తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పీఏసీ చైర్మెన్ పయ్యావుల కేశవ్ సంచలనానికి తెర లేపారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, రూ.41 వేల కోట్లకు బిల్లులు చూపించలేదు అంటూ సంచలన ఆరోపణలు చేసారు. ఆరోపణలే కాదు దానికి సంబంధించి పూర్తి ఆధారాలు కూడా తీసుకుని, గవర్నర్ వద్ద పెట్టారు. ఏకంగా 10,806 బిల్లులకు సంబంధించి రూ.41 వేల కోట్లకు లెక్కలు గల్లంతు అయ్యాయని, అవి ఎక్కడ ఖర్చు పెట్టారు, దేని కోసం ఖర్చు పెట్టారో లెక్క లేకుండా, పోయిందని ఆధారాలు చూపించారు. ఇదే విషయం పై కాగ్ కూడా రాసిన లేఖను చూపించారు. ఇవన్నీ గవర్నర్ కు ఇచ్చి, గవర్నర్ కు ఉన్న అధికారాలు, ఇందులో గవర్నర్ పాత్ర, ఆయనకు ఇది ఎలా అంటుకుంటుందో చెప్తూ, గవర్నర్ దీని పై దృష్టి పెట్టాలని కోరారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ రోజు పయ్యావుల కేశవ్ గవర్నర్ ను కలిసారు. రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతున్న ఆర్ధిక అవకతవకల పై గవర్నర్ కు ఫిర్యాదు చేసారు. గవర్నర్ కు ఫిర్యాదు చేసిన తరువాత పయ్యావుల, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక చిన్న కంపెనీ కూడా పక్కగా లెక్కలు మైంటైన్ చేస్తూ, ఎక్కడ తేడా లేకుండా అన్ని బిల్లులు పెట్టుకుంటారని, అలాంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల బడ్జెట్ పెడుతూ, ఏకంగా రూ.41 వేల కోట్ల ఖర్చులకు సరైన వివరాలు చూపించలేదని అన్నారు.

payyavula 080702021 2

ఇదే విషయం గవర్నర్ వద్దకు తీసుకుని వెళ్ళామని అన్నారు. మేము గత ఏడాది కాలంగా దీని పై పరిశోధనలు జరిపామని, చివరకు కాగ్ వాళ్ళు కూడా తాము ఇచ్చిన నివేదికలు కరెక్ట్ అనే విధంగా, ఈ రూ.41 వేల కోట్లకు లెక్కలు చెప్పాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసారని అన్నారు. ఒక్క బిల్ మూవ్ అవ్వాలి అని, దానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఓచర్లు, సంతకాలు ఉంటాయాని, అప్పుడు కానీ ట్రెజరర్ విడుదల చేయడని, అలాంటిది రూ.41 వేల కోట్లకు ఎలాంటి ల్లులు, ఓచర్లు, లావాదేవీల పత్రాలు లేకుండానే ఖర్చు పెట్టేసారని అన్నారు. ఇది తాము అనటం లేదని, ఏకంగా కాగ్ లేఖ రాస్తూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తి వివరాలు అడిగారని అన్నారు. ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ రాసిన లేఖను కూడా గవర్నర్ కు ఇచ్చినట్టు పయ్యావుల తెలిపారు. ప్రభుత్వం చేసే ప్రతి చర్య గవర్నర్ పేరు మీదే జరుగుతుందని, ఆర్టికల్ 151(2) ప్రకారం గవర్నర్ కు తెలియచేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఏ నివేదికలు ఇస్తే గవర్నర్ ఆవే నివేదికలు ఇచ్చే పరిస్థితి ఉంటుందని, అందుకే గవర్నర్ గారికి ఈ విషయాలు చెప్పి, సరైన చర్యలు తీసుకుని, మొత్తం ఆడిట్ చేపించమని కోరామని పయ్యావుల అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read