నేను చించేస్తా, నేను పొడిచేస్తా, అని ఊగిపోతూ సినిమా డైలాగులో కొట్టే పవన్ కళ్యాణ్ కు, అటు మోడీ అన్నా, ఇటు కెసిఆర్ అన్నా నోట్లో నుంచి మాట రాదు. కేవలం చంద్రబాబు మీదే తన ప్రతాపం చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే చంద్రబాబు, ఇలాంటి వారిని పట్టించుకోడు. ఆయన పని, ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. జగన్ లాంటి వాడి నిన్ను నడి రోడ్డు మీద కాల్చేయాలి అన్నా, విజయసాయి రెడ్డి లాంటి వాడు, చంద్రబాబు తల్లిని దుషించినా, ఎవరి పాపాన వాళ్ళే పోతారని, ప్రజలే అన్నీ గామినిస్తూ ఉంటారని వదిలేస్తారు. అందుకే, పవన్ కళ్యాణ్ లాంటి వారు, తెలంగాణా నుంచి, ఇక్కడకు వచ్చి చిందులు తొక్కుతూ ఉంటారు. నిన్న పవన్ కళ్యాణ్ తన సొంత రాష్ట్రం హైదరాబాద్ వెళ్ళిపోయారు.

lokesh 16082018 2

అక్కడ జనసేన కార్యాలయాల్లో ఆయన జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం మాట్లాడుతూ, లోకేష్ పై విమర్శల వర్షం కురిపించి, కేటీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. లోకేశ్‌కు అనుభవం ఏది, అంటూ విమర్శలు చేసి, కేటీఆర్‌ ప్రజల నుంచి వచ్చిన మనిషి అంటూ, పొగడ్తల వర్షం కురిపించారు. నిజానికి కేటీఆర్‌ ప్రజల నుంచి వచ్చిన మనిషి కాదు, అమెరికాలో జీవినం సాగించి, రాజకీయాల్లోకి వచ్చాడు. ఏమి తెలియని కేటీఆర్‌ హడావిడి చూసే, హరీష్ వర్గం అసంతృప్తిగా ఉంది. మరి కేటీఆర్‌ లో, పవన్ కు కనిపించిన అనుభవం ఏంటో, లోకేష్ లో లేనిది ఏంటో ? లోకేష్ గత సంవత్సర కాలంగా, ఐటి, పంచాయితీ రాజ్ శాఖా మంత్రిగా, మంచి పేరు తెచ్చుకున్నాడు. మరి, 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నాను అని చెప్పే పవన్ అనుభువం ఏంటి ? పార్టీ టికెట్ లు అమ్ముకోవటం, పార్టీలు అమ్ముకోవటం తప్ప ? వ్యక్తిగతంగా వెళ్తే, ఇంకా చాలా అనుభవాల గురించి, మాట్లాడుకోవచ్చు.

lokesh 16082018 3

జగన్ మోహన్ రెడ్డి, ఉదయం లెగిసిన దగ్గర నుంచి చంద్రబాబు భజన చేస్తుంటే, పవన్ మాత్రం లోకేష్ భజన చేస్తున్నాడు. అదే పక్క కేటీఆర్ కు భజన చేస్తాడు. కేసీఆర్ పలాన అద్భుతం అంటాడు.చెల్లలు కవితకు ధన్యవాదాలు అంటాడు. కాని అవిశ్వాస తీర్మానంలో మద్దతు ఇవ్వకపోయినా, ప్రత్యేక హోదాకు మేము వ్యతిరేకం అన్నా, ఒక్క మాట కూడా మాట్లాడడు. దీనికి కారణాలు ఏంటో తెలియదు. ఎక్కడ లొంగిపోయాడో తెలియదు. తెలంగాణా అంటే నాకు పిచ్చి అని నిన్న పవన్ అన్నాడు. మరి తెలంగాణాలో జరిగే అక్రమాలను ఒక్క రోజు కూడా ఎందుకు ప్రశ్నించలేదు ? తెలంగాణాలో పరిమితి సీట్లలో పోటీ అంటున్నాడు, అంటే ఇక్కడే అర్ధమవుతుంది, కెసిఆర్ తో చేసుకున్న ఒప్పందం ఏమిటో. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు పవన్ కళ్యాణ్ ను వినియోగించుకోవాలనే యోజనలో టీఆర్ఎస్ ఉంది. దీని కోసం, ఎదో బలమైన కారణం చూపి, పవన్ కళ్యాణ్ ను కెసిఆర్ లొంగదీసుకున్నాడు. అందుకే, పాపం పవన్ కళ్యాణ్ కు ఈ పాట్లు. అటు అమిత్ షా చేతిలో, ఇటు కెసిఆర్ చేతిలో, నలిగిపోతున్నాడు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read