జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే... శనివారం రాత్రి జనసేనాని.. టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని కలిశారు. గంటన్నరపాటు వారి మధ్య చర్చ జరిగింది. ఈ సమావేశంలో పలువిషయాలపై చర్చించారు. స్థానికంగా ఉన్న ప్రజా సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు పవన్ కల్యాణ్. రోడ్లు, మురుగునీరు, తాగునీటి కటకట, పారిశుధ్యం, గతంలో ఇచ్చిన హామీలు, చేసిన పనులు వంటి వివరాలను మాట్లాడారు... అనంతరం అటు నుంచి పవన్ కల్యాణ్ ఓ ప్రైవేటు లాడ్జికి వెళ్లారు...
ఇవాళ ఉదయం అనూహ్యంగా, మంత్రి పరిటాల సునీతతో సమావేశం అయ్యారు... కదిరికి బయలుదేరే ముందు సునీత నివాసానికి చేరుకున్న పవన్‌ను పరిటాల శ్రీరామ్ ఎదురెళ్లి స్వాగతం పలికి లోనికి తీసుకెళ్లారు.. రాయలసీమలో కరవు పరిస్థితులు, రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలకు తాగు నీటి సమస్య తదితరాలపై వీరు మాట్లాడారు... మీడియా ముందే, శ్రీరాం, నీటిపారుదల రంగ నిపుణులతో, రైతులుకు నీరు ఇస్తున్న తీరు, భవిష్యత్తు ప్రణాళిక, మ్యాప్ లు చూపించి, వివరించారు...
ఈ సందరభంగా జరిగిన మీడియా సమావేశంలో, పవన్ కల్యాణ్ ను "2019లో టీడీపీతో కలిసి పని చేస్తారా?" అని మీడియా ఓ ప్రశ్న అడుగగా, ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.... తన పార్టీ ప్రజాభీష్టం మేరకే ముందుకు సాగుతుందని చెప్పిన పవన్, ఎన్నికల సమయంలోనే పొత్తుల గురించి మాట్లాడతానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా సమయం ఉందికదా? అని ప్రశ్నించిన పవన్, ఏదైనా పొత్తు గురించి ఆలోచించే సమయంలో ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటానని తెలిపారు.