ఏపీలో కేసీఆర్ బీఆర్ఎస్ విస్తరణ జాతీయ పార్టీగా నిలదొక్కుకోవడానికి కాదట. కేవలం తన రహస్య స్నేహితుడు జగన్ రెడ్డి మేలు కోసమేనట. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి తిరుగులేదని, జనసేన జతకడితే క్లీన్ స్వీప్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఈ మిత్రుల సర్వేలో తేలింది. టిడిపిని ఈ పరిస్థితుల్లో దెబ్బకొట్టలేమని, ఎన్నో కుతంత్రాలు పన్నితే 2019లో 40 శాతం ఓటింగ్ ఉందని ఇది పెరుగుడే కానీ, తరిగే అవకాశం లేదని నిర్ణయించుకున్నారు. టిడిపితో జనసేన కలిస్తే 65 శాతం ఓటింగ్ కొల్లగొట్టే చాన్స్ ఉందని వీరి లెక్కలు. జనసేనని టార్గెట్ చేయడం, కాపుల ఓటుబ్యాంకు చీలితే వైసీపీకి కలిసొస్తుందని వీరి వ్యూహం. దీని కోసమే బీఆర్ఎస్ ఏపీ కార్యకలాపాలు ఆరంబిస్తున్నారు. కేవలం కాపులని, జనసేనకి దగ్గరయ్యేవారినే బీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారు. వైసీపీ నుంచి ఎవరైనా చేరుతామన్నా కేసీఆర్ తిరస్కరిస్తున్నారని సమాచారం. ఈ విషయాన్ని ఏపీ బీజేపీ మాజీ అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇదే అంశంపై మాట్లాడారు. జగన్-కేసీఆర్ కుట్రలో భాగంగానే భారాసలోకి ఏపీ నేతలు వెళ్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో పవన్, తెలంగాణలో బండి సంజయ్ ను బలహీనం చేసే కుట్ర ఇదని తెలిపారు. జగన్ కోసం పవన్ కళ్యాన్‌ని దెబ్బకొట్టేందుకు కేసీఆర్ భారాస కాపు నేతలపై దృష్టి పెట్టిందని సంచలన విషయాలను బయట పెట్టారు. పవన్ కళ్యాణ్‌కి తాము అండగా వుంటామని ప్రకటించారు.
పవన్ కళ్యాణ్‌ని దెబ్బకొట్టేందుకు జగన్-కేసీఆర్ స్కెచ్
Advertisements