వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సవాళ్లు, ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి... నిన్న జగన్ మాట్లాడుతూ, హోదా కోసం రాజీనామా చేయండయ్యా అంటే.. చంద్రబాబు పార్టనర్ పవన్ కళ్యాణ్ కేంద్రం పై అవిశ్వాస తీర్మానం పెట్టండి అని అన్నాడు. కానీ అవిశ్వాస తీర్మానాన్ని తీసుకోవడానికి 54 మంది సభ్యుల సంతకాలు కావాలి. అంత బలం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు లేదు, పవన్ కళ్యాణ్ గారూ.. మిమ్మలి ఒక్కటే కోరుతున్నా.. మీ పార్టనర్ చేత ఆ మద్దతు ఇప్పించండి అని సవాలు విసిరారు...
దానికి, ఈ రోజు పవన్ ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు... జగన్ మోహన్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. అవిశ్వాస తీర్మానంపై జగన్ విసిరిన సవాల్‌కు స్పందించారు... ఒక్క ఎంపీతో నైనా అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు కావాలన్నారు.. మీకు కావాల్సిన మద్దతు నేనిస్తాను. మార్చి 4వ తేదీన నేను ఢిల్లీకి వస్తాను. అందరు ఎంపీల మద్దతు కూడగడతాను. ముందు జగన్ అవిశ్వాస తీర్మానం పెట్టాలి" అని పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు...
జగన్ అవిశ్వాసం పెడితే మీకు నేను అండగా ఉంటానని, సీపీఎం, సీపీఐలను తీసుకు వస్తానని, కావాలంటే కర్నాటక వెళ్తానని చెప్పారు... కాని మొదటి రోజే, అవిశ్వాస తీర్మానం పెట్టండి అంటూ, పవన్ ప్రతి సవాల్ విసిరారు... మీరు దేనికీ భయపడొద్దు, మీరు ధైర్యవంతుడు, దమ్ము ఉన్నవాడు అంటూ వెటకారంగా జగన్ ను అని, మీరు భయపడవద్దు, మీకు అండగా నేను ఉంటాను, అఖిలపక్షం అండగా ఉంటుంది, కాని మీరు మొదటి రోజే కేంద్రం పై అవిస్వాసం నోటీసు ఇవ్వమని ఛాలెంజ్ చేసారు...