నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ ఒక సంఘటన మీద దృష్టి పెట్టే లోపు మరో సంఘటన జరుగుతుంది. ఒక దాని తరువాత మరొక సంఘటన రావటంతో, టిడిపి నిరంతరం పోరాడుతుంది. తెలుగుదేశం పార్టీ ఒక్కటే కాదు, మీడియా కూడా, ఏ సంఘటన కవర్ చేయాలో తెలియని పరిస్థితి. ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం హయంలో, ఇవి మీడియా, అంటూ ప్రతిపక్షం పడుతున్న తిప్పలు. నిన్న తూర్పు గోదావరి జిల్లాలో, టిడిపి సర్పంచ్ అభ్యర్ధి మృతి చెందారు. దీని వెనుక కుట్ర ఉందని ఆరోపించిన టిడిపి, ఈ రోజు అక్కడకు లోకేష్ వెళ్తారని ప్రకటించింది. దీంతో ఈ రోజు మొత్తం అక్కడ ఫోకస్ ఉంటుందని అందరూ భావించారు. ఉదయం ఏడు గంటలకు, శ్రీకాకుళంలో అచ్చేన్నాయుడు అరెస్ట్ అని వార్తలు. ఎందుకు అంటే, తన బంధువు ఫోన్ చేస్తే, చూడు అవకాసం ఉంటె, నిన్ను బలవంత పెట్టటం లేదు అని చెప్పినందుకు, కేసు పెట్టి, అరెస్ట్ చేసారు. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష్యుడు అరెస్ట్ కావటంతో, రచ్చ రచ్చ అయ్యింది. అక్కడ నుంచి వార్తలు వస్తున్న సమయంలో, వెంటనే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి పై జరిగిన ఘటన హైలైట్ అయ్యింది. అన్నిటికంటే ఇది తీవ్రమైనది కావటంతో, ఫోకస్ అక్కడ నుంచి ఇక్కడకు వచ్చింది. ఏకంగా చంద్రబాబు కూడా పట్టాభి ఇంటికి వచ్చారు.
అయితే చంద్రబాబు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ రాష్ట్రంలో బ్రతికే స్వేఛ్చ ఉందో లేదో, జగన్ దగ్గరే తేల్చుకుంటాం అని చంద్రబాబు అన్నారు. పట్టాభి సహా, మా నేతలు అందరూ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తారని, అక్కడ జగన్ నే అడుగుతారని అన్నారు. అయితే చంద్రబాబు తిరిగి వెళ్ళిపోయిన తరువాత, తెలుగుదేశం నేతలు, ఎమ్మెల్యేలు, జగన్ ఇంటికి వెళ్ళటానికి రెడీ అయ్యారు. పట్టాభి కారు ఏదైతే పగలుగొట్టారో, అదే కార్ లో , పట్టాభిని కూడా తీసుకుని , జగన్ ఇంటికి వెళ్ళటానికి బయలుదేరారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు, పట్టాభిని వేరే వ్యాన్ లో ఎక్కించి హాస్పిటల్ కు తీసుకుని వెళ్లారు. అయితే ఈ సందర్భంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పట్టాభిని తమ అధీనంలోకి తీసుకునే సమయంలో, తోపులాట జరిగింది. ఇక అక్కడ ఉన్న తెలుగుదేశం నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం కార్యకర్తలు అడుగడుగునా అడ్డుపడటంతో, పోలీసులు వాళ్ళని పక్కకు లాగేసారు.