత్రం ఎన్నిఅక్రమాలకు నిలయంగా మారిందో, ఎన్నిరకాల అవినీతి కార్యక్రమాలు చేపడుతున్నారో చూస్తూనే ఉన్నామని టీడీపీజాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. శనివారం ఆయన తిరుపతిలో టీడీపీనేత బుచ్చిరామ్ ప్రసాద్ తోకలిసి మీడియాతో మాట్లాడారు. మరీముఖ్యంగా టీటీడీ కేంద్రంగా జరుగు తున్న అవినీతి గురించి చెప్పుకోవాలన్నారు. ముఖ్యమంత్రికి చిన్నాన్న అయిన వై.వీ. సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించి నప్పటినుంచీ జరుగుతున్నఅవినీతిని చూస్తూనే ఉన్నామన్నారు. స్వామివారి తలనీ లాలను విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నవైనం అందరికీ తెలిసిందేనన్నారు. స్వామి వారికి చెందిన విలువైన ఆస్తులను కబ్జా చేస్తున్న వైనం తెలిసిందేనన్నారు. గతంలో టీటీడీ ఆస్తులను అమ్మ డానికి ఒక రిజల్యూషన్ పాస్ చేసినప్పుడు, టీడీపీ సహా, ప్రజల్లోనుంచి వ్యతిరేకత రావడంతో దాన్ని విరమించుకుంటున్నట్లు చెప్పడం జరిగిందన్నారు. ఒకపక్కన అలా విరమించుకున్నట్లు చెబుతూనే, నేడు దొడ్డిదారిలో టీటీడీ ఆస్తులను కబ్జాచేయడానికి, వై.వీ.సుబ్బారెడ్డి నేత్రత్వంలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు పావులుకదుపుతున్నారని పట్టాభిరామ్ స్పష్టంచేశారు. కొద్దిరోజులక్రితం టీటీడీ తరుపున చిన్న పిల్లలఆసుపత్రి నిర్మిస్తున్నామనిచెప్పి, టీటీడీకి చెందినవిలువైన ఆస్తులను కొందరికి కట్టబెట్టే ప్రయత్నంచేశారన్నారు. చంద్రబాబునాయుడిగారి హాయాంలో టీటీడీ సేవల్లో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన టాటా, అరవింద వంటి ప్రతిష్టాత్మక సంస్థల సేవలకు భూములు కేటాయించడం జరిగిందన్నారు. తద్వారా బర్డ్ ఆసుపత్రి, క్యాన్సర్, కంటి ఆసుపత్రి వంటివి ఏర్పడ్డాయన్నారు. కానీ నేడు దివాలాతీసిన ఉద్వేగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, ఎటువంటి ఊరూపేరూలేని కంపెనీని తెరపైకి తెచ్చారని పట్టాభిరామ్ తెలిపారు. సదరుకంపెనీ బ్యాలన్స్ షీట్ చూస్తే, కేవలం రూ.26,300లు మాత్రమేనని, అటువంటి కంపెనీ రూ.300కోట్లవిరాళాన్ని టీటీడీకి ఇస్తుందని పిట్టకథలుచెప్పి, టీటీడీనమ్మించాలని చూ స్తోంద న్నారు.

ఆనెపంతో విలువైన భూమిని ఉద్వేగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు కేటాయించాలని చూస్తున్నారన్నారు. సదరు సంస్థకు కేటాయించాలను కున్న భూమిని పరిశీలించడానికి తనతోపాటు, టీడీపీనేతలు బుచ్చిరామ్ ప్రసాద్ , పిల్లి మాణిక్యరావు, నరేంద్ర, తెలుగుయువత నాయకులు వంశీ, మహిళానేతలు వచ్చారన్నారు. ఉద్వేగ్ ఇన్ ఫ్రా సంస్థకు ఇవ్వాలనుకున్నభూమిని పరిశీలించాక, విలువైన భూమిని కట్టబెట్టడం ముఖ్యమంత్రి పన్నిన కుట్ర అని తమకు అర్థమైందన్నారు. కేవలం రూ.26,300 బ్యాలెన్స్ షీట్ గాఉన్న సంస్థ బ్యాంకు ఖాతాలో ఉన్నసొమ్ము కేవలం రూ.2,600లేనన్నారు. రూ.2,600మాత్రమే బ్యాంకులో ఉన్నసంస్థ రూ.300కోట్లను విరాళంగా ఇస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్వేగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ను అడ్డుపెట్టుకొని విలువైనభూమిని కాజేయడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నాడన్నారు. ఈ విధంగా విలువైన ఆస్తులను కబ్జాచేస్తున్నందుకు వైసీపీకి ఓటేయాలా అని టీడీపీనేత నిలదీశారు. తిరుపతి పార్లమెంట్ లోని ప్రజలతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా తిరుపతి కేంద్రంగా ప్రభుత్వం సాగిస్తున్న అక్రమాలను గమనిస్తున్నారన్నారు. టీటీడీ కేంద్రం గా కొనసాగిస్తున్న అవినీతి, స్వామివారి ముసుగులో సాగిస్తున్న అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికే తాము భూమిపరిశీలనకు వచ్చినట్టు పట్టాభి తెలిపారు. భూపరిశీలనచేసిన తరువాత బోగస్ సంస్థలను అడ్డు పెట్టుకొని విలువైన టీటీడీ ఆస్తులను కాజేయడానికి పన్నాగం పన్నారని అర్థమైందన్నారు. ఈ విషయం తెలిశాక కూడా తిరుపతి పార్లమెంట్ ప్రజలు వైసీపీకి ఎందుకు ఓటేయాలన్నారు.

14వతేదీన తిరుపతికి వస్తున్నజగన్మోహన్ రెడ్డి దీనిపై ఏంసమాధానంచెబుతా డన్నారు. ఉద్వేగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బ్యాలన్స్ షీట్ తమ వద్దఉందని, దాన్నిచూశాకే తాము ముఖ్యమంత్రిని నిలదీస్తున్నామన్నారు. తిరుపతిలో బహిరంగ సభ పెడతాను, ...దేశమంతా తిరుపతివైపు చూసేలా విజ యం సాధిస్తామనుకుంటున్న ముఖ్యమంత్రి ఆశలన్నీ అడియాశలేనని పట్టాభి తేల్చిచెప్పారు. తాముఅడిగిన ప్రశ్నలకు సమాధానంచెప్పాకే ముఖ్యమంత్రి తిరుపతిలో అడుగుపెట్టాలన్నారు. స్వామి ఆగ్రహంతో తిరుపతినుంచే ముఖ్యమంత్రి పతనం ప్రారంభం కాబోతోందన్నారు. తక్షణమే ఉద్వే గ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చే యాలని పట్టాభి డిమాండ్ చేశారు. స్వామివారికి క్షమా పణ చెప్పి, వై.వీ.సుబ్బారెడ్డిని తక్షణమే అ పదవినుంచి తొలగిం చాలని టీడీపీజాతీయ అధికారప్రతినిధి డిమాం డ్ చేశారు. ముఖ్యమంత్రి చిన్నాన్న అయినంత మాత్రాన ఇష్టానుసారం అవినీతికి పాల్పడతానంటే ఎవరూ చూస్తూ ఊరు కునేది లేదన్నారు. జగన్ రెడ్డి తన సొంత చిన్నాన్నపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read