ఒక పక్క మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకున్నారు అంటూ, టీవీల్లో హోరెత్తిస్తుంటే, మరో పక్క మంత్రులు మాత్రం, వేరే అభిప్రాయంతో ఉన్నారు. అమరావతి రైతుల విజయం అంటారు ఏంటి, వాళ్ళు పైడ్ ఆర్టిస్ట్ లు, ఆ పైడ్ ఆర్టిస్ట్ లు, చేసే పాదయాత్రకు తాము భయపడటం ఏమిటి ? మేము వెనక్కు తగ్గటం ఏమిటి ? అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటున్నారు. తాము రైతులకు భయపడి ఏమి చట్టం ఉపసంహరించుకోలేదుని, చట్టం ఉపసంహరణ అనేది ఇంటర్వెల్ మాత్రమే అని, అసలు సినిమా ముందు ఉందని అన్నారు. శుభం కార్డు పాడటానికి మరింత సమయం ఉందని అన్నారు. సాంకేతిక సమస్యలు ఉన్నాయి కాబట్టి, అవి సరిదిద్దుకునేందుకే, ఈ నిర్ణయం తీసుకున్నాం అని అన్నారు. తాను ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాను అని అన్నారు. ఇదేమీ అమరావతి రైతుల విజయం కాదని అన్నారు. అక్కడ ఎమన్నా లక్షల లక్షల మందితో పాదయాత్ర సాగుతుందా అని అన్నారు. మరి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఏమి చెప్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read