ముఖ్యమంత్రిగా చేసిన తొలిప్రసంగంలోనే టీడీపీప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్లఒప్పందాల్లో అవకతవకలు, భారీ అవినీతిజరిగిందని, తమప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపి, నిజానిజాలు నిగ్గుతేలుస్తుందనిచెప్పి, నాలుగేళ్లుగా అబద్ధాలతో ప్రజల్ని నమ్మించి, విద్యు త్ ఛార్జీలభారంతో వారిని జగన్ రెడ్డి కుంగదీస్తున్నాడని టీడీపీఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావులకేశవ్ స్పష్టంచేశారు. జూమ్ ద్వారా మంగళవారం విలేకరులతో కేశవ్ మాట్లాడిన వివరాలు, క్లుప్తంగా ఆయన మాటల్లోనే మీకోసం...! “జగన్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల టెండర్ల విషయంలో, తన అనుకున్నవాళ్లకు మేలుచేస్తూ, ప్రభుత్వానికి నష్టంచేస్తూ, ప్రజలపై భారం మోపుతోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చేసిన తొలిప్రసంగంలోనే తెలుగుదేశం ప్రభుత్వం, సౌర, పవన విద్యుత్ కొనుగోళ్లలో అనుసరించిన విధానాల్లో అనేక అక్రమాలు జరిగాయని, వాటిపై తమప్రభుత్వం విచారణ చేస్తుందన్నాడు. తరువాత అసెంబ్లీలో కూడా పదేపదే అదేతరహా ఆరోపణలుచేసి, ఉన్నదిలేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పి, ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నించాడు. అసలు నిజంగా చంద్రబాబుగారి హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి జరిగిందా? దానిగురించి తేల్చడానికి జగన్ రెడ్డి ప్రభుత్వం విచారణ కమిటీలు వేశారు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ తలుపుకూడా తట్టి, చివరకు అభాసుపాలయ్యారు.

సూదిమొనంత అవినీతికూడాలేదని హైకోర్టు స్పష్టంచేసింది.... జగన్ రెడ్డి చేసిన నిరాధార ఆరోపణలపై నాలుగేళ్ల తర్వాత హైకోర్టు ఏంచెప్పిందయ్యా అంటే చంద్రబాబుగారి హాయాంలో విద్యుత్ రంగ ఒప్పందాల్లో సూదిమొనంత అవినీతి జరిగినట్లు నిర్దారించలేకపోయారని, అదే నిజమని స్పష్టంచేసింది. హైకోర్టు వాదనతో వైసీపీప్రభుత్వం కూడా అంగీకరించింది. అంగీకరించడమేకాక, టీడీపీప్రభుత్వంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ప్రభుత్వవాటాగా నిధులు విడుదల కూడా ప్రారంభించింది. కానీ అత్యుత్సాహంతో గతంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన వల్ల రాష్ట్రంలో విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకున్న సంస్థలు వెనక్కుతగ్గాయి. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రిపై ఒత్తిడివచ్చింది. అంతర్జాతీయంగా అనేకసంస్థలు, ప్రభుత్వాలు చివరకు ప్రధానమంత్రి కార్యాలయంపైనే ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఇవాళ పరిస్థితి ఏమిటయ్యా అంటే విద్యుత్ రంగంలో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలవల్ల దేశమంతా ఏపీప్రభుత్వాన్ని నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. నిజంగా అసలు ఈ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ రంగానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు అన్నీకూడా సదరు రంగాన్ని దెబ్బతీసేవే.

తనవాళ్లకు కట్టబెట్టడానికే జగన్ రెడ్డి, చంద్రబాబుప్రభుత్వంలోని టెండర్లన్నీ రద్దుచేశాడు... సోలార్ విద్యుత్ పై పెద్దఎత్తున దుష్ప్రచారంచేసి, మరలాటెండర్లు పిలిచిన జగన్ సర్కారు అయినవారికి కట్టబెట్టాలని చూసింది. అందుకోసమే టీడీపీప్రభుత్వంలో పిలిచిన టెండర్లను రద్దుచేసింది. ఆక్రమంలోనే అదానీ సంస్థకు కట్టబెట్టాలనిచూస్తే, దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్ఠలున్న టాటా సంస్థ జగన్ సర్కారు నిర్ణయంపై కోర్టును ఆశ్రయిం చింది. అదానీ గ్రూపు కు ఏకపక్షంగా టెండర్లు కట్టబెట్టడం తప్పనిచెప్పిన న్యాయస్థానం చివరకు ప్రభుత్వ నిర్ణయా న్ని రద్దుచేసింది. మూడేళ్లక్రితం కేంద్రప్రభుత్వ సంస్థ సెకీ పిలిచిన టెండర్లను పరిగణనలోకి తీసుకొని ఏపీ ప్రభుత్వం అదానీ సంస్థతో ఒప్పందానికి సిద్ధమైంది. కేంద్రసంస్థ సెకీ సంస్థ ప్రతినెలా టెండర్లు పిలుస్తోంది. కానీ ఏప్రీ ప్రభుత్వం మూడేళ్లనుంచి టెండర్లలో ఎందుకు పాల్గొనలేదు? టెండర్లు పిలవమని సెకీని ఎందుకు కోరలేదు? అన్ని రాష్ట్రాలు తిరస్కరించిన టెండర్లని ఏపీ ఎందుకు ఆమోదించింది? టెండర్లు తీసుకునేవాళ్లు తమకు కావాల్సినవాళ్లని రాష్ట్రపాలకులు ఒప్పుకున్నారా? తమకు బంధువులన్న ఒకేఒక్క బ్యాక్ గ్రౌండ్ నే జగన్ రెడ్డి అర్హతగా భావించారా?

