రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తాను గవర్నర్ కు ఇచ్చిన లేఖ తాలూకా అంశాలను చాలా తేలిగ్గా తీసుకునేలా, అవేవీ అసలు చెప్పుకోదగిన అంశాలే కావన్నట్లుగా మాట్లాడారని, వ్యక్తులంటే గౌరవంలేని ప్రభుత్వం, మంత్రి, కనీసం వ్యవస్థలైనా గౌరవిస్తే సంతోషిస్తామని టీడీపీ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావులకేశవ్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విజయవాడలోని ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ... "రూ.41వేల కోట్లకు సంబంధించిన అంశం గురించి మంత్రి స్థాయిలో ఉన్య వ్యక్తి ఏమాత్రం లెక్కలేనట్లు నిర్లక్ష్యంగా మాట్లాడారు. సీఏజీ (కాగ్), కేంద్ర ప్రభుత్వం అన్నీ తెలివి తక్కువవేనని, తానొక్కడే తెలివైనవాడినన్నట్లుగా మంత్రి మాటలున్నాయి. 17-06-2020న తాను ప్రభత్వానికి లేఖ రాశాను. ఆ లేఖలో చీఫ్ సెక్రటరీని, ఆర్థిక కార్యదర్శిని కొన్ని విషయాలు అడిగాను. ప్రభుత్వం తరుపున ఇచ్చిన బ్యాంక్ గ్యారెంటీలు, లోన్ల వివరాలు, కార్పొరేషన్లకు ఇచ్చిన నిధుల వివరాలు తెలియచేయాలని కోరాను. తాను రాసిన లేఖకు 01-07-2021న ప్రభుత్వం సమాధానమిచ్చింది. ఒక సంవత్సరానికి 15 రోజుల తక్కువగా దాదాపు 350 రోజుల తర్వాత సమాధానమిచ్చారు. అంత సమయం ఎందుకు తీసుకున్నారు? అసలు తాము గవర్నర్ ను కలిసేవరకు పరిస్థితులను ప్రభుత్వం ఎందుకు తెచ్చుకుంది? బడ్జెట్ తో పాటు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాల్యూమ్ 5/2 లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు, అందుకోసం ఇచ్చిన గ్యారంటీల వివరాలు దానిలో ఉండాలి. ఆ వాల్యూమ్ ని ప్రభుత్వం విధిగా శాసనసభకు సమర్పించాలి. తాను గతంలో అడిగిన లేఖకు సంవత్సరం తర్వాత ఏమని సమాధానమిచ్చారంటే, 5/2 వాల్యూమ్ లో మీరు అడిగిన సమాచారం ఉంటుంది చూసుకోమన్నారు. దానిలో సమాచారముంటుందనే విషయం నాకుతెలియదా? రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి రూ. 25వేల కోట్లకు బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన విషయాన్ని ఈ ప్రభు త్వం శాసనసభకు తెలియకుండా దాచింది. వాల్యూమ్ లో ఆ ప్రస్తావన ఎక్కడా లేదు. ప్రభుత్వం కొత్తగా ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. రూ.25వేల కోట్లు అప్పగా తీసుకోండి...దానికి తమ ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుందని సదరు కార్పొరేషన్ తో చెప్పారు.

దానిలో కూడా తప్పేమీలేదు. అనేక కార్యక్రమాలకు చేసినట్లే అప్పులు చేశారని భావిస్తాం. కానీ నేరుగా అప్పుల తాలూకా సొమ్ము, నేరుగా ప్రభుత్వ ఖజానాకు రాకుండా, నిధులన్నీ కార్పొరేషన్ అకౌంట్లోకి పోయేలా ప్రభుత్వం జీవో ఇవ్వడమేంటి? రాష్ట్రం విధించే ఏ పన్నైనాసరే, రాష్ట్రఖజానాలోకే రావాలని రాజ్యాం గంచెబుతోంది. మరి రాష్ట్ర ప్రభుత్వమిచ్చిన జీవోనెం -92 సంగతేంటి? ఆ జీవో ద్వారా ఏపీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తీసుకునే రుణాలకు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చింది. ఆ జీవోపై టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టుకి వెళితే, అక్కడే తాము ఎలాంటి గ్యారంటీలు ఇవ్వలేదని బుకాయించారు. జీవోలో ఒకటిచెప్పడం, కోర్టులో మరోటి చెప్పడం, అసెంబ్లీలో చెప్పకుండా దాయడం.. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో మంత్రికి తెలియదా? రూ.25వేల కోట్ల బ్యాంక్ గ్యారంటీ, ప్రభుత్వమిచ్చిన విషయాన్ని శాసనసభకు తెలియ చేయకుండా ఎందుకు దాచారు? దాచాల్సిన అవసరమేమిటి. ఏదైనా అడిగితే సంవత్సరాల తరబడి సమాధానమివ్వరు. ఇదివరకు బుర్ర కథలని చెప్పుకునే వాళ్లం. కానీ ఇకనుంచి బుగ్గన కథలని చెప్పుకోవాలేమో. రాష్ట్ర ప్రభుత్వమిచ్చిన జీవోని నమ్మాలా...లేక ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కోర్టుకి చెప్పింది నమ్మాలా...లేక శాసనసభకు ప్రభుత్వమిచ్చిన తప్పుడు సమాచారం నమ్మాలా? ఇవేవీకాకుండా రుణాలకోసం బ్యాంకులకు ఏమని గ్యారంటీ ఇచ్చారో అది తెలుసుకోవాలా? బ్యాంకుకు ఏమని చెప్పారో, ఏమని గ్యారంటీ ఇచ్చారో ప్రభుత్వం ఎందుకు శాసనసభ ముందుంచ లేదు? ప్రశ్నిస్తున్న తమకు సమాధానంచెప్పకపోయినా, ప్రజలకుచెప్పాలికదా? రూ.25వేలకోట్ల రుణం తాలూకా వివరాలు, బ్యాంక్ గ్యారంటీ వివరాలు దాచినట్లు, ఈపాలకు లు ఇంకెన్ని దాచారో?

Advertisements

Advertisements

Latest Articles

Most Read