జనసేన కార్యాలయాల్లో స్వాతంత్ర దినోత్సవం రోజున, పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపిలోనే కాదు, తెలంగాణాలో కూడా విమర్శలకు గురి చేస్తున్నాయి. అక్కడ జనసేన కార్యాలయాల్లో ఆయన జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం మాట్లాడుతూ, లోకేష్ పై విమర్శల వర్షం కురిపించి, కేటీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. లోకేశ్‌కు అనుభవం ఏది, అంటూ విమర్శలు చేసి, కేటీఆర్ ప్రజల నుంచి వచ్చిన మనిషి అంటూ, పొగడ్తల వర్షం కురిపించారు. అయితే, ఈ వ్యాఖ్యల పై ఆంధ్రప్రదేశ్ లో విమర్శలు వినిపించాయి. కేటీఆర్ ను పొగడటానికి, లోకేష్ ని తక్కువ చేసి మాట్లాడటం ఏంటి అని, కేటీఆర్ కు సొంత పార్టీలోనే హరీష్ వర్గమే వ్యతిరేకమని, కేటీఆర్ ప్రజల నుంచి వచ్చిన మనిషి కాదు, అమెరికాలో జీవినం సాగించి, రాజకీయాల్లోకి వచ్చాడని, ఏమి తెలియని కేటీఆర్ హడావిడి చూసే, హరీష్ వర్గం అసంతృప్తిగా ఉందని పవన్ ఇలా తెలంగాణా భజన చెయ్యటం ఆపాలి అని అన్నారు.
అయితే, పవన్ వ్యాఖ్యల పై, ఆంధ్రా లోనే కాదు, తెలంగాణాలో కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ కు నాయకత్వ లక్షాణాలున్నాయన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ని తాను స్వయంగా కలుస్తానని, కాంగ్రెస్ పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్న ఆయనకు ఓ మంచి సలహా ఇవ్వాలని పవన్ ని కోరతానని సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. కేటీఆర్ కు పెద్దలకు గౌరవం ఇవ్వటమే రాదని, అలాంటి కేటీఆర్ లో పవన్ ఏమి చూసాడో అని వ్యంగ్యంగా మాట్లాడారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ శ్రేణులకు శిక్షణ ఇస్తామని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొనడాన్ని తప్పుబట్టారు. పెద్దలను గౌరవించే సంప్రదాయం కేటీఆర్ కు ఏమాత్రం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పవన్ తీరు మార్చుకోవాలని అన్నారు.
పవన్ ఒక పక్క కేటీఆర్ కు భజన చేస్తాడు. కేసీఆర్ పాలన అద్భుతం అంటాడు.చెల్లలు కవితకు ధన్యవాదాలు అంటాడు. కాని అవిశ్వాస తీర్మానంలో మద్దతు ఇవ్వకపోయినా, ప్రత్యేక హోదాకు మేము వ్యతిరేకం అన్నా, ఒక్క మాట కూడా మాట్లాడడు. దీనికి కారణాలు ఏంటో తెలియదు. ఎక్కడ లొంగిపోయాడో తెలియదు. తెలంగాణా అంటే నాకు పిచ్చి అని నిన్న పవన్ అన్నాడు. మరి తెలంగాణాలో జరిగే అక్రమాలను ఒక్క రోజు కూడా ఎందుకు ప్రశ్నించలేదు ? తెలంగాణాలో పరిమితి సీట్లలో పోటీ అంటున్నాడు, అంటే ఇక్కడే అర్ధమవుతుంది, కెసిఆర్ తో చేసుకున్న ఒప్పందం ఏమిటో. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు పవన్ కళ్యాణ్ ను వినియోగించుకోవాలనే యోజనలో టీఆర్ఎస్ ఉంది. దీని కోసం, ఎదో బలమైన కారణం చూపి, పవన్ కళ్యాణ్ ను కెసిఆర్ లొంగదీసుకున్నాడు. అందుకే, పాపం పవన్ కళ్యాణ్ కు ఈ పాట్లు. అటు అమిత్ షా చేతిలో, ఇటు కెసిఆర్ చేతిలో, నలిగిపోతున్నాడు.