దేశమంతా తిరస్కరించిన టెండర్లను ఏపీ ఎందుకు ఆమోదించింది? దేశంలో దాదాపు అన్నిరాష్ట్రాలు తిరస్కరించిన టెండర్లను ఏపీలో అమోదించాలని చూశారు. అందుకు కారణం తమ అనుకున్నవాళ్లకు న్యాయంచేయడానికే. చౌకగా లభించే పవన విద్యుత్ కొనుగోలుచేయకుండా, పవర్ ఎక్సేంజ్ లో ప్రైవేట్ విద్యుత్ సంస్థలవద్ద నుంచి ఎక్కువధరకు విద్యుత్ కొనడానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రంలో పవన విద్యుత్ తయారుచేసే సంస్థలు కోర్టుకు వెళ్లాయి. బయట మార్కెట్ లో అధికధరకు విద్యుత్ కొనడాన్ని తప్పుపట్టిన న్యాయస్థానం, రాష్ట్రంలోని సంస్థలనుంచి విద్యుత్ కొనకపోయినా, ఒప్పందంప్రకారం వాటికి చెల్లించాల్సిన సొమ్ముని చెల్లించాల్సిందే అని జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో జగన్ రెడ్డి సర్కారు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టైంది. కొన్నది ఒక యూనిట్ అయితే, కోర్టు ఆదేశాలతో రెండుయూనిట్లకు డబ్బుకట్టాల్సిన పరిస్థితికి వైసీపీప్రభుత్వం వచ్చింది. అంతిమంగా వైసీపీప్రభుత్వ అనాచలోచిత నిర్ణయంవల్ల ప్రజలపై భారంపడింది. గతంలో ఈ రాష్ట్రానికి వచ్చారన్న అక్కసుతో, విద్యుత్ సంస్థలను భయపెట్టడానికి జగన్ రెడ్డిచేసిన అనాలోచిత నిర్ణయాల తాలూకా భారం అంతిమంగా ప్రజలపై పడింది.

పాలకులు నష్టపోయినా పర్వాలేదు... ప్రజలు నష్టపోకూడదన్నదే తమ ఉద్దేశం. వైసీపీప్రభుత్వ నిర్ణయాలతో పాలకుల కడుపుకాలితే పర్వాలేదు. కానీ ప్రజలు నష్టపోవడం ఏమిటన్నదే తమ ప్రశ్న. ముఖ్యమంత్రి తనవాళ్లను బాగుచేయడంకోసం ప్రజలపై భారీగా విద్యుత్ ఛార్జీలభారం వేయడాన్ని టీడీపీ తీవ్రంగా తప్పుపడుతోంది. విద్యుత్ రంగంలో మార్పులపేరుతో వ్యవసాయ మోటార్లకుమీటర్లు పెట్టే నిర్ణయంపై నేడు కేబినెట్ లో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది. ముఖ్యంగా పవన విద్యుత్ కి సంబంధించి చంద్రబాబుగారి హాయాంలో పంప్ డ్ స్టోరేజ్ విధానం అనే ప్రయోగాత్మక ప్రక్రియకు శ్రీకారంచుట్టారు. చంద్రబాబు గారి పంప్ డ్ స్టోరేజ్ నిర్ణయం సరైనదని భావించిన జగన్ రెడ్డి, ఆ విధానాన్ని సమర్థిస్తూ, దానివల్ల లాభాలున్నాయని భావించి, తమకునచ్చిన సంస్థలైన అరబిందో, గ్రీన్ కో లాంటి వాటికి రాష్ట్రప్రజానీకానికి సంబంధించిన ఆస్తుల్నికట్టబెట్టే ప్రయత్నంచేశాడు. పంప్ డ్ స్టోరేజ్ కు సంబంధించి జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కేంద్రప్రభుత్వ విధానాలకు, సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం. సహజ వనరుల్ని ఎవరికైనా అప్పగించాలంటే, దానికి సంబంధించిన విధివిధానాలు పారదర్శకంగా ఉండాలి. కానీ జగన్ ప్రభుత్వం ఏకపక్షంగా, నామినేషన్ విధానంలో పంప్ డ్ స్టోరేజ్ కు సంబంధించిన కాంట్రాక్టులు కట్టబెట్టాలని చూసింది. దానిపై సర్వేచేయడంకోసం నెడ్ క్యాంప్ సంస్థతో వందలకోట్లు వెచ్చించి సర్వేలు చేయించారు. పంప్ డ్ స్టోరేజ్ విధానం టెండర్లు ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం ఏమిటి.. దానికోసం ప్రజలసొమ్ముతో సర్వేలు చేయించడం ఏమిటి?

