పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెడుతుందో చూస్తున్నాం. ఒక పక్క డబ్బులు ఇవ్వకపోగా, మరో పక్క కొన్ని ఆకృతుల డిజైన్లు కూడా ఆమోదించకుండా, అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటివరకు ప్రాజెక్టుకు రూ.15,013 కోట్లు ఖర్చయ్యింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక రూ.9,877 కోట్లు వెచ్చించగా, కేంద్రం నుంచి రూ.6,720 కోట్లు వచ్చాయి. ఇంకా రూ.3150 కోట్లు రావాల్సి ఉంది. ఈ ఖర్చు పై, రాష్ట్రానికి వడ్డీ భారం మళ్ళీ అదనం. అయితే కేంద్రం ఇలా ఇబ్బందులు పెడుతుంటే, రాష్ట్రంలో ప్రజలు మాత్రం, తమ వంతు సహాయం చేస్తూ ముందుకు వస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి పోలవరం యాత్ర పేరుతో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం తెలిసిందే. అన్ని జిల్లాల నుంచి రైతులు, పోలవరం నిర్మాణం చూడటానికి వస్తున్నారు.

polavaram 29102018 2

ఈ క్రమంలో, గుంటూరు జిల్లా, పెదరావూరు రైతులు కూడా పోలవరం చూడటానికి వచ్చారు. ఇక్కడకు వచ్చిన తరువాత, వాళ్ళు కేంద్రం ఇబ్బంది పెడుతున్న తీరు చూసి, వారి వంతుగా సహాయం చేసి, కేంద్రం సిగ్గు పడేలా, మీరు సహాయం చెయ్యకపోతే, మేము కట్టుకుంటాం అనే మెసేజ్ ఇస్తూ, కేంద్రం చెంప చెల్లు మనేలా, ఆ ఊరి రైతులు అందరూ కలిసి విరాళం ఇచ్చారు. పోలవరం నిర్మాణం కోసం ఏకంగా రూ. 16,45,101 సీఎం చంద్రబాబును కలిసి ఇచ్చారు. తెనాలి మండలం, పెదరావూరి గ్రామానికి చెందిన రైతులు ఒకసారి ఇంత పెద్ద మొత్తాన్ని అందజేశారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంవల్ల తమ పంట పొలాలకు పంట నీరు అందుతోందని, అందుకు కృతజ్ఞతగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తమ వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నామని రైతులు పేర్కొన్నారు.

polavaram 29102018 3

పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరిచ్చి ఆదుకుంది చంద్రబాబేనని రైతులు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అడుగడుగునా అడ్డుపడినా, విపక్షాలు రాద్దాంతం చేసినా తాము మాత్రం అండగా నిలుస్తామని రైతులు స్పష్టం చేశారు. ఈ మేరకు రైతులు అమరావతి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విరాళం అందజేశారు. పోలవరం నిర్మాణాన్ని సవాలుగా తీసుకున్నామని, ఏదిఏమైనా వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేయాలనేదే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ ఏడు నెలలే కీలకమని.. ఎగువ, దిగువ కాపర్‌డ్యామ్‌లు పూర్తి చేస్తే ప్రాజెక్టునుంచి నీళ్లివ్వగలమని తెలిపారు. ‘డిసెంబరులో గేట్ల పనులను ప్రారంభిస్తాం. మే 15, 20 తేదీలనాటికి పూర్తి చేస్తాం. స్పిల్‌ఛానల్‌, స్పిల్‌వే పూర్తి చేసి కుడి, ఎడమకాల్వలకు నీళ్లందిస్తాం. ఇది పూర్తి చేయగలిగితే అటు విశాఖ, ఇటు కృష్ణా జిల్లాలు సస్యశ్యామలం కావడంతోపాటు అన్ని జిల్లాలకు లాభం చేకూరుతుంది. వంశధార నుంచి పెన్నా వరకు అన్ని నదులనూ అనుసంధానించి నీరు ఎక్కువ, తక్కువలను సరిచేసుకునే వెసులుబాటు ఉంటుంది’ అని సీఎం వివరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read