టిడిపి అధికార ప్రతినిధి పట్టాభిని తమ కస్టడీలోకి ఇవ్వాలి అంటూ, ఆయన పై పోలీసులు వేసిన కస్టడీ పిటీషన్ పై ఈ రోజు విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. ఇటీవల జగన్ మోహన్ రెడ్డి పైన, పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేసారు అంటూ, ఆయన పైన గవర్నర్ పేట పోలీసులు కేసు నమోదు చేసి, పట్టాభిని అరెస్ట్ చేసారు. దానికి సంబంధించి విజయవాడ కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేయటం, తరువాత కోర్టు రిమాండ్ కు ఇవ్వటం, తరువాత పట్టాభి హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేయటం, ఆ తరువాత బెయిల్ పొందిన విషయం తెలిసిందే. మరో వైపు పోలీసులు పట్టాభిని తమ కస్టడీకి ఇవ్వాలి అంటూ, ఒక పిటీషన్ దాఖలు చేసారు. అయితే ఆ పిటీషన్ పై ఈ రోజు విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటీషన్ ను విచారణ చేసిన అనంతరం, కోర్టు ఈ పిటీషన్ ను కొట్టివేస్తూ, పోలీసులకు షాక్ ఇచ్చింది. అందులో ప్రధానంగా పోలీసులు తెలిపిన అంశం, పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేసారని, కుట్ర పూరితంగా వ్యవహరించారని, పదే పదే ఒకే మాటను ఆయన ప్రెస్ మీట్ లో తెలిపారని, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం పట్టాభి చేసారని, ఇదంతా ఒక కుట్ర ప్రకారం జరిగింది అని, ఈ కుట్ర పైన పూర్తి విషయాలు రాబట్టేందుకు, ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలి అంటూ, పోలీసులు పిటీషన్ దాఖలు చేసారు.
ఇదే విషయాన్ని పోలీసుల తరుపున న్యాయవాది కోర్టు ముందు వాదించారు. అలాగే చార్జ్ షీట్ లో కూడా కొన్ని ప్రదమైన విషయాలు పొందుపరిచారు. ఇవే విషయాలను ఛార్జ్ షీట్ లో కూడా పొందు పరిచారు. మరో వైపు, పట్టాభి తరుపున వాదించిన న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పట్టాభిని అరెస్ట్ చేసిన విధానమే ప్రొసీజర్ ప్రకారం జరగలేదని, హైకోర్టు కూడా దీనికి సంబంధించి అభ్యంతరాలు లేవనెత్తింది అని, ముఖ్యంగా 41ఏ నోటీస్ పై, హైకోర్టు లేవనెత్తిన అంశాలు, కింద స్థాయి కోర్టు కూడా ఈ అంశం పై, వ్యవహరించిన తీరు పైన, హైకోర్టు చేసిన వ్యాఖ్యలను, పట్టాభి తరుపు న్యాయవాది కోర్టు ముందు ప్రస్తావించారు. పోలీసులు వ్యవహరించిన తీరు పైన, హైకోర్ట్ లేవనెత్తిన అంశాలు, పట్టాభికి బెయిల్ ఇస్తూ కోర్టు చేసిన వ్యాఖ్యలను, పట్టాభి న్యాయవాది విజయవాడ కోర్టు ముందు ఉంచారు. దీంతో ఇరువురి వైపు వాదనలు విన్న న్యాయస్థానం, పోలీసులు వేసిన కస్టడీ పిటీషన్ ను కొట్టివేసింది. మరి పోలీసులు పై కోర్టు కు వెళ్లి అపీల్ చేస్తారా, లేదా అనేది చూడాల్సి ఉంది.