మన రాష్ట్రంలో నేనే సియం అనే పిచ్చోళ్ళు ఎక్కువ అయిపోతున్నారు. డబ్బు ఉండి ఒకడు, కులం చూసుకుని ఒకడు, పిచ్చ ఎక్కి ఒకడు, నేనే సియం, నేనే సియం అంటూ, హైదరాబాద్ నుంచి దిగుమతి అయ్యి, ఇక్కడ పార్టీ టైం రాజకీయాలు చేస్తూ, సంక్రాంతి ముందు వచ్చే గంగిరెద్దులు లాగా, ఎన్నికల ముందు తయారవుతున్నారు. డబ్బు, కులం, మతం అడ్డు ఉంటే చాలు, ప్రజలని బకరాలను చేసి, మేము సియం అయిపోవచ్చు అనుకుంటారు. ఇలాంటి పిచ్చ ఒకటే కాదు, మా వల్లే చంద్రబాబు గెలిచాడు, మా వల్లే మోడీ గెలిచాడు అంటూ, ఈ పార్టీ టైం రాజకీయ నాయకులు, మోడీ, చంద్రబాబు లాంటి వాళ్ళని గెలిపించాం అని చెప్పుకుని, వారి ఫాన్స్ ని మరో ప్రపంచంలో ఉంచుతూ ఉంటారు. మొన్నటి దాక పవన్ కళ్యాణ్ ఇలాగే చెప్పుకుని తిరిగే వాడు. ఇప్పుడు కేఏ పాల్ తయారయ్యాడు. నా వల్లే మోడీ గెలిచాడు, నా ఇంటికి వచ్చి వేడుకున్నాడు, అంటూ ఏవేవో చెప్తూ, కామెడీ పండిస్తున్నాడు.

paul 11012019 2

తాజాగా, మరో కామెంట్ చేసాడు పాల్.. తాను 2019లో ముఖ్యమంత్రి అవుతానని, అప్పుడు చంద్రబాబుకి మంచి ఉద్యోగం ఇస్తా అని అన్నాడు. ‘‘నేను సీఎం కాగానే చంద్రబాబును సలహాదారుడిగా పెట్టుకుంటాను. 2019లో నేను అధికారంలోకి రావడం ఖాయం. ఇప్పటికే అనేక సర్వేలు ఈ విషయాన్ని నిర్ధారించాయి. దీనిని గుర్తించిన చంద్రబాబు నన్ను అడ్డుకోడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సీఎం కాలేడు’’ అని ప్రజాశాంతి వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. గుంటూరు, విజయవాడలలో ఆయన మీడియాతో మాట్లాడారు.

paul 11012019 3

‘మోదీ చంద్రబాబు కలిసి నా సంస్థకు నిధులు రాకుండా నిలిపేశారు. వారిద్దరూ శాశ్వత మిత్రులు. వారితో జగన్‌ కూడా కలిశారు. వీళ్ళల్లో ఎవరికి ఓటు వేసినా మోదీకి ఓటు వేసినట్లే. నేనొక్కడినే మోదీకి ప్రత్యామ్నాయం. మోదీ రెండోసారి ప్రధాని కావడం అసంభవం. 18 పార్టీలతో కూడిన థర్డ్‌ ఫ్రంట్‌కు 300కు పైగా సీట్లు వస్తాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి పని చేస్తాను. ఎన్నికల్లో పవన్‌ ప్రభావం ఉండదు’’ అని పేర్కొన్నారు. మొత్తంగా, అటు జగన్, పవన్, కేఏ పాల్, తరువాత ముఖ్యమంత్రి మేమే అంటూ హడావిడి చేస్తుంటే, పాల్ ఒక అడుగు ముందుకు వేసి, ఏకంగా చంద్రబాబు నాయదుకే అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ఏమి చేస్తాం, ఖర్మ.. ఎన్నికలు అయ్యే దాక, ఇలాంటివి వినాల్సిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read