కేంద్రనిబంధనలు కాదని, సుప్రీంకోర్టుతీర్పుకు విరుద్ధంగా పంప్ డ్ స్టోరేజ్ విధానంలో ప్రభుత్వం టెండర్లు కట్టబెట్టడం ఏమిటి? కేంద్రప్రభుత్వ నిబంధనలు కాదని, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఈ ప్రభుత్వం టెండర్లు ఎలా కట్టబెడుతుందని ప్రశ్నిస్తున్నా. విద్యుత్ రంగంపై తాను లేవనెత్తిన అనేక అంశాలపై ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. కనీసం ముఖ్యమంత్రి తన విశ్వసనీయతను నిరూపించుకోవడానికైనా నేడు తాను లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాలి. పంప్ డ్ స్టోరేజ్ కి సంబంధించి వైసీపీప్రభుత్వం ఏ విధానాలను అనుసరించి, నచ్చిన సంస్థలకు టెండర్లుకట్టబెట్టడానికి సిద్ధమైందో చెప్పాలి. గతంలో ఇదేతరహా పద్ధతిని రాజశేఖ ర్ రెడ్డి అనుసరించారు. ఇప్పుడు జగన్ రెడ్డి ఫాలో అవుతున్నారు. లక్షకోట్ల విలువైన పంప్ డ్ స్టోరేజ్ విధానం టెండర్లు కూడా అడ్డగోలుగా ఎలా కట్టబెడతారు? ప్రభుత్వ నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు ఒనగూర్చడంలేదు.

దేశమంతా చంద్రబాబు విద్యుత్ సంస్కరణలు అమలయ్యాయి.... 1999లో దేశమంతా విద్యుత్ రంగం సంక్షోభంలోఉన్నప్పుడు చంద్రబాబునాయుడు గారు ఏపీలో త్వరితగతిన విద్యుత్ ఉత్పత్తిసాధించేదిశగా ఆలోచనచేసి, కొత్త ప్రాజెక్ట్ లకు శ్రీకారం చుట్టారు. అప్పటివరకు పవర్ ప్రాజెక్ట్ నిర్మాణమంటే కనీసం 5 నుంచి 7 ఏళ్లు పట్టేది. కానీ చంద్రబాబుగారు కేవలం 18నెలల్లో పూర్తయ్యేలా ప్రణాళికలు వేశారు. కానీ దానిపై రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్షనేతగా తప్పుడు ఆరోపణలుచేశాడు. తరువాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు అన్నీ సరైనవేనని సమర్థించాడు. తరువాత దేశ వ్యాప్తంగా విద్యుత్ రంగంలో చంద్రబాబుగారు తీసుకొచ్చిన సంస్కరణలు అమలయ్యాయి. మరలా 2014తర్వాత బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి భారంగా మారిందని, కాలుష్యం పెరుగుతోందని భావించి, పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి దిశగా చంద్రబాబు ఆలోచనచేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి దానిపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. కానీ ఆయన అధికారంలోకి వచ్చేనాటికి కోర్టులు విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో సూదిమొనంత అవినీతిజరిగినట్టు కూడా ఆధారాలు లేవని తేల్చేశాయి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తప్పు తెలుసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబుగారికి క్షమాపణ చెప్పేంత పెద్దమనసు ఆయనకు ఎలాగూలేదు కాబట్టి, ప్రజలకు చెప్పమంటున్నాం. తుపానుతో పంటలుదెబ్బతిని, ధాన్యానికి, పంట ఉత్పత్తులకు గిట్టుబాటుధరలేక రైతులు గగ్గోలుపెడుతుంటే, ముఖ్యమంత్రేమో ప్రతికుటుం బానికి రూ.1000 ఇవ్వండి. ఎకరాకు రూ.2వేలు ఇవ్వండి అంటూ, దానికికూడా సవాలక్ష నిబంధనలు పెడుతున్నారు. ప్రజలకు ఉచితంగా ఇవ్వడానికి ఎక్కడలేని నిబంధనలు పెడుతున్న జగన్ రెడ్డి, టెండర్లకట్టబెట్టే విషయంలో మాత్రం సంస్థలకు అన్నీ ఉచితంగానే ఇస్తామనడం ఎంతవరకు న్యాయం?

