చంద్రబాబు ఢిల్లీతో ఎదురు తిరిగిన దగ్గర నుంచి, ఢిల్లీ పెద్దలు ఏదైతే చేస్తారని ప్రచారంలో ఉందో, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో, ఆ ప్రచారం నిజమే అని తేలింది... 4 ఏళ్ళ నుంచి దేశంలో ఎదురు చెప్పేవాడు లేకపోవటం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వారి పై ఎదురు తిరగటంతో, అమిత్ షా - మోడీ, తట్టుకోలేక పోతున్నారు... అందుకే ఆపరేషన్ గరుడ అంటూ, చంద్రబాబుని దెబ్బతీసి, తద్వారా వారిని డీ కొడుతున్న ఆంధ్రప్రదేశ్ లో అనిశ్చితి తేవాలని చూస్తున్నారు... ఇందులో భాగంగా, జగన్, పవన్, కెసిఆర్ ను పర్ఫెక్ట్ గా వాడుతున్నారు... అలాగే, నా డిమాండ్ లు నెరవేరే వరకు, నేను బీజేపీతో వెళ్ళను అని పవన్ అన్నారు... అంటే,అందరూ అనుకుంటున్నట్టు, పవన్ ఎదో ఒక ఆందోళన చేసి,రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు తీసుకువచ్చి, బీజేపీ ఒక్కొక్క హామీ ఇచ్చిన తరువాత, పవన్ బీజేపీతో కలుస్తాడు అనే ప్రచారం నిజం అని పవన్ మాటలను బట్టి తేలింది... ఈ రోజు, పవన్ కళ్యాణ్ ఒక నేషనల్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ తో, ఆపరేషన్ గరుడ అనేది నిజమే అనే విషయం అర్ధమైంది...

pavan 19032018 1

CNN-News18 అనే నేషనల్ మీడియాతో పవన్ మాట్లాడుతూ, చివరకు స్పెషల్ స్టేటస్ పై కూడా మాట మార్చి, తాను మోడీ - అమిత్ షా కు ఎంత లొంగిపోయింది చెప్పకనే చెప్పారు... "స్పెషల్ స్టేటస్ ఇస్తారా ఏమి ఇస్తారు అనేది అనవసరం, మాకు డబ్బులు" కావలి అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు... ఇదే విషయం చంద్రబాబు అంటే, పాచి పోయిన లడ్డులు అని చెప్పిన పవన్, ఇప్పుడు ఇలా అంటున్నారు.. ఒక పక్క స్పెషల్ స్టేటస్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటూ, రాష్ట్రానికి సరిపడా డబ్బులు ఇస్తే చాలు అంటున్నారు... ఇంతటితో ఆగలేదు, మళ్ళీ చంద్రబాబు పై విమర్శలు చేస్తూనే ఉన్నారు...

pavan 19032018 1

నా దగ్గరకు 40 మంది తెలుగుదేశం ఎమ్మల్యేలు వచ్చారని, వారంత చంద్రబాబు, లోకేష్ చేస్తున్న అవినీతి గురించి నాకు చెప్పారని, అలాగే, పోలవరంలో కూడా అవినీతి జరుగుతుందని, వీటి అన్నిటి మీద, సమగ్ర విచారణ జరపాలని కేంద్రాన్ని కోరుతున్నట్టు చెప్పారు... అందరూ అనుకుంటున్నట్టు, ఇదే ఆపరేషన్ గరుడ, అసలు ఉద్దేశం.... ఇక పొతే, కెసిఆర్ గురించి కూడా చెప్పారు... ఆయన్ను ఆకాశానికి ఎత్తేసారు... కెసిఆర్ కు, థర్డ్ ఫ్రంట్ పెట్టమని చెప్పింది తానే అని చెప్పారు... 10 మార్కులకు గాను, చంద్రబాబుకి 2.5 మార్కులు, కెసిఆర్ కు 6 మార్కులు వేస్తున్నట్టు చెప్పారు పవన్... ఇది వరుస.. ఒక పక్క ఢిల్లీతో చంద్రబాబు పోరాడుతుంటే, దానికి, కెసిఆర్ తప్ప, దేశంలో అన్ని పార్టీలు మద్దతు ఇస్తుంటే, జాతీయ మీడియాకు ఎక్కి, చంద్రబాబుని బలహీన పరుస్తూ, కెసిఆర్ ని పొగుడుతూ, వారి అజెండా ఏంటో బయట పెట్టుకున్నారు... దీని పై స్పందించిన తెలుగుదేశం నాయకులు, "ఇప్పటికే చంద్రబాబు క్లియర్ గా చెప్పారని.. మోడీ - అమిత్ షా ఎలాంటి వారో తెలుసు అని, అన్నిటికీ సిద్ధపడే వారితో యుద్ధం మొదలు పెట్టామని, నేను ఏ అవినీతి చెయ్యలేదు అని, నన్ను అవినీతిలో ఇరికించ లేక, ఇలాంటి పనులు చేస్తున్నారని", చంద్రబాబు చెప్పిన విషయం గుర్తు చేశారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read