రెండు రోజుల నుంచి రక్తి కట్టించిన జగన్ - పవన్ డ్రామా ముగిసింది. జగన్‌మోహన్ రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలు చయడం పై సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేసారు. జగన్ తనను ఈ విధంగా విమర్శించడం ఎందరినో బాధించిందని అన్నారు. దయచేసి ఈ వివాదాన్ని అందరూ ఇక్కడితో ఆపేయాలని కోరుకుంటున్నా, అంటూ ఈ మేరకు ట్విటర్‌లో ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు. అయితే పవన్ స్వభావం తెలిసిన ఎవరూ, పవన్ ఇలా స్పందిస్తాడు అని ఊహించలేదు. చంద్రబాబు, లోకేష్, రాధాకృష్ణా, రవిప్రకాష్ పై వ్యక్తిగత ఆరోపణలు ఎలా చేసాడో, అలాగే చేస్తాడు అని అందరూ ఊహించారు. కాని, జగన్, పవన్ కి ఎంతో స్పెషల్ అందుకే, జగన్ ను ఏమి అనలేదు.
ఇది ఇలా ఉండగా, దీని పై చాలా స్టొరీ జరిగింది. ఈ సంధి వెనుక ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు దగ్గరుండి చూస్తున్న, బీజేపీ అగ్ర నేత హస్తం ఉంది. ఈ నేత రాత్రికి రాత్రి రంగలోకి దిగి, జగన్, పవన్ ఇద్దరికీ "తమదైన శైలి" లో జ్ఞానోదయం చెయ్యటంతో, ఇరువురూ లైన్ లోకి వచ్చారు. అందుకే నిన్నే జగన్ ఈ విషయం ఆపేస్తే, ఈ రోజు పవన్ ట్విట్టర్ ద్వారా, ఈ విషయం వదిలెయ్యండి అంటూ, స్టొరీ రక్తి కట్టించారు. జగన్, పవన్ ఇద్దరికీ ఇగో బాగా ఎక్కువ, కాని ఇప్పుడు ఈ ఇగోల కంటే, వీరికి చంద్రబాబుని దింపటం ముఖ్యం. అందుకే ఆ టార్గెట్ కోసం, ఇద్దరూ వాళ్ళ ఇగో పక్కన పెట్టి మరీ, కంప్రోమైజ్ అయ్యారు.
పవన్, జగన్ ఇద్దరూ కలిసి పోటీ చేస్తున్నారు అనే వాతావరణం మొన్నటి దాకా ఉంది. ఇద్దరూ కలిస్తేనే చంద్రబాబుని ఎదుర్కొగలమని, బీజేపీ వీళ్ళద్దిరినీ కలిపే ప్రయత్నం చేస్తూ వస్తుంది. విడి విడిగా పోటీ చేస్తే, చంద్రబాబు ప్రచారం చెయ్యకపోయినా గెలిచిపోతారు. అందుకే, జగన్ - పవన్ కలిసి పని చెయ్యాలనేది బీజేపీ వ్యూహం. అయితే, అనూహ్యంగా జగన్ తన ఇగో బయట పెట్టారు. దీనికి అనేక కారణాలు ఉన్నా, పవన్ తో పొత్తు విషయంలో ఇది ఒక అవరోధం అని బీజేపీ భావించి, వెంటనే పవన్ కళ్యాణ్ చేత అదే విధమైన రియాక్షన్ రాకుండా జాగ్రత్త పడింది. రాత్రికి రాత్రి, అటు పవన్, ఇటు జగన్ లతో సంప్రదింపులు జరిపి, మీ ఇగోలో కంటే, చంద్రబాబుని దింపటమే ముఖ్యం అనే విషయం అర్ధం అయ్యేలా చెప్పి, తమదైన శైలిలో జ్ఞానోదయం చేశాడు ఆ బీజేపీ అగ్ర నేత. అందుకే ఈ రోజు పవన్, వివాదం ముగిసిపోయింది అంటూ ట్వీట్ వేసాడు, నిన్నటి నుంచి జగన్ క్యాంప్ సైలెంట్ అయిపొయింది.