టెండర్ల నిర్ణయాలు పారదర్శకంగానే ఉండాలి... రాష్ట్రప్రభుత్వం పీఎస్పీ అగ్రిమెంట్లపై పునసమీక్ష చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పారదర్శక విధానంద్వారానే, విద్యుత్ టెండర్లతాలూకా నిర్ణయాలు తీసుకోవాలని టీడీపీతరుపున డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ కొనుగోళ్లతాలూకా టెండర్లపై జగన్ రెడ్డి చేసిన నిరాధార ఆరోపణల్ని నాలుగేళ్లనుంచి మౌనంగా భరించాము. ఇప్పుడు న్యాయస్థానాలు సూదిమొనంత అవినీతిజరిగినట్టు కూడా ఆధారాలు లేవని తేల్చేసింది. ఇక జగన్మోహన్ రెడ్డి కాండక్ట్ తో మాకు పనిలేదు. చంద్రబాబుగారి విధానాలతో లాభాలున్నాయని భావించినందునే జగన్ రెడ్డి, తనకు నచ్చినవారికి టెండర్లు కట్టబెట్టడానికి సిద్ధమయ్యాడు. పీపీఏ (పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్) లు 20ఏళ్ల కాలవ్యవధితో ముగుస్తాయి. పీపీఏల్లో విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన ధరలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాలనుంచి ఉన్నవే. చంద్రబాబుగారి హయాంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు తప్పన్న జగన్ , వాటికాలపరిమితిని 25 ఏళ్లనుంచి ఇంకాపెంచడానికి ఎందుకుసిద్ధమయ్యారు? ప్రజలకు లాభంకలిగేలా వైసీపీప్రభుత్వం విద్యుత్ టెండర్లు కట్టబెడితే, అన్నిఅంశాలు వివరణాత్మకంగా చెప్పాలికదా!
గతంలోకూడా తాను విద్యుత్ కొనుగోళ్లపై లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పకుండా శ్రీకాంత్ అనే అధికారి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రిగా తొలిసభలోనే జగన్ రెడ్డి తమప్రభుత్వంపై చేసిన ఆరోపణలు తప్పని తేలిపోయింది. ఇప్పుడు ఆయన గతప్రభుత్వం తీసుకున్న టెండర్లు రద్దుచేసి, కొత్తగా టెండర్లు పిలవాలి. టెండర్లలో పాల్గొనే కంపెనీల బ్యాక్ గ్రౌండ్ ని తాముతప్పుపట్టడం లేదు, అనుసరించిన విధానాన్నే తప్పుపడుతున్నాం.

అవినీతి బయటపడుతుందనే జగన్ ప్రభుత్వం పీఏసీ కార్యకలాపాలు జరపడంలేదు... విద్యుత్ రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ, పీఏసీ ఛైర్మన్ గా గతంలో తాను విద్యుత్ శాఖ కార్యదర్శికి 11లేఖలు రాస్తే సమాధానమే లేదు. నాకున్న వ్యక్తిగత సంబంధాలతోనే సమాచారం సేకరించి, ప్రజలముందు ఉంచుతున్నాను. అవినీతి బయపడుతుందనే ఈ ప్రభుత్వం పీఏసీ వ్యవస్థనే నిర్వీర్యంచేసింది. పీఏసీ పనిచేయకూడదనే కమిటీలోని 7 ఖాళీలను ప్రభుత్వం భర్తీచేయడంలేదు ప్రభుత్వం తీసుకున్న అప్పులు శాసనసభదృష్టికి రాలేదని నేను ఎప్పుడైతేచెప్పానో, అప్పటినుంచే పీఏసీ కార్యకలాపాలపై ప్రభుత్వం కక్షకట్టింది. అప్పులపై బుగ్గనగారు వింత వితండవాదనలు చేసి, కేంద్రం మొట్టికాయలు వేసేసరికి తరువాతి అసెంబ్లీ సమావేశాల్లో సమాచారం బయటపెట్టారు. పీఏసీ యాక్టివ్ గా ఉంటే ప్రజలకు ఎంతమేలు జరుగుతుందో, ప్రభుత్వానికి కూడా అంతే మేలు జరుగుతుంది” అని పయ్యావుల పేర్కొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read