ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రగడ మొదలైంది. అదే జిల్లాల విభజన. దీని పై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతుంది. అలాగే చాలా వైపుల నుంచి, వ్యతిరేకత కూడా వస్తుంది. అయితే దీని పై మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశంలో, ఈ విషయం పై చర్చించారు. జిల్లాల విభాజన పై ఒక కమిటీ వెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. కమిటీ నివేదిక ఆధారంగా, జిల్లాల విభజన చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల విభజన పై, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కమిటీ నివేదిక రాకముందే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 25 నుంచి 26 రాష్ట్రాలు ఉంటాయి అంటూ, చెప్పుకొచ్చారు. రెండు నెలల్లోనే జిల్లాల పునర్విభజన ప్రకటన పూర్తి కానుందని, చెప్పారు.కమిటీ కార్యకలాపాలు ప్రారంభం కాక ముందే, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఇప్పటికే జిల్లాల పునర్విభజన పై రచ్చ మొదలైంది.
వెరైటీగా ప్రతిపక్ష పార్టీల కంటే, సొంత పార్టీ నేతల నుంచి, వైసిపీ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది. శ్రీకాకుళంలో సీనియర్ నేత ధర్మాన, బహిరంగ వేదిక పైనా, విమర్శలు గుప్పించారు. ఇక గోదావరి జిల్లాల ప్రజలు, గోదావరి అనే పదం లేకుండా, జిల్లా ఉంటే ఒప్పుకోం అంటున్నారు. అలాగే జిల్లా కేంద్రంగా ఈ ప్రాంతం ఉండాలి , ఆ ప్రాంతం ఉండాలి అంటూ, రచ్చ మొదలైంది. ఇవన్నీ ఉండగానే, మంత్రి, నివేదిక రాక ముందే చెప్పేస్తున్నారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ "కొంత మంది అఫిషయల్స్ తో కమిటీ వేసాము. ఆ కమిటీ నివేదిక రెండు నెలల్లో వస్తుంది. 25 కానీ, 26 కానీ, నివేదికను బట్టి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయిస్తారు." అని పెద్దిరెడ్డి అన్నారు.