టిడిపి నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటే చాలు, ప్రభుత్వానికి వణుకు మొదలవుతుంది. గతంలో చేసిన అప్పు వివరాలు, అప్పు దాచటం, అప్పు దారి తప్పటం, ఇలా అనేక వివరాలకు ఇప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి సరైన సమాధానం లేదు. ఇప్పుడు తాజాగా పయ్యావుల మరో సంచలన ఆరోపణ చేసారు. అదే సోలార్ పవర్ కొనుగోళ్ళలో గోల్ మాల్ గురించి. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 9వేల మెగావాట్ల ఒప్పందం, ఆఘమేఘాల మీద 24 గంటల్లో జరిపోవటం, ఇందులో లోటు పాట్లు, తక్కువ రేటుకు వస్తున్నా, ఎక్కువ రేటు పెట్టి కొనటం, ప్రభుత్వం చెప్తున్న లెక్కలు గురించి పయ్యావుల ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పారు. పయ్యావుల చేసిన మొదటి ఆరోపణ, యూనిట్ రూ. 2.49 పైసల కాంటే తక్కువగా ఇతర రాష్ట్రాలు కొంటుంటే, మనమెందుకు యూనిట్ రూ. 2.49 పైసల పెట్టి కొంటున్నాం ? యూనిట్ రూ. 2.49 పైసలు కూడా అబద్ధం అని, ఈ విద్యుత్ రాజస్తాన్ లో తయారు అవుతుందని, ఇది ఏపి వచ్చేసరికి రూ.4 అవుతుందని, ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తుందని అన్నారు. అయితే పయ్యావుల వ్యాఖ్యల పై, మంత్రి బాలినేని ఒక ప్రకటన విడుదల చేసారు. అందులో ఆయన చెప్పింది, పయ్యావుల ఆరోపణలు తప్పు, తాము యూనిట్ రూ. 2.49 పైసలకే కొంటున్నాం అని రాసారు.

payyaavula 08112021 2

కొంటున్నారు సరే, చివరకు ఏపికి వచ్చే సరికి రూ.4 పైన అవుతుంది కదా అనే ఆరోపణలకు మంత్రిగారి సమాధానం రాలేదు. అయితే నిన్న ఆదివారం అయినా కూడా ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ మీడియా సమావేశం పిలిచారు.నిజానికి శనివారమే ఈ సమావేశం ఉండాల్సి ఉండగా, మీడియాను పిలిచిన తరువాత, గంట సేపు అయిన తరువాత, మీడియా సమావేశం రద్దు చేసుకున్నారు. మళ్ళీ విమర్శలు రావటంతో, నిన్న ఆయన మీడియా సమావేశం పెట్టి వివరించారు. ఇతర రాష్ట్రాలు తక్కువకు వస్తున్నాయి అంటే, అది తమకు సంబంధం లేదని, మన రాష్ట్రానికి ఎంత కోట్ చేసారో, దాని ప్రకారమే వెళ్ళాం అని అన్నారు. ఇక యూనిట్ ధర గురించి చెప్తూ, అసలు నిజం ఒప్పుకున్నారు. ఆదానీ కంపెనీకి చెల్లించేది యూనిట్ కు రూ. 2.49 కే అని, అది ఏపికి వచ్చే సరికి కేంద్ర, రాష్ట్ర ట్రాన్స్ మిషన్ చార్జీలు, అలాగే నిర్వహణ ఖర్చులు కలిపి, మరో రూ.1.67 పైసలు అవుతుందని, అంటే మొత్తం యూనిట్ చార్జీ రూ.4.16 పైసల అవుతుందని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఒప్పుకున్నారు. మంత్రి బాలినేని తెలివగా సమాధానం చెప్తే, అధికారి మాత్రం ఉన్నది ఉన్నట్టు చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read