జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్టు ఉండి, ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్ళటంతో ఆసక్తి నెలకొంది. ఈ రోజు ఉదయం, గుంటూరు జిల్లా, మంగళగిరిలో, భవన నిర్మాణ కార్మికుల కోసం, డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించిన పవన్ కళ్యాణ్, ఈ కార్యక్రమం అయిన వెంటనే, ఆయన గన్నవరం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అయితే జనసేన పార్టీ వర్గాలు మాత్రం, ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గునేందుకు వెళ్తున్నారు అని చెప్తున్నా, దీని వెనుక ఏదో రాజకీయ వ్యూహం ఉందనే అభిప్రయం కలుగుతుంది. ఢిల్లీలో పలువురు కీలక నేతలు, కేంద్ర మంత్రులను పవన్ కళ్యాణ్ కలిసే అవకాసం ఉనట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది అని, ఒక పక్క 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని, మరో పక్క అభివృద్ధి లేదని, అలాగే అమరావతి, పోలవరం ఆగిపోయాయని, వచ్చిన కంపెనీలు కూడా వెనక్కు వెళ్ళిపోయాయి అని, వీటి అన్నిటి పై, కేంద్రంతో ఫిర్యాదు చేస్తాను అని గతంలో పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపధ్యంలోనే పవన్ కళ్యాణ్, ఢిల్లీ వెళ్ళటం పై, ఆసక్తి నెలకొంది. ప్రధని మోడీ అందుబాటులో లేరు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారో లేదో చూడాల్సి ఉంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో పాటు, రాజకీయ అంశాలు కూడా, ఈ భేటీలో చర్చించే అవకాసం ఉనట్టు తెలుస్తుంది. మరో పక్క, ఈ రోజు పవన్ కళ్యాణ్ మంగళగిరిలో, ‘డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు’ ప్రారంభిస్తూ, ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేసారు. పనులు లేక, కనీసం తిండి కూడా దొరక్క, కూలీలు ఇబ్బంది పడుతుంటే, ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తుందని అన్నారు. 50 మంది చనిపోయిన తరువాత కూడా ప్రభుత్వం మేల్కొనలేదని అన్నారు. ఆరు నెలల తరువాత, మొక్కుబడిగా, ఇసుక వార్తోత్సవాలు చేస్తున్నారని, ఆరు నెలల నుంచి ఏమి చేస్తున్నారని పవన్ అన్నారు.
ప్రజలు చచ్చిపోతుంటే, మేము మాట్లాడకూడదు అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. 151 సీట్లు ఇచ్చి, వన్ సైడ్ మ్యన్దేట్ ఇస్తే ఇలా చేస్తారా అంటూ, పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. గతంలో అమరావతిని సమర్ధిస్తూ, ఏకగ్రీవ తీర్మానం చేసిన, జగన్ , ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారని అన్నారు. చంద్రబాబు పై కోపం ఉంటే, ఆయన పై తీర్చుకోండి కాని, అమరావతి ఎందుకు మారుస్తున్నారు అంటూ, వ్యాఖ్యలు చేసారు. రాజధాని పై ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని పవన్ అన్నారు. పులివెందులలో పెడతారా, ఇడుపులపాయలో పెడతారా, ఎక్కడైనా పెట్టుకోండి కాని, ప్రజామోదంతో, ఏదో ఒకటి తొందరగా తేల్చండి అంటూ, పవన్ కళ్యాణ్ వాపోయారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు.