వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ సూత్రాలకు, ఆర్బీఐ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తూ అప్పుల కోసం రహస్య ఒప్పందాలు చేసుకుంటోందని టీడీపీ సీనియర్ నాయకులు, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రభుత్వ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం నాడు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ....పరిపాలనలో భాగంగా ప్రభుత్వాలు అప్పులు చేయటం సహజమే కానీ, అవి రాజ్యాంగ మౌళిక సూత్యాలకు ఆర్బీఐ నిభందనలకు అనుగుణంగా ఉండాలి. కానీ వైసీపీ ప్రభుత్వం నిభంధనలకు విరుద్దంగా అప్పుల కోసం ఇస్టానుసారంగా ఒప్పందాలు చేసుకుంటోంది. మద్యంపై వచ్చే ఆదాయాన్ని బ్యాంకులకు పూచీకత్తుగా చూపి ఎస్ర్కూ షరతులతో ఏపీ అభివృద్ది సంస్ధ ద్వారా రూ. 25 వేల కోట్లు అప్పు చేసింది. ఇందుకు సంబందించి ఒప్పందాలు చేసుకుని జీవోలు 81,90,91,92 కూడా ఇచ్చారు, ప్రభుత్వం ఏ అప్పు చేసినా ఏ గ్యారీంటీలు ఇచ్చినా అసెంబ్లీ బడ్జెట్ పుస్తకం పోందుపరచి అసెంబ్లీకి తెలపాలి. కానీ ఈ అప్పును అసెంబ్లీ పుస్తకంలో చూపకుండా అసెంబ్లీకి తెలపకుండా దాచారు. దీనిపై వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి నేను లేఖ రాసి 10 రోజులు గడిచినా సమాధానం ఇవ్వలేదు. కానీ గత 2 రోజులు క్రితం ఆర్దిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ ఓ టీవీ చానల్ ఇంటర్యూలో మాట్లాడుతూ 25 వేల కోట్ల అప్పుకు సంబందించి బ్యాంకులకు ఎలాంటి గ్యారెంటీలు ఇవ్వలేదని చెప్పారు. అందుకే దాని గురించి అసెంబ్లీ పుస్తకంలో రాయలేదని చెప్పారు, మరి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులతో ఏపీ డెవలప్ మెంట్ కార్పోరేషన్, ఎస్ర్యూ ఒప్పందాలు చేసుకుంది, దానిపై రాష్ర్ట ప్రభుత్వ అధికారులు, బ్యాంకు ప్రతినిధుల సంతకాలు కూడా చేశారు. మరి ఇదేంటి? ఆ ఒప్పందాల్లో ఈ వివరాలు బయటకు చెప్పొద్దని పొందుపరిచారు, అధికారిక ఒప్పందాల్లో రహస్యం ఎందుకు?

payyavula 22072021 2

ఇదేమైనా ఇద్దరు వ్యక్తుల మద్య జరిగే ఒప్పందం కాదు కదా? వచ్చిన ఆదాయాన్ని రాష్ట్ర ఖజానాకు రాకుండా నేరుగా అప్పు ఇచ్చిన వారికే జమచేస్తాం అని ఒప్పందంలో పేర్కొన్నారు. కానీ కోర్టుకి ఏమో ఈ విషయం చెప్పకుండా దాచారు. రాజ్యాంగ మౌళిక సూత్య్రాలకు విరుద్దంగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. భవిష్యత్లో వచ్చే ఆదాయం కూడా చూపి సెక్యూరిటి పెట్టి అప్పులు తెచ్చింది, దీనికి కేంద్రం అనుమతి ఉందా? ఆర్బీఐ కి తెలిపారా? సహజంగా ఒప్పందంపై ప్రభుత్వం వైపు నుంచి గవర్నర్ తరపున అధికారులు సంతకాలు చేస్తారు, ఈ ఒప్పం ఉల్లంఘలను జరిగితే కేసులు అయినా వేసుకోవచ్చని ఒప్పందం చేసుకున్నారు. సార్వభౌమాదికార రక్షణను కూడా వదులుకునేలా ఒప్పుకున్నారు. అప్పులు ఇస్తే చాలు ఏ ఒప్పందం అయినా చేసుకుంటాం, ఎక్కడైనా సంతకాలు పెడతాం అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మ్యదం డిపోలను నుంచి వచ్చే ఆదాయం ఆదాయాన్ని పూచీకత్తుగా పెట్టారంటే మరి మీర ఎన్నికల్లో ఇచ్చిన మద్యపాన నిషేదం హామీ సంగతేంటి? మద్యంపై వచ్చే 25 ఏళ్లపాలు మద్యంపై వచ్చే ఆదాయాన్ని పూచీకత్తుగా చూపారంటే మద్యపాన నిషేదం చేసే ఉద్దేశం లేనట్టే కదా. ఈ ఒప్పందం అసెంబ్లీ బుక్కులో లేదు కాబట్టి ప్రభుత్వం మారితే ఇది చెల్లుతుందా? ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించటం సరికాదు. ఇప్పటికైనా ఈ ఒప్పందాల్లో రహస్యాలు ప్రజలకు బహిర్గతం చేయాలని పయ్యావుల కేశవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read