జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్టు ఉండి ఢిల్లీ వెళ్ళటం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయంసం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పర్యటన ఆసక్తి రేపుతుంది. పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా, తాను ప్రభుత్వ ఓటు చీలనివ్వను అని, ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. అంతే కాదు ఇక్కడ ఏపిలో జగన్ కు సహకరిస్తున్న బీజేపీ నాయకత్వం పై ఆగ్రహంగా ఉన్నారు. ఇక్కడ ఏపి బీజేపీ నేతలు కొంత మంది, జగన్ పై ఇస్తున్న ఫీడ్ బ్యాక్ వల్లే, జగన్ కు ఢిల్లీ లో షీల్డ్ దొరుకుంటుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా, ఇక్కడ బీజేపీ నేతల పై అసహనం వ్యక్తం చేసారు. ఈ నేపధ్యంలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఆయన భేటీ అవ్వనున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ టూర్ గురించి మీడియాకు సమాచారం ఇవ్వలేదు. మీడియా వాళ్ళు జనసేనని సంప్రదించగా, వ్యక్తిగత పర్యటన అంటూ చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన ముందుగా లీక్ ఇవ్వకుండా ఉండటానే, ఇలా చేసారని తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారం పై, ఇప్పుడు చర్చ జరుగుతుంది. పవన్ ఢిల్లీ టూర్ పై వైసీపీ కూడా ఆరా తీస్తుంది. తమకు బీజేపీతో ఉన్న సంబంధాలు ఎక్కడ దెబ్బ తింటాయా అని భయపడుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read