జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత నుంచి, చంద్రబాబు చేసిన పనులు అన్నీ రద్దు చేసుకుంటూ వస్తున్నారు. ముందుగా ప్రజా వేదిక కూల్చిన ప్రభుత్వం, తరువాత చేసింది, చంద్రబాబు హయంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలు సమీక్ష చెయ్యటం. ఈ వివాదం గత ఆరు నెలల నుంచి కొనసాగుతుంది. సోలార్, విండ్ విద్యుత్ సంస్థలకు అధిక డబ్బులు చెల్లించి, ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఆరోపిస్తూ, ఆ కంపెనీల నుంచి విద్యుత్ తీసుకోవటం, అలాగే బకాయలు చెల్లించటం ఆపేసారు. దీంతో ఆ కంపెనీలు, కోర్ట్ కు వెళ్ళాయి. కోర్ట్ లు మొట్టికాయలు పడ్డాయి. తరువాత కొన్ని దేశాలు, కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాసాయి. ఇలా అయితే, మీ దేశంలో పెట్టుబడులు ఎవరూ పెట్టరు, ప్రభుత్వాలు మారిన ప్రతిసారి, ఇలాగే ఒప్పందాలు సమీక్షలు చేస్తే, మా కంపెనీలు పెట్టుబడులు పెట్టవు అంటూ కేంద్రానికి తేల్చి చెప్పాయి. వీటి అన్నిటి పై, కేంద్రం కూడా, రాష్ట్రం పై సీరియస్ అయ్యింది. అయినా ప్రభుత్వం, మొండిగా ముందుకు వెళ్తూనే ఉంది.

jagan 02012020 1

యీ ఈ విషయం కోర్ట్ లో ఉండటంతో, కోర్ట్, రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్రంగా స్పందించింది. వారికి ఇవ్వాల్సిన 1400 కోట్లు కట్టాలి అంటూ, పోయిన వారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వానికి ఇక వేరే మార్గం లేక పోయింది. చంద్రబాబు అవినీతి చేసారు అంటూ బురద చల్లారే కాని, ఎక్కడా రూపాయి అవినీతి కూడా నిరూపించలేక పోయారు. దీంతో కోర్ట్ ఆదేశాలును పాటించాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. దీంతో తాము అధికారంలోకి వచ్చిన ఏడు నెలలు తరువాత, సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిల చెల్లించింది. డిసెంబర్ నెలాఖరు వరకు, ఈ సంస్థలకు, రూ.1212 కోట్లు చెల్లించినట్లు విద్యుత్‌శాఖ వర్గాలు చెప్పాయి. కోర్ట్ ఆదేశాల ప్రకారం, ఈ చెల్లింపులు జరిగాయి.

jagan 02012020 1

హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 219 పవన విద్యుత్తు సంస్థలకు రూ.1,896.87 కోట్లు, 44 సౌర విద్యుత్తు సంస్థలకు రూ.359.10 కోట్లను 2019 సెప్టెంబరు వరకు చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ.1,212.28 కోట్లను డిసెంబరులో డిస్కంలు చెల్లించాయి. ఈ చెల్లింపుల కోసం, ఇరెడా, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంక్‌ల నుంచి, అప్పులు తీసుకుంది ప్రభుత్వం. ఎక్కవ ధర వల్ల ఇబ్బంది పడుతున్నామని, అయినా కోర్ట్ ఆదేశాల ప్రకారం చెల్లింపులు చేసామని చెప్తున్నారు. అయితే యూనిట్ కు రూ.2.44 చొప్పున చెల్లించామని, తదుపరి యూనిట్ కు ఎంత చెల్లించాలి అనేది, విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ విచారణను బట్టి నిర్ణయం తీసుకోవాలనే హైకోర్టు ఆదేశాల ప్రకారం, నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read