ఒక పక్క అసలు పాదయత్ర జరుగుతుందో లేదో కూడా తెలీదు... సాక్షిలో తప్ప, ఎవరూ పట్టించుకోవట్లేదు... సోషల్ మీడియాలో పైడ్ ప్రొమోషన్స్ తో కాలం గడిపేస్తున్నారు... ఎదో జరుగుతుంది అంటే జరుగుతుంది అన్న చందాన, పైడ్ ఆర్టిస్ట్ ల చేత చంద్రబాబుని తిట్టించటం, అహో జగన్, ఓహో జగన్ అనటంతోనే పాదయాత్ర అంతా సరిపోతుంది... ప్రజలకు మాత్రం ఈ పాదయత్ర వల్ల పైసా ఉపయోగం లేదు.. ఏమి చెప్పినా, నేను ముఖ్యమంత్రి అయిన తరువాతే అంటాడు అనే భావం ప్రజల్లో వచ్చేసింది...ఈయనకు చెప్పుకుని కూడా ఏమి ఉపయోగం ఉండదు అని ఫీలింగ్ లో ప్రజలు ఉన్నారు... ఇంత ఫ్లాప్ షో నడుస్తూ ఉండగానే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటనతో, జగన్ లో దడ మొదలైంది...

pk 05122017 2

ఏ ప్లానింగ్, ఏ లీక్ లేకుండా, రేపటి నుంచి ప్రజల్లోకి వచ్చేస్తున్నా అంటూ పవన్ విడుదల చేసిన ప్రకటనతో, జగన్ మరింత టెన్షన్ లోకి వెళ్ళిపోయారు... ఇక పవన్ కూడా వస్తే, పట్టించుకునే ఆ కొద్ది మంది కూడా పోతారు అనే భయం జగన్ కు పట్టుకుంది... పవన్ ఏ సమస్య పట్టుకున్నా, చంద్రబాబుతో మాట్లాడి సాధిస్తారు అనే భావన ప్రజల్లో ఉంది... ప్రధాన ప్రతిపక్షంగా జగన్ ఏ నాడు ప్రజల పక్షాన లేడు... పవన్ మాత్రం వీలు దొరికిన ప్రతి సారి, సమస్యలు ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తున్నారు... ఇప్పుడు పవన్ ఫుల్ టైం పాలిటిక్స్ లోకి రేపటి నుంచే వచ్చేస్తున్నాడు అని తెలిసే సరికి, ఈ సారి ఈ ప్రతి పక్షం కూడా ఉండదు ఏమో అని జగన్ భయ పడుతున్నారు...

pk 05122017 3

పవన్ కల్యాణ్ - డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న అజ్ఞాతవాసి సినిమా వారణాసి షెడ్యూల్‌తో షూటింగ్ ముగిసింది. దీంతో పవన్ కల్యాణ్ ఫ్రీ అయ్యారు. రేపు ప్రజా క్షేత్రంలోకి జనసేనాని అడుగు పెడుతున్నారు. మొదటగా బుధవారం విశాఖ లో పవన్ పర్యటన కొనసాగనుంది. విశాఖ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ లో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని పవన్ పరమర్శించనున్నారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా ఫుడ్ పార్క్ బాధితులుతో మరోసారి పవన్‌ భేటీ కానున్నారు. విజయవాడలో జరిగిన ఫెర్రీ బోట్ ప్రమాదం లో మృతి చెందిన కుటుంబ సభ్యులను ఒంగోలులో ఈ నెల 8న పరమర్శించనున్నట్ల పవన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాత్రకు "చలోరే చలోరే చల్‌"గా నామకరణం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read