చంద్రబాబు మొదటిసారి, తన పుట్టిన రోజు నాడు, ముఖ్యామంటి హోదాలో, ధర్మ పోరాట దీక్ష చేసిన సందర్భంలో, పవన్ కళ్యాణ్ చేసిన డైవర్షన్ గుర్తుందా ? సరిగ్గా చంద్రబాబు ఉదయం 7 గంటలకు దీక్ష మొదలు పెడతారు అనగా, పవన్ అర్ధరాత్రి నుంచి మ్యూజిక్ మొదలు పెట్టాడు. శ్రీరెడ్డి అనే ఆమె, తన అమ్మని ఎదో అందని, నాలుగు రోజుల తరువాత వచ్చి, దానికి కారణం చంద్రబాబు అని మొదలు పెట్టాడు. అప్పట్లో చంద్రబాబు మొదటి సారి చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు, దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన అటెన్షన్ చెడగొట్టి, మోడీ పై చంద్రబాబు చేసే విమర్శలు ఎక్కువగా మీడియాలో రాకుండా చెయ్యటానికి, అమిత్ షా వదిలిన బాణం. కాని, ఆ రోజు, పవన్ వ్యాఖ్యలు ఎవరూ ఎక్కువ గుర్తింపు ఇవ్వలేదు. రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న చంద్రబాబు దీక్షకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
అయితే, ఇప్పుడు కూడా ఇదే డైవర్షన్ ఐడియా ప్లాన్ చేసారు అమిత్ షా. రేపు అవిశ్వాస తీర్మానం పై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. సభ సాక్షిగా, మోడీ చేసిన మోసం దేశానికి చెప్పటానికి తెలుగుదేశం రెడీ అవుతుంది. మరో పక్క, మోడీ కొత్తగా చెప్పేది ఏమి ఉండదు. అన్నీ ఇచ్చేసాం, ఇంకా ఇస్తాం, చంద్రబాబు ద్రోహం చేసారు అంటూ నాలుగు సెంటిమెంట్ డైలాగ్ లు చెప్పి ఆంధ్రప్రదేశ్ విషయం ముగిస్తారు. అప్పుడు, ఆంధ్రప్రదేశ్ లో మరోసారి, మోడీ, అమిత్ షా పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయి. మోడీ పై పోరాటం చేస్తున్న క్రెడిట్ అంతా తెలుగుదేశం పార్టీకి వస్తుంది. అందుకే, ఈ విషయం పై డైవర్ట్ చేయాలని, మళ్ళీ పవన్ కళ్యాణ్ ని దింపుతుంది బీజేపీ...
అవిశ్వాస తీర్మానం మీద ఫోకస్ డైవర్ట్ చేయడానికి, 21 లేదా 22 తారీఖుల్లో దైవదర్శనం ముసుగులో అమరావతిలోని పద్మనాభస్వామి ఆలయానికి వచ్చి, ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకంగా రాజధాని పొలాల్లో మెరుపు ధర్నా చేసి, అక్కడ హడావిడి చేసి, అవిశ్వాస తీర్మానం పై, బీజేపీ పై వచ్చే వ్యతిరేకత డైవర్ట్ చేసే ప్లాన్ చేస్తున్నాడు పవన్. ఇప్పటికే విజయసాయి రెడ్డి, ముఖ్యమంత్రిగారిని పరుషపదజాలంతో తూలనాడి తెదేపా శ్రేణుల్ని రెచ్చగొడుతున్నారు. అన్నిటి పరమార్ధం ఒక్కటే. అవిశ్వాస తీర్మానం చర్చలో బీజేపీతో పాటు, బీజేపీ అంట కాగే పవన్, జగన్ లు కలిసి రాష్ట్రానికి చేస్తున్న ద్రోహాన్ని పార్లమెంటులో బయటపెట్టబోతున్నారనే భయమే ఈ డైవర్షన్ టాక్టిక్స్ లక్ష్యం.