అక్టోబర్ నెల దాకా చుక్క నీరు... కనీసం ఒక చుక్క నీరు కూడా ఎగువ రాష్ట్రాల నుంచి కృష్ణా ప్రవాహం రాలేదు... కాని కృష్ణా డెల్టా మొత్తం, చివరగా ఉన్న దివిసీమ దాకా ప్రతి ఎకరం ఎంత పచ్చగా ఉందో చూడండి... కాలువల్లో కృష్ణమ్మ ప్రవాహం కనపడదు... ఎర్రని గోదారామ్మ పారుతుంది.... వాస్తావాలను నమ్మాలి.. ఊహాగానాలకు తావులేదు... ఈ ఏడాది జూన్ లోనే కోస్తా రైతులు నాట్లు వేసుకుని, ఇక వరి కోతలు మొదలు పెట్టారు అంటే, అది పట్టిసీమ ఫలం ... పట్టిసీమతో, ఈ ఏడు సాగుచేసిన వరి పంట కోతకొచ్చింది. అంచనాలను తల్లకిందులు చేస్తూ దిగుబడులు నమోదవుతున్నాయి. క్రితం సంవత్సరం కంటే అధికంగా వస్తున్నాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కలిపి డెల్టాలో మొత్తం 13.07 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. తూర్పు డెల్టా కింద కృష్ణా జిల్లాలో 5,14,084 ఎకరాలు, పశ్చిమ గోదావరిలో 25,500 ఎకరాలు, పశ్చిమ ప్రధాన కాలువ పరిధిలో గుంటూరు 4,94,231 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 72,120 ఎకరాల ఆయకట్టు ఉంది. మిగిలిన దాంట్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చెరకు పంట సాగు చేశారు. 2018 ఖరీఫ్ సీజన్‌లో తూర్పు కాలువ కింద 99 శాతం, పశ్చిమ కాలువ కింద 98 శాతం చొప్పున మొత్తమ్మీద 98 శాతం మేర ఆయకట్టులో నాట్లు పడ్డాయి. కృష్ణా జిల్లాలో అయితే 5.14 లక్షల ఎకరాలకు గాను 5.32 లక్షల ఎకరాలలో వరి వేశారు. దాదాపు 18 వేల ఎకరాల మేర అదనంగా ఆయకట్టు సాగులోకి వచ్చింది. కృష్ణా పరివాహక ప్రాంతంలో పెద్దగా నీరు లేకపోయినా పట్టిసీమ నుంచి ఎత్తిపోసి కాలువలకు ఇచ్చారు. గత రెండేళ్ల నుంచి ఇస్తున్నట్లే.. నీటికి ఆటంకాలు లేకుండా చూశారు. ఇప్పటి వరకు కృష్ణా డెల్టాకు మొత్తం 128 టీఎంసీల వరకు నీటిని బ్యారేజి నుంచి విడుదల చేశారు. ఇందులో 74 టీఎంసీలు గోదావరి జలాలు కావడం విశేషం. ఆయకట్టులో దాదాపపు 60 విస్తీర్ణం పట్టిసీమ నీటితోనే సాగైంది.
గతంలో ఎకరానికి 35 బస్తాలు వచ్చే దిగుబడి. నేడు పట్టిసీమ పుణ్యమా అని 45నుంచి 50 బస్తాలు వస్తుంది.. రైతన్న ఇంట ధాన్యం సిరులు కురిపిస్తోంది... సగటున 38 బస్తాలు తగ్గడం లేదు... సాగు సకాలంలో జరగడం అధిక దిగుబడులకు మరో కారణంగా పేర్కొనవచ్చు... పట్టిసీమ నుంచి వచ్చిన నీటితో నారుమళ్లు మొదలుపెట్టి ఖరీఫ్ ప్రారంభించిన రైతాంగం అదే పట్టిసీమ నీటితో సీజనను సకాలంలో ముగిస్తున్నారు... దీంతో ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా పంట రైతుల చేతికి వస్తుంది... ఇప్పటి వరకు తుఫానులూ ఏమి రాకపోవటంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు... అధిక దిగుబడులకు గోదావరి నీరు కూడా ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పట్టిసీమ ద్వారా వచ్చే గోదావరి నీటిలో సారవంతమైన బురద మట్టి, జిగురు, ఒండ్రు ఉండటంతో పంట బాగా పండేందుకు దారి తీసిందని అనుభవజ్ఞులైన రైతులు చెబుతు